newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

శ్రీశైలం డ్యామ్‌ దెబ్బకు ప్రాజెక్టులన్నీ ఫుల్.. 20 టీఎంసీల వరద ప్రవాహం

10-08-202010-08-2020 07:34:56 IST
2020-08-10T02:04:56.251Z10-08-2020 2020-08-10T02:04:15.687Z - - 17-04-2021

శ్రీశైలం డ్యామ్‌ దెబ్బకు ప్రాజెక్టులన్నీ ఫుల్.. 20 టీఎంసీల వరద ప్రవాహం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు రైతుల దాహార్తిని, సాగునీటి అవసరాలను తీరుస్తున్న కృష్ణమ్మ శ్రీశైలం ప్రాజెక్టులోకి పరుగులు పెడుతోంది. ఎగువ నుంచి శనివారం సాయంత్రం 98,975 క్యూసెక్కులు చేరుతుండగా రాత్రి 12 గంటలకు ఇది రెండు లక్షల 25 వేల క్యూసెక్కులకు పెరుగుతుందని అధికారవర్గాలు తెలిపాయి. ఈ దఫా వరదకు ఆగస్టు చివరిలోపే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నిండవచ్చని అంచనా వేస్తున్నాయి. 

పశ్చిమ కనుమల్లో ప్రధానంగా కృష్ణా, ఉపనదుల పరీవాహక ప్రాంతాల్లో నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం సగటున 72 మి.మీ.ల వర్షపాతం పడింది. దాంతో కృష్ణా, ఉపనదుల్లో గంట గంటకూ వరద పెరుగుతోంది. ఆల్మట్టిలోకి వరద పెరుగుతుండటంతో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌డీఎంఏ) సూచనల మేరకు డ్యామ్‌ నీటినిల్వలను ఖాళీ చేసి దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌ డ్యామ్‌లోనూ అదే పరిస్థితి. దాంతో జూరాలకు భారీగా వరద చేరుతోంది. జూరాల వరదను దిగువకు వదులుతున్నారు. 

శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు జలాలు విడుదల చేస్తుండటంతో నాగార్జునసాగర్‌ నీటిమట్టం 558.20 అడుగులకు చేరుకుంది. అప్పర్‌ తుంగ, భద్ర డ్యామ్, సింగటలూరు బ్యారేజీ నుంచి భారీ వరదను దిగువకు వదులుతుండటంతో తుంగభద్రలోకి వరద ప్రవాహం పెరుగుతోంది. 

పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, కిన్నెరసాని నుంచి నీటి ప్రవాహం చేరుతుండటంతో గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 1.17 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 7 వేల క్యూసెక్కులు డెల్టాకు, మిగిలిన 1.11 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

మహరాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాంలు నిండుతున్నాయి. శనివారం ఉదయం నుంచే జూరాల నుంచి ఔట్‌ఫ్లో మొదలైంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, పూర్తి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా 849.90 అడుగుల వద్ద 79.8115 టీఎంసీల నీరు చేరింది. శనివారం సాయంత్రానికి జూరాల నుంచి 2.25లక్ష క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ నీరు అర్ధరాత్రి దాటాక శ్రీశైలానికి చేరుకునే అవకాశం ఉంది. రోజూ 15-20 టీఎంసీల చొప్పున నీరు రావచ్చని అంచనాలున్నాయి. రెండ్రోజుల్లో ఏపీ కూడా విద్యుదుత్పత్తి మొదలుపెట్టే అవకాశం ఉంది. 

నారాయణపూర్‌ గరిష్ఠ నీటి మట్టం 490.76మీటర్లు, నీటి నిల్వ 28 టీఎంసీలు కాగా 26.89 టీఎంసీల నీరు చేరింది. ఇన్‌ఫ్లో 2లక్షల క్యూసెక్కులుండగా 2,20,620 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి గరిష్ఠ నీటి మట్టం 517 అడుగులు, నీటి నిల్వ 129.27 టీఎంసీలుండగా ప్రస్తుతం 108 టీఎంసీల నీరు చేరింది. ఇన్‌ఫ్లో 2.23లక్షల క్యూసెక్కులు ఉంది. 2.20లక్షల క్యూసెక్కులు జూరాలకు విడుదల చేస్తున్నారు. వారంపాటు ఇదే స్థాయిలో వరద నీరు రావచ్చని, శ్రీశైలం నీటిమట్టం 875-880 అడుగులకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. 10-15 రోజుల్లో సుమారు 150 టీఎంసీల నీరు చేరుకోవచ్చని చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో జూలై 7వ తేదీ నుంచి కురిసిన వర్షాలకు సుంకేసుల నుంచి 12.5 టీఎంసీలు, హంద్రీ నుంచి 12 టీఎంసీలు, జూరాల నుంచి 79 టీఎంసీలు మొత్తం 103 టీఎంసీల నీరు శ్రీశైలానికి చేరింది. జలాశయం నుంచి తెలుగు రాష్ట్రాలు కలిసి ఇప్పటిదాకా 72 టీఎంసీలు వాడుకోగా.. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుదుత్పత్తి ద్వారా 64.5 టీఎంసీలు, ఎత్తిపోతల పథకాల ద్వారా 2.64 టీఎంసీలను తెలంగాణ ప్రభుత్వం డ్రా చేసుకుంది.

ఏపీ ప్రభుత్వం మాత్రం మల్యాల, హంద్రీనీవా నుంచి 1.5 టీఎంసీలు, పోతిరె డ్డిపాడు నుంచి 2.3 టీఎంసీలను అవసరాల రీత్యా మాత్రమే వాడుకుంది. శ్రీశైలం నీటిమట్టం పెరిగితే విద్యుదుత్పత్తి ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. కుడి గట్టు భూగర్భ విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి కూడా నీటిని డ్రా చేసుకునే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు నీటి విడుదలపై జిల్లా అధికారులు అప్రమత్తం కావాల్సి ఉంది. లేకుంటే జూలైలో వచ్చిన వరదను ఉపయోగించుకోలేని దుస్థితే పునరావృతం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   11 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   12 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   17 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   15 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   19 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   18 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   21 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   17 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle