newssting
BITING NEWS :
*హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో కారు బీభత్సం. అదుపుతప్పి హోటల్ లోకి దూసుకెళ్లిన కారు. తప్పిన ప్రమాదం, కారు వదలి పరారైన యువకులు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లుగా అనుమానం * అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న ట్రంప్. ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీగా మొతేరా స్టేడియానికి ట్రంప్. మధ్యాహ్నం 12:30 గంటలకు నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగం*విశాఖ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌పై స్పందించిన నేవీ..మిలీనియం టవర్స్‌లో సచివాలయం పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం*జనవరి 10న అమరావతి రైతుల మీద జరిగిన లాఠీఛార్జ్‌పై విచారణ ప్రారంభం..హైకోర్టు ఆదేశాల మేరకు తుళ్లూరులో విచారణ ప్రారంభించిన పోలీసులు..గుంటూరు అడిషనల్‌ ఎస్పీ స్వామిశేఖర్‌ నేతృత్వంలో కొనసాగుతున్న ఎంక్వైరీ *సికింద్రాబాద్ : బోయిన్ పల్లిలోనీ ఓ కెమికల్ గో డౌన్ లో భారీ అగ్నిప్రమాదం*చైనాలో 2400 పైగా చేరిన కోవిద్ 19 వైరస్ మృతులు. 78 వేలకు చేరిన వైరస్ బాధితుల సంఖ్య. ఇటలీలో కరోనా వైరస్ కారణంగా ఇద్దరు మృతి

షరతులతో వస్తే ఓకే..! సమ్మెపై కేసీఆర్‌ నెక్ట్స్‌ ప్లాన్‌ అదేనా!!

20-11-201920-11-2019 08:00:40 IST
2019-11-20T02:30:40.118Z20-11-2019 2019-11-20T02:29:45.527Z - - 24-02-2020

షరతులతో వస్తే ఓకే..! సమ్మెపై కేసీఆర్‌ నెక్ట్స్‌ ప్లాన్‌ అదేనా!!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె హైకోర్టు తీర్పుతో కొత్త మలుపు తిరిగింది. గత 46రోజులుగా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంపై పోరాటం సాగిస్తున్నారు. డిమాండ్లు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గమని పోరాటాన్ని ఉధృతం చేస్తూ వచ్చారు. కానీ సోమవారం హైకోర్టు తీర్పుతో కార్మికుల్లో ఆందోళన మొదలైంది.

ఇన్నాళ్లు ప్రభుత్వాన్ని చివాట్లు పెడుతూ వచ్చిన హైకోర్టు.. సోమవారం ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమో కాదో మేం చెప్పలేమని, ఆ అధికారం మాకు లేదని, లేబర్‌ కోర్టు ఆ విషయాన్ని తేలుస్తుందని చెప్పింది.

దీంతో ఆర్టీసీ జేఏసీ వర్సెస్‌ ప్రభుత్వ వివాదం లేబర్‌ కోర్టుకు చేరింది. అదేవిధంగా ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేయలేమని హైకోర్టు చెప్పింది. ఇన్నాళ్లు హైకోర్టు తీర్పులతో పట్టుదలతో సమ్మెను కొనసాగించిన కార్మికులు ఒక్కసారిగా డీలాపడినట్లు కనిపించింది.

హైకోర్టు తీర్పు నేపథ్యంలో సమ్మెను విరమించేందుకు ఆర్టీసీ జేఏసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమ డిమాండ్లలో ప్రధానమైనది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని.. ఆ డిమాండ్‌ను పక్కకు పెడుతున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించినా.. సీఎం కేసీఆర్‌ జేఏసీతో చర్చలు జరిపేందుకు నిరాకరించారు.

దీంతో కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. తాజాగా హైకోర్టు తీర్పుతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసి విధుల్లో చేరే ఆలోచనలో ఆర్టీసీ జేఏసీ ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు రెండు వారాల్లో లేబర్‌ కోర్టు ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమా..? చట్ట ప్రకారమే జరుగుతుందా? అనే అంశంపై తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో అప్పటి వరకు వేచిచూస్తే మంచిదని ఆర్టీసీ జేఏసీలోని మరో వర్గం పేర్కొంటుంది.

కాగా మంగళవారం ఆర్టీసీ జేఏసీ నాయకులు, అఖిలపక్షం నేతలు సమావేశం అయ్యారు. దీంతో ఆర్టీసీ జేఏసీ జిల్లా కమిటీల అభిప్రాయాలను స్వీకరించిన తరువాత తుదినిర్ణయం తీసుకోనున్నారు.

ఇదిలా ఉంటే ఆర్టీసీ జేఏసీపై సీఎం కేసీఆర్‌ మాత్రం మెట్టుదిగే పరిస్థితి కనిపించటం లేదు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెపై వేచిచూసే ధోరణిలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. కార్మిక సంఘాల స్పందనను బట్టే ప్రతిస్పందించాలని సర్కార్‌ నిర్ణయించినట్లు తెలియవచ్చింది.

కార్మికులు భేషరతుగా విధుల్లో చేరాలని, విధుల్లో చేరుతున్నట్లు అన్ని డిపోల్లో వ్యక్తిగతంగా లేఖలు అందజేయాలని, భవిష్యత్తుల్లో సమ్మె చేయమని లిఖిత పూర్వక ప్రమాణ పత్రం ఇవ్వాలని నిబంధనలు విధించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ షరతులను అంగీకరించిన కార్మికులనే విధుల్లో తీసుకోవాలనే ఆలోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు తెలియవచ్చింది. ఆ షరతులకు కార్మికులు అంగీకరించని పక్షంలో లేబర్‌ కోర్టు తీర్పు వరకు వేచి చూడాలనినే భావనలో కేసీఆర్‌ ఉన్నట్లు సమాచారం.

లేబర్‌ కోర్టులో సమ్మె చట్టవిరుద్దమని తేలితే కార్మికులందరికీ వీఆర్‌ఎస్‌ ప్రకటించే యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు తెలియవచ్చింది. కేసీఆర్‌ కార్మికులకు మరోచాన్స్‌ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉండటంతో ఆర్టీసీ కార్మికులు ఏమేరకు సద్వినియోగం చేసుకుంటారు..? లేక లేబర్‌ కోర్టు తీర్పువరకు వేచిచూసేందుకు నిర్ణయించుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రుణమాఫీలు శాశ్వత పరిష్కారం కాదు. గిట్టుబాటు ధరలే సమస్య: ఉపరాష్ట్రపతి

రుణమాఫీలు శాశ్వత పరిష్కారం కాదు. గిట్టుబాటు ధరలే సమస్య: ఉపరాష్ట్రపతి

   9 hours ago


తెలంగాణలో కలకలం రేపిన 'దొంగలతో దోస్తీ' కథనం!

తెలంగాణలో కలకలం రేపిన 'దొంగలతో దోస్తీ' కథనం!

   13 hours ago


‘‘ఈజీవో నాపై వేధింపులకు పరాకాష్ట’’బాబు ట్వీట్

‘‘ఈజీవో నాపై వేధింపులకు పరాకాష్ట’’బాబు ట్వీట్

   14 hours ago


నూజివీడు ఘటనపై మంత్రి సురేష్ సీరియస్

నూజివీడు ఘటనపై మంత్రి సురేష్ సీరియస్

   14 hours ago


మిలీనియం టవర్స్ చుట్టూ అల్లుకున్న రాజకీయం!

మిలీనియం టవర్స్ చుట్టూ అల్లుకున్న రాజకీయం!

   14 hours ago


భూములు లాక్కోవడంలేదు.. తప్పుచేయకుంటే ఎందుకంత భయం?

భూములు లాక్కోవడంలేదు.. తప్పుచేయకుంటే ఎందుకంత భయం?

   15 hours ago


విద్యార్ధుల భవిష్యత్తే మాకు ముఖ్యం... నూజివీడు ట్రిపుల్ ఐటీ వీసీ హేమచంద్రారెడ్డి

విద్యార్ధుల భవిష్యత్తే మాకు ముఖ్యం... నూజివీడు ట్రిపుల్ ఐటీ వీసీ హేమచంద్రారెడ్డి

   15 hours ago


సిట్‌కు స‌హ‌క‌రించే సీన్ ఉందా..?

సిట్‌కు స‌హ‌క‌రించే సీన్ ఉందా..?

   16 hours ago


12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   22-02-2020


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   22-02-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle