newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు *మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు *నేడు మహాశివరాత్రి... శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మర్మోగుతున్న ఆలయాలు *వేములవాడ రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు *శ్రీశైలంలో రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, అమ్మవార్ల కల్యాణోత్సవం *పంచాయితీరాజ్ చట్టంలో సవరణలపై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ. గత కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గించిన ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆర్డినెన్స్ *వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్ పై విచారణ. సిట్ విచారణను సీల్డ్ కవర్ లో అందజేసిన ఏజీ. సిట్ విచారణ దాదాపుగా పూర్తి కాబోతుందని, ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదన్న ఏజీ.కేసు జనరల్ డైరీ, కేసు డైరీ ఫైల్స్ ను సోమవారానికి సమర్పించాలని ఏజీని ఆదేశించిన ఏపీ హైకోర్టు*అమరావతి: చంద్రబాబు, లోకేష్ అత్యంత అవినీతిపరులు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఆస్తుల ప్రకటన-ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి *తిరుపతి: రుయా హాస్పిటల్ లో ఆవరణలో సైకోల వీరంగం. రుయా సెక్యూరిటీ సిబ్బందితో సైకోల వాగ్వాదం. బ్లేడులతో గాయపరుచుకున్న నలుగురు సైకోలు. భయంతో పరుగులు తీసిన నర్సులు *నేతలపై దాడులు చేస్తే ఎవరైనా వస్తారా..? పెట్టుబడులు వస్తాయా..? రైతుల ముసుగులో టీడీపీ గుండాలు నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు-వైసీపీ ఎమ్మెల్యే రోజా

సకల జనుల సామూహిక దీక్షపై విరిగిన లాఠీ....సక్పెస్ అయిందన్న జేఏసీ

10-11-201910-11-2019 09:45:14 IST
2019-11-10T04:15:14.880Z10-11-2019 2019-11-10T04:12:12.977Z - - 22-02-2020

సకల జనుల సామూహిక దీక్షపై విరిగిన లాఠీ....సక్పెస్ అయిందన్న జేఏసీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధనకు కదం తొక్కారు. గత 37 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆర్టీసీ జేఏసీ మండిపడింది.  కార్మిక సంఘాల జేఏసీ శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమంలో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ట్యాంక్‌బండ్‌కు వచ్చే అన్ని మార్గాలను మూసివేశారు. తెలంగాణ ఉద్యమం తర్వాత ట్యాంక్ బండ్ మూసివేసిన ఘటన ఇదే. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ముందస్తు అరెస్టులు చేశారు. 

వేలాదిమంది కార్మికులు, వారి కుటుంబసభ్యులు హైదరాబాద్ ట్యాంక్ బండ్ కు పోటెత్తారు. వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా తరలిరావడంతో ట్యాంక్ బండ్ జనసంద్రమయింది, ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జి చేయగా ఆందోళనకారులు సైతం పోలీసులపైకి రాళ్లు రువ్వారు. 

అంబేడ్కర్‌ విగ్రహం వద్ద, మారియట్‌ హోటల్‌ వద్ద భారీ బారికేడ్లు, ముళ్లకంచెలను ఏర్పాటు చేయడంతోపాటు పారామిలటరీ బలగాలతో పహారా ఏర్పాటు చేశారు. అలాగే లోయర్‌ ట్యాంక్‌బండ్‌కు వెళ్లే అన్ని మార్గాలను మూసేశారు. ఆంధ్ర మహిళా సభ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్‌ చౌరస్తా, ఇందిరాపార్క్, కట్టమైసమ్మ దేవాలయం, రాణిగంజ్, బుద్ధభవన్‌ తదితర ప్రాంతాల వద్ద ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు ఆర్టీసీ బస్సుల్లో తనిఖీలు నిర్వహించి ప్రయాణికుల్లా తరలివచ్చిన కండక్టర్‌లు, డ్రైవర్‌లను గుర్తించి అరెస్టు చేయడంతో వారు ఆందోళన నిర్వహించారు.

Image

ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సీపీఎం కార్యాలయం నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కోదండరాం ఇతర నేతలు, పీవోడబ్ల్యూ సంధ్య తదితరులు ట్యాంక్ బండ్ వైపు దూసుకొచ్చారు.  లిబర్టీ దగ్గర నుంచి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిల నేతృత్వంలో వందలాది మంది పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ ని లిబర్టీ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆందోళనకారులు రాళ్ళు రువ్వడంతో పోలీసులు గాయపడ్డారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఛలో ట్యాంక్ బండ్ విజయవంతం అయిందని ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి మద్దతుగా మరోసారి రాష్ట్ర బంద్‌ నిర్వహించాలన్న అభిప్రాయాన్ని కొందరు అఖిలపక్ష నేతలు వ్యక్తం చేశారు. ఆదివారం సమావేశంలో కార్యాచరణ ప్రకటించనున్నారు

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

   6 hours ago


గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

   6 hours ago


చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

   9 hours ago


వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

   9 hours ago


గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

   10 hours ago


ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

   11 hours ago


‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

   13 hours ago


ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

   14 hours ago


శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

   15 hours ago


వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle