సందడి లేని చవితి... ధన్వంతరి గణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు
22-08-202022-08-2020 09:38:34 IST
Updated On 22-08-2020 10:34:32 ISTUpdated On 22-08-20202020-08-22T04:08:34.319Z22-08-2020 2020-08-22T04:06:59.186Z - 2020-08-22T05:04:32.503Z - 22-08-2020

హైదరాబాద్ గణపతి నవరాత్రుల్లో స్పెషల్ అట్రాక్షన్ ఖైరతాబాద్ గణపతి. ప్రతి ఏటా భారీగా వుండే గణపతి ఈసారి చిన్నగా మారిపోయాడు. కొవిడ్ మహమ్మారికి ఔషధం తెచ్చే ధన్వంతరి నారాయణ గణపతిగా స్వామి దర్శనమిస్తున్నారు. చేతిలో వనమూలికలు, వైద్య పుస్తకంతో ఉన్న వినాయకుడికి కుడివైపున మహాలక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతి కొలువుదీరారు. కరోనా దృష్ట్యా భక్తులకు నేరుగా అనుమతి లేదని.. www.ganapathideva.org వెబ్సైట్ ద్వారా పూజా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ దఫా విగ్రహం నిర్మాణాన్ని 9 అడుగులకే పరిమితం చేశారు. ఏటా అట్టహాసంగా జరిగే వినాయక చవితి వేడుకలకు ఈసారి కరోనా మహ మ్మారి అడ్డుపడింది. దీంతో ఈసారి కరోనా నిబంధనలకు అనుగుణంగా పండుగ జరుపుకోవాలని ప్రభుత్వం, సూచించింది. వాడవాడలా వెలిసే గణేశ్ మండపాలకు పోలీసులు ఈసారి అనుమతి ఇవ్వలేదు. అయితే అపార్ట్మెంట్లు, టౌన్‌షిప్పులు, ఆలయాలకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. అక్కడ కూడా విగ్రహాలు మూడు అడుగులకు మించకూడదంటూ స్పష్టమైన ఆంక్షలు విధించారు. చిన్నచిన్న విగ్రహాలతో గణపతి చిక్కిపోయాడు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదంటున్నారు. ఖైరతాబాద్ గణపతిని పర్యావరణ హితంగా మట్టితో తయారు చేశారు. ఈ ప్రతిమ అందరిని ఆకట్టుకుంటోంది. కాగా 66వ సారి నిర్వాహకులు విగ్రహాన్ని ఈ ఏడాది ప్రతిష్టించబోతున్నారు. అయితే గతానికి భిన్నంగా అక్కడే నిమజ్జన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో భక్తులకు కూడా అనుమతి లేదు.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
5 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
8 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
11 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
2 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
12 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
9 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
12 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
12 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
6 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
15 hours ago
ఇంకా