newssting
BITING NEWS :
* ఇండియాలో కరోనా కేసులు 1,38,845, మరణాలు 4021 .. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 1854, మరణాలు 53, ఏపీలో కరోనా కేసులు 2627, మరణాలు 55* శంషాబాద్ విమానాశ్రయంలో ప్రారంభమైన విమాన సర్వీసులు..హైదరాబాద్ నుంచి మొదటి ప్లేన్ బయలుదేరింది..బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన మొదటి విమానం *మరోమారు వివాదంలో చిక్కుకున్న కూనరవి..పొందూరు తహశీల్దార్ ను దుర్భాషలాడిన కూన రవి..కూనరవి మీద పొందూరు పీఎస్ లో ఫిర్యాదు చేసిన తహశీల్దార్...కూన రవి అరెస్ట్ కి రంగం సిద్దం*టీటీడీకీ షాక్‌ ఇచ్చిన క్రైం పోలీసులు..దొంగలను పట్టుకోవాలంటే ఫోర్ వీలర్ కావాలని కండీషన్.. మంచి ఫోర్ వీలర్ కావాలని కోరుతూ టీటీడీ ఉన్నతాధికారులకు లేఖ..లేఖ చూసి షాక్‌తిన్న అధికారులు..నిన్న జేఈవో ఇంట్లో భారీ దొంగతనం..6లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు మాయం *కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్డు..3లక్షలు దాటిన ఏపీలో కరోనా పరీక్షల సంఖ్య..ఇప్పటివరకు 3,40,326 కరోనా టెస్టులు..10 లక్షల జనాభాకు 5,699 పరీక్షలతో దేశంలోనే నెంబర్‌వన్*తెలంగాణలో ఈరోజు కొత్తగా 41 కరోనా కేసులు. తెలంగాణలో మొత్తం 1854కి చేరిన కరోనా కేసులు. తెలంగాణలో ఈరోజు 24 మంది డిశ్చార్జ్. మొత్తం 1092 మంది ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 709 యాక్టివ్ కేసులు*వరంగల్ జిల్లా 9 హత్యల కేసులో వీడిన మిస్టరీ. పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన నిందితుడు. స్నేహితులతో కలిసి హత్యలకు పాల్పడ్డ నిందితుడు. నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక హత్యలు* ఏపీలో తిరుమల లడ్డూ విక్రయాలు. 13 జిల్లా కేంద్రాల్లో టీటీడీ కల్యాణ మండపాల్లో లడ్డూ విక్రయాలు. లడ్డూ ప్రసాద సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు. 1800 425 4141, 1800 425 333 333 నెంబర్లు ఏర్పాటు

సకలజనుల సమర భేరికి గ్రీన్ సిగ్నల్

29-10-201929-10-2019 18:35:57 IST
2019-10-29T13:05:57.335Z29-10-2019 2019-10-29T13:05:55.618Z - - 26-05-2020

సకలజనుల సమర భేరికి గ్రీన్ సిగ్నల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్టీసీ కార్మికులు బుధవారం జరపతలపెట్టిన సకలజనుల సమర భేరీ సభకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. సరూర్‌నగర్‌లో రేపు మ.2 నుంచి సా.5గంటల వరకు సభ జరగనుంది. అంతకుముందు పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు ఆర్టీసీ కార్మికులు. సరూర్ నగర్ సభ ద్వారా కార్మికులకు ఆత్మ స్టైర్యం కల్పించడం కోసం సభను ఏర్పాటు చేశామని వివరించారు.

ఇదిలా ఉంటే.. ఆర్టీసీ సమ్మెపై విచారణ నవంబర్ 1కి వాయిదా వేసింది హైకోర్టు. ప్రభుత్వం-ఆర్టీసీకి ఎంత బకాయి పడిందో ఎల్లుండిలోగా నివేదిక ఇవ్వాలని ఆర్టీసీ ఇన్ చార్జి ఎండీకి హైకోర్టు ఆదేశాలిచ్చింది. వచ్చే వాయిదాకు ఆర్టీసీ ఎండీతో పాటు సంస్థ ఆర్థిక వివరాలు బాగా తెలిసిన వ్యక్తిని కోర్టుకు తీసుకురావాలని సూచించింది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె25వ రోజుకు చేరింది. కార్మికులు తమ ఆందోళన ఉధృతం చేశారు.

సకల జనుల సభ తో ఆర్టీసీ జేఏసీ తన బలాన్ని, వారి మద్దతుని ప్రభుత్వానికి చూపించాలని భావిస్తోంది. విపక్షాలు సైతం ఆర్టీసీ జేఏసీ సభకు మద్దతు పలకడంతో భారీగానే జనసమీకరణ జరుగుతుందని అంటున్నారు. సమ్మె విజయవంతంగా సాగుతోందని, ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సిన బాకీల విషయంలో అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు.

ఆర్టీసీ సమ్మెపై మంగళవారం వాడివేడి వాదనలు జరిగాయి. సమ్మెలోనూ తాము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రభుత్వం,అధికారుల వివరణతో కోర్టు సంతృప్తి పడలేదు. రాష్ట్ర విభజన తరువాత ఆర్టీసీ అప్పులు పంపకాలు జరగలేదని కోర్టుకు తెలియజేశారు. ప్రభుత్వ వాదనలు విన్న ధర్మాసనం.. రాష్ట్ర విభజన అనంతరం ఆర్టీసీ ఆస్తులు, అప్పుల పంపకాలు ఎందుకు జరగలేదని ప్రశ్నించిందని తెలిసింది. 

ఆర్టీసీలో మొత్తం ఎన్ని బస్సులున్నాయి? ఇప్పుడు ఎన్నిబస్సులు తిరుగుతున్నాయో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.75 శాతం బస్సులు తిరుగుతున్నాయని అధికారులు పేర్కొనగా, ఇప్పటికీ మూడోవంత బస్సులు కూడా నడవడం లేదని, ఆర్టీసీ ఎండీ కోర్టు విచారణకు ఎందుకు హాజరుకాలేదని కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కేసులో తదుపరి విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. 

 

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   4 minutes ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   26 minutes ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   an hour ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   an hour ago


అప్పుడు చంద్ర‌బాబు చేసిన త‌ప్పే ఇప్పుడు జ‌గ‌న్ చేస్తున్నారా..?

అప్పుడు చంద్ర‌బాబు చేసిన త‌ప్పే ఇప్పుడు జ‌గ‌న్ చేస్తున్నారా..?

   an hour ago


ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు కూర్చొని సెటిల్ చేసుకుంటారా..?

ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు కూర్చొని సెటిల్ చేసుకుంటారా..?

   an hour ago


సమ్మర్ ఎఫెక్ట్ .. శ్రీశైలంలో  కుడిగట్టు జలవిద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

సమ్మర్ ఎఫెక్ట్ .. శ్రీశైలంలో కుడిగట్టు జలవిద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

   17 hours ago


ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి కరోనా కలకలం

ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి కరోనా కలకలం

   21 hours ago


60 రోజుల తర్వాత విమానాలు. శంషాబాద్‌లో ప్రయాణికుల పడిగాపులు

60 రోజుల తర్వాత విమానాలు. శంషాబాద్‌లో ప్రయాణికుల పడిగాపులు

   21 hours ago


ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle