newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం.. 24మందికి పాజిటివ్

14-06-202014-06-2020 08:44:01 IST
Updated On 14-06-2020 10:15:19 ISTUpdated On 14-06-20202020-06-14T03:14:01.057Z14-06-2020 2020-06-14T03:13:52.636Z - 2020-06-14T04:45:19.030Z - 14-06-2020

సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం.. 24మందికి పాజిటివ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నలుగురితో కలిసి టీ తాగడం

బర్త్ డే వేడుకల్లో కేక్ కట్ చేయడం

పెళ్లికి వెళ్లి ఎంజాయ్ చేయడం

అంత్యక్రియలకు హాజరు కావడం

పెళ్లిచూపులకు వెళ్లడం..

నలుగురూ కలిసి పేకాట ఆడడం

ఫ్రెండ్స్ తో కలిసి మందుకొట్టడం 

చికెన్ సెంటర్లో మాంసం కొనడం.. ఇవన్నీ కరోనా వేళ హానికరం అని భావించాలేమో. తెలంగాణలో కరోనా వైరస్ ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. లాక్ డౌన్ సడలింపుల వల్ల జనం బయటికి రావడం, తెలిసో తెలీయకో, తెలిసి కూడా నిర్లక్ష్యం వహించడం వల్ల కరోనా పాజిటివ్ దాడి జరుగుతోంది. తాజాగా సంగారెడ్డి జిల్లా కరోనా పాజిటివ్ కేసులతో వణికి పోతోంది. జహీరాబాద్ లో కరోనా కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన 19 మందికి వైరస్ సోకడంతో జిల్లా మొత్తం అలర్ట్ అయింది. 

జహీరాబాద్ కు చెందిన 55 ఏళ్ల మహిళ ఇటీవల అనారోగ్యం తో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మృతిచెందింది. అదేరోజు రాత్రి ఆ మహిళ అంత్యక్రియలను నిర్వహించారు. ఆమెతో కరోనా వైరస్ తో చనిపోయిందని ఎవరికీ తెలీదు. దీంతో చివరిచూపు కోసం కుటుంబసభ్యులంతా అక్కడికి వెళ్లారు. చనిపోకముందే ఆమెకు టెస్ట్ చేయగా. ఆమె అంతక్రియల అనంతరం రిపోర్ట్స్ వచ్చాయి. రిపోర్ట్ లలో ఆ మహిళకు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో మృతురాలి అంత్యక్రియల్లో పాల్గొన్న బంధువులను అధికారులు క్వారంటైన్ కు తరలించారు.

అంత్యక్రియల్లో మొత్తం 40 మంది పాల్గొన్నట్టు అధికారులు గుర్తించారు. వారిలో 25 మందికి పరీక్షలు చేయగా 19 మందికి పాజిటివ్ వచ్చినట్టు గుర్తించారు. కాగా వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వారు నివసిస్తున్న ప్రాంతాలను రెడ్ జోన్ గా గుర్తించి ఆ ప్రాంతానికి రాక పోకలను నిలిపివేశారు.  కరోనా వ్యాప్తి ప్రారంభమయినప్పటి నుంచి జిల్లాలో ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం అరుదు. దీంతో జహీరాబాద్ ప్రాంతాన్ని కట్టడి చేశారు.  మొత్తం జిల్లాలో 24 కరోనా పాజిటివ్ కేసులు  నమోదయ్యాయి. గ్రేటర్ మినహా కేసుల పరంగా చూస్తే జిల్లా అగ్రస్థానంలో వుంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle