newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సచివాలయం కూల్చివేత అప్పుడే ఎందుకు? హైకోర్టు స్టే

13-02-202013-02-2020 07:59:56 IST
Updated On 13-02-2020 16:42:43 ISTUpdated On 13-02-20202020-02-13T02:29:56.087Z13-02-2020 2020-02-13T02:29:13.805Z - 2020-02-13T11:12:43.483Z - 13-02-2020

సచివాలయం కూల్చివేత అప్పుడే ఎందుకు? హైకోర్టు స్టే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. చకచకా పాత సచివాలయాన్ని కూల్చేయాలని, కొత్త సచివాలయం నిర్మాణం చేపట్టాలని భావిస్తున్న తెలంగాణ సర్కార్ ప్రయత్నాలకు హైకోర్టు బ్రేకులేసింది.  నూతన సచివాలయం నిర్మాణంపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ సచివాలయంలో ఉన్న భవనాలను కూల్చివేయరాదని న్యాయస్థానం​ స్పష్టం చేసింది. 

దీంతో పాటు సచివాలయం నిర్మాణంపై మంత్రివర్గం పూర్తి తుది నమూనా నివేదిక తీసుకుని కోర్టుకు రావాలని ఆదేశాలు ఇచ్చింది. ఎలాంటి డిజైన్లు సిద్ధం కానప్పుడు ఎందుకు సచివాలయం భవనాలు కూల్చివేత చేపట్టారని సూటిగా ప్రశ్నించింది.  గత విచారణలో కూల్చివేతపై ప్రభుత్వాన్ని హైకోర్టు సమగ్ర నివేదిక కోరింది. అయితే నివేదిక ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం చేయలేదని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. 

మరి డిజైన్లు, ప్లాన్‌ పూర్తి కానప్పుడు కూల్చివేతకు ప్రభుత్వం ఎందుకంత తొందరపడుతోందని హైకోర్టు ప్రశ్నించింది. అవసరమైన సాంకేతికత అందుబాటులో ఉన్నా ఇంకా డిజైన్‌, ప్లాన్‌ ఇంకా సిద్ధం కాలేదని చెప్పడంలో అర్థం లేదని వ్యాఖ‍్యానించింది.

కూల్చివేతకు నిర్ణయం తీసుకున్న కేబినెట్‌ మరి.. డిజైన్‌ ప్లాన్‌ కోసం నిర్ణయం ఎందుకు తీసుకోలేదని, నూతన సచివాలయం మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకునేవరకూ ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేబినెట్ ఆమోదించబోయే డిజైన్లు, ప్లాన్లను కోర్టుకు అందజేయాలని నిర్దేశించింది.హైకోర్టు నిర్ణయంతో ప్రభుత్వం డిజైన్లపై ఫోకస్ పెట్టనుంది. సచివాలయం నిర్మాణంపై విపక్షాలు సైతం విమర్శలు చేస్తున్న వేళ హైకోర్టు వ్మాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

చదవండి : కొత్త సచివాలయం అవసరమా? హైకోర్టు కీలక ప్రశ్నలు

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   4 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   5 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   5 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   9 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   10 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   8 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   11 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   11 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   6 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   13 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle