newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

సంక్రాంతికి ఆర్టీసీ బాదుడు... 50 శాతం అదనం

30-12-201930-12-2019 07:06:01 IST
2019-12-30T01:36:01.663Z30-12-2019 2019-12-30T01:35:19.725Z - - 25-02-2020

సంక్రాంతికి ఆర్టీసీ బాదుడు... 50 శాతం అదనం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాల జనం సంక్రాంతికి తప్పకుండా తమ స్వస్థలాలకు వస్తారు. ఇక హైదరాబాద్ లో వున్న ఆంధ్రావాసులు ఏదోవిధంగా స్వంత ఊళ్ళకు చేరుకునేందుకు తమ ప్రయత్నాలు చేస్తారు.

ఈ నేపథ్యంలో ఆర్టీసీ, రైల్వేల ద్వారా రిజర్వేషన్లు చేయించుకుంటారు. అయితే ఎప్పటిమాదిరిగానే రైల్వే, ఆర్టీసీ బాదుడు మొదలుపెట్టాయి.  తెలంగాణ ఆర్టీసీ సంక్రాంతికి సన్నాహాలు ప్రారంభించింది. 

రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జరుపుకునే పండగల్లో సంక్రాంతి ఒకటి కావడంతో ఊరికి వెళ్లడానికి ఆర్టీసీపై ఆధారపడుతున్నారు. అయితే, ఆర్టీసీ మాత్రం మామూలు టికెట్ ధరలకు 50 శాతం పెంచి సొమ్ముచేసుకుంటోంది.

హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులు ప్రారంభం కానున్నాయి.  సంక్రాంతి సందర్భంగా 4940 అదనపు బస్సులను  సిద్ధం చేసినట్లు రంగారెడ్డి రీజినల్‌ మేనేజర్‌ వరప్రసాద్‌ చెబుతున్నారు. 

వీటిలో తెలంగాణకు 3414 బస్సులను ఆంధ్ర ప్రాంతానికి 1526 బస్సులను అదనంగా కేటాయించారు. జనవరి 9వ తేది నుంచి 13 వరకు ఈ అదనపు బస్సులు నడుపుతారు. సంక్రాంతికి వెళ్ళి తిరిగి వచ్చేవారికోసం జనవరి 17న అదనపు బస్సులు నడుస్తాయి. వీటికి అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. సంక్రాంతి సందర్భంగా గతేడాది రూ. 5 కోట్ల అదనపు ఆదాయం వచ్చింది. ఈసారి రూ. 6 కోట్లు వచ్చే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

మరోవైపు ఆర్టీసీ కార్గో సర్వీసు ద్వారా మరింత ఆదాయం పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కార్గోకోసం ప్రత్యేకంగా బస్సులు రెడీ చేసింది. అంతేకాకుండా ఉద్యోగులకు టాయ్‌లెట్స్‌, దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులను ఏర్పాటుచేస్తోంది.  అలాగే, ఛేంజ్‌ ఓవర్‌ పాయింట్‌లలో సంచార బయో టాయిలెట్లను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. పురుషులు, స్త్రీలకు వేర్వేరుగా పాత బస్సుల్లో టాయిలెట్లను ఏర్పాటుచేశారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle