newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

'షీ సేఫ్‌' యాప్‌తో మహిళల భద్రతకు పూర్తి హామీ

27-02-202027-02-2020 16:12:18 IST
2020-02-27T10:42:18.382Z27-02-2020 2020-02-27T10:42:15.675Z - - 23-04-2021

'షీ సేఫ్‌' యాప్‌తో మహిళల భద్రతకు పూర్తి హామీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సైబరాబాద్‌ పోలీసులు, ఎస్‌సీఎస్‌సీ సంయుక్తంగా  రూపకల్పన చేసిన షీ సేఫ్ యాప్ ఎలాంటి ఆపదలో ఇరుక్కున్న మహిళలకైనా తృటిలో సహాయం అందించడంలో ముందడుగు వేసింది. మహిళల భద్రతకు సంబంధించి సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్‌సీ) సరికొత్తగా రూపొందించిన ‘షీ సేఫ్‌’యాప్‌ అతివలకు ఎంతో ఉపయుక్తకరం కానుంది. ప్రస్తుతం ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్న ఈ యాప్‌ను వచ్చే మహిళా దినోత్సవం పురస్కరించుకొని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో అధికారికంగా అందుబాటులోకి తెచ్చేలా చూస్తున్నారు. ఆ తర్వాత రాచకొండ, హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రాంత ముఖ్య వివరాలను జోడించి ఈ యాప్‌ను సరికొత్తగా అతివల భద్రత కోసం తీసుకొచ్చే అవకాశాలున్నాయి.  

ఈ 'షీ సేఫ్' యాప్ గొప్పతనం ఏమిటి అంటే ఈ యాప్‌ను నిక్షిప్తం చేసుకున్న మహిళలు ఎవరైనా గృహహింస, ఆన్‌లైన్‌ వేధింపులు, సైబర్‌ నేరాల విషయాల్లో మార్గదర్శక్‌ల సహాయం కోరవచ్చు. మీరు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఉంటే ఈ యాప్‌లోని ఎస్‌వోఎస్‌ బటన్‌ క్లిక్‌ చేయడం ద్వారా మార్గదర్శక్‌లు, షీ బృందాలు, మహిళా పోలీసు స్టేషన్లు, భరోసా కేంద్రాలు, పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు చేరుతుంది. హాక్‌ ఐను కూడా దీంతో అనుసంధానం చేశారు. అలాగే మహిళల భద్రత గురించి ఎస్‌సీఎస్‌సీ నిర్వహించే భద్రత కార్యక్రమాలు, అవగాహన సదస్సు వివరాలను తెలుసుకోవచ్చు.  

‘మీరు గృహ హింసకు గురవుతున్నా,  ఆన్‌లైన్‌ వేదికగా ఆకతాయిలు వేధిస్తున్నా.. సైబర్‌ నేరాల బారిన పడినా.. జీవితంపై విరక్తి చెంది తీవ్ర ఒత్తిడిలో ఉన్నా సరే..’కారణాలేమైతేనేం మీ మొబైల్‌లో ‘షీ సేఫ్‌’యాప్‌ నిక్షిప్తం చేసుకుంటే చాలు. నేరాలు, ఒత్తిడి తదితరాల బారి నుంచి ఎలా బయటపడాలో మార్గదర్శక్‌లు దగ్గరుండి మరీ మీకు మార్గదర్శనం చేసి అవసరమైన సహాయాన్ని అందిస్తారు. అది పోలీసుపరంగా, న్యాయపరంగా, షీ టీమ్‌ల పరంగా.. ఇలా ఎవరి వల్ల ఆ సమస్య పరిష్కారమవుతుందో అటువైపుగా మార్గదర్శనం చేసి ఆ బాధల నుంచి విముక్తి కల్పిస్తారు. 

సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో 2 లక్షల మందికి పైగా సాఫ్ట్‌వేర్‌ మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరి భద్రతను దృష్టిలో ఉంచుకొని ఏ హాస్టల్స్‌ ఉండేందుకు సురక్షితమనే వివరాలను కూడా ‘ప్రాజెక్టు సేఫ్‌ స్టే’ ఫీచర్‌లో పొందుపరిచారు. ఇప్పటికే ఏఏ హాస్టళ్లలో సీసీటీవీ కెమెరాలున్నాయి, భద్రత ఎలా ఉంది, సందర్శకుల రిజిస్టర్‌ నమోదు చేస్తున్నారా తదితర అంశాలపై అధ్యయనం చేసిన ఎస్‌సీఎస్‌సీ, సైబరాబాద్‌ పోలీసులు వందకుపైగా హాస్టళ్ల పేర్లను చేర్చారు. ఇలా ఐటీ కారిడార్‌లో ఏఏ హాస్టళ్లలో ఉండటం మంచిదనే విషయాన్ని తెలుసుకునే అవకాశాన్ని కల్పించారు.  

మీరు సంచరించే ప్రాంతాల్లో ఎక్కడైనా వీధి దీపాలు వెలగకుండా చీకటిగా ఉంటే ఆ దృశ్యాన్ని సెల్‌ఫోన్‌ ద్వారా చిత్రీకరించి ఈ యాప్‌లో అప్‌లోడ్‌ చేసే ఫీచర్‌ను అందుబాటులో ఉంచారు. ఇలా మీరు ఆ చిత్రాన్ని, ప్రాంతాన్ని నమోదు చేస్తే ఎస్‌సీఎస్‌సీ సభ్యులు సంబంధిత విభాగాల ద్వారా ఆయా ప్రాంతాల్లో లైట్లు వెలిగేలా చూస్తారు. అలాగే ప్రయాణం చేస్తున్న సమయంలోనే ఈ–లెర్నింగ్స్, భద్రత అవగాహన మాడ్యూల్స్‌ను యాక్సెస్‌ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు.

Image result for ‘She Safe’ app launched by Cyberabad Security Council

అలాగే ఐటీ కారిడార్‌లో సాఫ్ట్‌వేర్‌ మహిళా ఉద్యోగుల కోసం నడుపుతున్న షీ షటిల్‌ బస్సుల ప్రయాణ వివరాలు అందుబాటులో ఉంచారు. అలాగే హాక్‌ ఐ యాప్‌ కూడా ఈ అప్లికేషన్‌ ద్వారా యాక్సెస్‌ చేసుకునేలా రూపకల్పన చేశారు. సైబరాబాద్‌ పోలీసు కమాండ్‌ కంట్రోల్‌కి కూడా యాక్సెస్‌ చేశారు.  

గూగుల్‌ ప్లే స్టోర్‌కు వెళ్లి ‘షీ సేఫ్‌’అని టైప్‌ చేయగానే యాప్‌ వస్తుంది. దీన్ని స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. యాపిల్‌ స్టోర్‌ ద్వారా కూడా నిక్షిప్తం చేసుకునేలా ఫీచర్లు రూపొందించారు. మొబైల్ లోని బటన్ నొక్కడం ద్వారా అత్యవసర సందేశాన్ని పోలీసులకు పంపేలా ఈ యాప్‌ రూపొందించామని ఎస్‌సిఎస్‌సి ప్రధాన కార్యదర్శి భరణి కుమార్ అరోల్ చెప్పారు.

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   2 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   3 hours ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   2 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   4 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   5 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   5 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   21 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   22-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle