షాబాద్ సీఐ శంకరయ్య అక్రమాలు.. షాకింగ్ నిజాలు
11-07-202011-07-2020 18:38:34 IST
2020-07-11T13:08:34.141Z11-07-2020 2020-07-11T13:08:10.168Z - - 15-04-2021

చేతిలో అధికారం, ప్రముఖులతో పరిచయాలతో షాబాద్ సీఐ శంకరయ్య కోట్లకు పడగలెత్తారు. తాజాగా లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోవడంతో అక్రమాలు బయటపడుతున్నాయి. షాబాద్ సీఐ శంకరయ్య ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాల్లో భారీగా ఆస్తులు, నగదు బయటపడింది. ఇప్పటికే సోదాల్లో భారీ స్థాయిలో కూడబెట్టిన ఆస్తులను అధికారులు గుర్తించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త , ఫార్మా కంపెనీల అధినేత, ఎక్స్ ప్రెస్ టీవీ ఛైర్మన్ డా.చిగురుపాటి జయరాం హత్యకేసులో నిందితుడు రాకేష్‌రెడ్డితోనూ శంకరయ్యకు సంబంధాలు ఉన్నాయని తేలింది. గతంలో దుండిగల్ సీఐగా పనిచేస్తున్న సమయంలో శంకరయ్యకు రాకేశ్‌రెడ్డితో పరిచయం ఏర్పడిందని, అప్పటి నుంచి వారి మధ్య లావాదేవీలు కొనసాగుతున్నట్టు తెలిసింది. ఇక జయరాం, శిఖా చౌదరిల కాల్ డేటాను సీఐ శంకరయ్య ద్వారా రాకేష్‌రెడ్డి రాబట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. జయరాం హత్యకు రాకేష్ రెడ్డి కారణమయిన సంగతి తెలిసిందే. శంకరయ్య గత కొంతకాలంగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. షాబాద్ సీఐగా పని చేస్టున్న శంకరయ్య జయరాంరెడ్డి అనే వ్యక్తి వద్ద రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డాడు. దీంతో ఏసీబీ అధికారులు శంకరయ్యను అరెస్ట్ చేశారు. అతని నివాసాల్లో సోదాలు చేపట్టారు. అదాయానికి మించి ఆస్తులు బయటపడుతున్నాయి. ఇక సీఐ శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్ లకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం వారు చంచల్‌గూడ జైలులో వున్నారు. శంకరయ్య బంధువుల ఇళ్ళల్లో జరిపిన సోదాల్లో కళ్ళు తిరిగే ఆస్తులు, ఇళ్ళపత్రాలు బయటపడ్డాయి. ఒక కోటి 5 లక్షల విలువ చేసే రెండు ఇళ్లు, రెండు కోట్ల 28 లక్షల విలువచేసే 11 ఇంటి ప్లాట్స్. 77 లక్షల విలువచేసే 41 ఎకరాల 3 గుంటల వ్యవసాయ భూమి నిజామాద్, చేవెళ్ల, మిర్యాల గూడలో ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అలాగే వీటితో పాటు 7 లక్షల విలువ చేసే మారుతి స్విప్ట్ కారు, 21 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, 17 లక్షల 88 వేల నగదు లభించాయి. 6 లక్షల విలువ చేసే ఇతర వస్తువులు 81 వేల వెండి వస్తువులను ఏసీబీ అధికారులు గుర్తించారు. మరికొన్ని చోట్ల సోదాల వివరాలు రావాల్సి వుంది. సీఐ స్థాయిలో బయటపడ్డ అక్రమాస్తులను చూసి ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు. ప్రముఖులతో శంకరయ్య పరిచయాలే ఈ భారీ సంపాదనకు కారణం అంటున్నారు.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
12 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
13 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
13 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
17 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
18 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
17 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
19 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
19 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
15 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
21 hours ago
ఇంకా