newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సంజయ్‌కే బీజేపీ పగ్గాలు.. కలిసి వచ్చిన ఆర్ఎస్ఎస్ నేపథ్యం

11-03-202011-03-2020 17:29:38 IST
Updated On 12-03-2020 11:36:41 ISTUpdated On 12-03-20202020-03-11T11:59:38.393Z11-03-2020 2020-03-11T11:56:29.306Z - 2020-03-12T06:06:41.167Z - 12-03-2020

సంజయ్‌కే బీజేపీ పగ్గాలు.. కలిసి వచ్చిన ఆర్ఎస్ఎస్ నేపథ్యం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బీజేపీ తెలంగాణ అధ్యక్ష బాధ్యతలను అధిష్టానం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కే అప్పగించింది. గత కొంతకాలంగా అధ్యక్షుడి నియామకంపై ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చుతారని అనేక వార్తలు వచ్చాయి, ఈ క్రమంలో అధ్యక్ష స్థానం కోసం పలువురు సీనియర్ నేతలు పోటీపడ్డారు. రేసులో డికె అరుణ కూడా వున్నారు.

Image may contain: text

అయితే అనూహ్యంగా బీజేపీ అధిష్టానం సంజయ్ వైపే మొగ్గుచూపింది. ఈమధ్యకాలంలో సంజయ్ కాస్త దూకుడు పెంచారు. ఎన్నార్సీ,సీఏఏ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడే వారిపై ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ పరిశీలకులు అనిల్ జైన్ తదితరులు తెలంగాణకు వచ్చి ఇక్కడి నేతల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. ఈసారి కూడా లక్ష్మణ్‌నే అధ్యక్షుడిగా కొనసాగిస్తారన్న ప్రచారమూ ఒకదశలో సాగింది. నేతలు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయాలు తీసుకున్న అనంతరం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పేరును ఖరారు చేశారు.

మంగళవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలోని నివాసంలో సమావేశమైన హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. బండి సంజయ్ పేరును ఖరారు చేశారు. బండి సంజయ్ ఏబీవీపీ కార్యకర్త స్థాయి నుంచి ఎంపీ స్థాయి వరకూ ఎదిగారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండడంతో లోక్ సభ ఎన్నికల్లో మరోసారి సీటు లభించింది. లక్ష్మణ్‌తో పాటు డీకే అరుణ, మురళీధర్ రావు, రఘునందన్ రావు తదితరుల పేర్లు కూడా అధ్యక్ష పదవి రేసులో వినిపించాయి.

సీఏఏను వ్యతిరేకించడానికి టీఆర్ఎస్ నేతలకు సిగ్గుండాలని మండిపడ్డ కరీంనగర్ ఎంపీ... సీఏఏను టీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గోకుల్ చాట్, లుంబినీపార్క్ లో బాంబులు పేల్చిన వారికి భారత పౌరసత్వం ఇవ్వాలా? అని ప్రశ్నించారు. సీఏఏను వ్యతిరేకించే వాళ్లు భవిష్యత్ తరాల దృష్టిలో దేశ ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. ఎన్నార్సీ వస్తుంది... టీఆర్ఎస్ సంగతి చూస్తాం అంటూ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

అంతేకాదు సీఏఏను వ్యతిరేకించినా వారిపై నిప్పులు చెరిగిన బండి సంజయ్.. అలాంటివారిని బ్రేకుల్లేని బస్సుల్లో పాకిస్తాన్‌కు పంపిస్తామని అన్నారు. ఆందోళనలు చేసే వారికి గట్టిబుద్ధి చెబుతామన్నారు. వారు కర్రలు పడితే తాము కత్తులు పడతామని… వారు రాళ్లు విసిరితే తాము బాంబులు విసురుతామన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం ఈ దేశం విచ్ఛిన్నం కావాలనే కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు చూస్తున్నారని ఘాటుగా విమర్శించారు. తెలంగాణలో ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో కాస్త దూకుడుతో వుండే వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించాలని అధిష్టానం సంజయ్ కి పగ్గాలు అప్పగించిందని పరిశీలకులు భావిస్తున్నారు. 

బీజేపీ నేతలు పలువురు ఎంపీ బండి సంజయ్ కి అభినందనలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమితులైన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారికి అభినందనలు అంటూ ట్వీట్ చేశారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   10 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   6 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   9 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   11 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   14 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   15 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   16 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   18 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   18 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle