newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

సకలజనుల సమ్మెగా మారనున్న ఆర్టీసీ సమ్మె?

12-10-201912-10-2019 15:24:14 IST
2019-10-12T09:54:14.744Z12-10-2019 2019-10-12T09:53:57.144Z - - 22-02-2020

సకలజనుల సమ్మెగా మారనున్న ఆర్టీసీ సమ్మె?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు దిగి వారం గడిచింది. ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెడుతుందే కానీ సమ్మెను విమర్శింపజేసే దిశగా ప్రయత్నాలు ఒక్కటీ కనిపించడం లేదు. ఆ మాటకొస్తే అసలు ఆ ఉద్దేశ్యం కూడా ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ కార్మిక సంఘాలకు విధించిన డెడ్ లైన్ ముగిసిన రోజే చెప్పేశారు. ప్రస్తుతం కొత్తగా తాత్కాలిక ఉద్యోగులను, కార్మికులను నియమించుకునేందుకు నోటిఫికేషన్స్ కూడా విడుదల చేస్తుంది. అంటే ప్రభుత్వం సమ్మె దీర్ఘకాలం అనే నిర్ణయానికి వచ్చేసినట్లే కనిపిస్తుంది.

మరోపక్క సమ్మెను ఉదృతం చేస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాలు తోటి రంగాల కార్మికులను కూడా ఏకం చేసే పనుల్లో ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న ఇతర ఉద్యోగ సంఘాల మద్దతు కూడా కోరుతున్నారు. ఈక్రమంలో మరోసారి రాష్ట్రంలో మరోసారి సకల జనుల సమ్మెగా మారనుందా అనే అనుమానాలు మొదలవుతున్నాయి. దీనికి కారణం రాష్ట్ర ఉద్యోగులలో ఉన్న భయాందోళనలేనని వినిపిస్తుంది. ఇప్పటికే రెవెన్యూ ఉద్యోగులు సహా ఎన్జీఓలు,  గెజిటెడ్ ఉద్యోగులలో సైతం ప్రభుత్వం మీద పలు అనుమానాలున్నాయి. వాళ్ళ అనుమానాలలో కూడా నిజం ఉందనిపిస్తుంది.

ఆర్టీసీ సమ్మెకి దిగితే ప్రజా జీవనం స్థంభించిపోతుంది. ప్రజా రవాణాకు నిత్యం ఆధారపడేది ఆర్టీసీపైనే. అందుకే ఆర్టీసీ సమ్మెకి ప్రభుత్వాలలో ఆందోళన ఉంటుంది. కానీ యాభై వేలమంది ఉద్యోగులు సమ్మెకి దిగి రాష్ట్రంలో రవాణా వ్యవస్థ గాడితప్పినా ప్రభుత్వం సమస్య పరిష్కారానికి చర్యలకు దిగకపోవడం అన్నది ఉద్యోగులలో భయాందోళనలు రేకెత్తిస్తుంది. రెవెన్యూ లాంటి రంగాలు సమ్మెకి దిగితే ప్రజలపై ఇంత ప్రభావం ఉండదు. రెవెన్యూ కార్యాలయాలలో రోజూ పనులు ప్రజలకు ఉండేది తక్కువనే చెప్పుకోవాలి. ప్రభావం ఉన్న రంగాలు ఆందోళనకు దిగితేనే ప్రభుత్వ విధానం ఇలా ఉంటే ఇక తమపై ప్రభుత్వం ఏమిటని ఆయా రంగాలలో భయాందోళనలు సహజమే.

రాష్ట్రంలో ప్రభావం చూపించే ఆర్టీసీ సమ్మెపైనే ప్రభుత్వం అణచివేతకు దిగడం, ఉద్యోగులను డిస్మిస్ చేయడంపై ఇతర ప్రభుత్వ ఉద్యోగులలో అనుమానాలు రేకెత్తడం మాట నిజమేనని చెప్పాలి. ఇప్పటికే ఆయా రంగాలలో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, ఇంటెర్నెల్ రిలీఫ్ సమస్య, ప్రమోషన్లు, ఉమ్మడి సర్వీసులు, ఔట్ సోర్సింగ్ సర్వీసులు ఇలా చాలా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ముందు డిమాండ్లు ఉన్నాయి. ఆర్టీసీ సమ్మెలో ప్రభుత్వం విజయమైతే ఇక ఏ రంగంలో ఉద్యోగ, కార్మికులపై ప్రభుత్వ విధానాలు మొండిగా ఉండడమే కాకుండా, అణచివేసి ఆయా రంగాలను అవలీలగా చేతుల్లోకి తీసుకోవడం సులభమవుతుందని ఉద్యోగులలో వినిపిస్తుంది.

ఈ క్రమంలోనే ఆర్టీసీ సంఘాలు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు కోరితే తప్పక సమ్మెకి సహకరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ జేఏసీ సంఘాలు కూడా ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. అదే జరిగితే మరోసారి తెలంగాణలో సకల జనుల సమ్మె రావడం ఖాయంగా కనిపిస్తుంది. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మె తీవ్ర ప్రభావం చూపించింది. అయితే ఇప్పటికిప్పుడు సకల జనుల సమ్మె రావచ్చని చెప్పలేం.. అలాగని ఖచ్చితంగా రాదనీ చెప్పే పరిస్థితి లేదు. ఇప్పటికే ఆర్టీసీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చి కొన్ని పక్షాల మద్దతు కూడగట్టింది. ఆ బంద్ అనంతరం కానీ పరిస్థితుల్లో కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది.

ఇక మరోపక్క సీఎం కెసిఆర్ ఉద్యోగులను బుజ్జగించే పనిలో పడ్డట్లుగా ప్రచారం జరుగుతుంది, దానికి కారణం తాజాగా గెజిటెడ్ ఉద్యోగుల డీఏను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం.. ఉపాధ్యాయుల ప్రమోషన్లకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని సంకేతాలు పంపించినట్లుగా తెలుస్తుంది. ఉద్యోగ సంఘాలలో విభజన దిశగా సర్కార్ పావులు కదుపుతున్నట్లుగా చెప్తున్నారు. మరి ఈ సమ్మె రాష్ట్రంలో ఏ పరిస్థితిని తెస్తుంది? సర్కార్ వర్సెస్ కార్మిక్ మధ్య విజయం ఎవరికి వర్తిస్తుందన్నది ఆసక్తిగా మారింది.

 

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   an hour ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   2 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   3 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   4 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   4 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   5 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   6 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   7 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   7 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   8 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle