newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం.. లోపల 9మంది

21-08-202021-08-2020 07:48:24 IST
Updated On 21-08-2020 09:06:33 ISTUpdated On 21-08-20202020-08-21T02:18:24.668Z21-08-2020 2020-08-21T02:17:43.259Z - 2020-08-21T03:36:33.937Z - 21-08-2020

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం.. లోపల 9మంది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకదానివెంట ఒకటి.. ప్రమాదాలు తెలుగురాష్ట్రాలను వణికిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో ఓ పాల డెయిరీలో అమ్మోనియం లీకైన ఘటన మరిచిపోకముందే శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా విద్యుత్‌ కేంద్రంలో పొగలు అలుముకోవడంతో అధికారులు వెంటనే ఉత్పత్తిని నిలిపివేయడంతో మంటలు ఆరిపోయాయి.

దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. 9 మంది సిబ్బంది విద్యుత్‌ కేంద్రంలోనే చిక్కుకుపోయారు. వీరిని అధికారులు వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ శర్మన్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అక్కడే వుండి సమీక్షిస్తున్నారు.

వీరి ఫోన్లు గంటపాటు పని చేసినా తరువాత స్పందించకపోవడంతో సిబ్బంది కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జల విద్యుత్‌ కేంద్రంలో భారీగా పొగ అలుముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఎన్టీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రంగంలోకి దిగారు. తీవ్రమైన పొగ కారణంగా ఆక్సిజన్‌ పెట్టుకున్నా ఘటనా స్థలానికి చేరుకోలేకపోతున్నారు. అవసరమైతే సింగరేణి సిబ్బంది సాయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.

పవర్ ప్లాంట్ లోపల చిక్కుకున్న వారిలో ఏడుగురు జెన్ కో సిబ్బంది, ఇద్దరు ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లు ఉన్నారని తెలుస్తోంది. డీఈ శ్రీనివాస్, ఏఈలు సుందర్, కుమార్, సుష్మా, ఫాతిమా, వెంకట్రావు, మోహన్‌తో పాటు ఆమ్రాన్‌ కంపెనీకి చెందిన రాంబాబు, కిరణ్ లోపలే ఉండిపోయారని అధికారులు తెలిపారు. ప్రమాదం నుంచి బయటకు వచ్చిన 8 మందిలో ఇద్దరు క్షేమంగా ఉన్నారు. పొగ కారణంగా మరో ఆరుగురు అస్వస్థతకు గురి అయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదంపై సీఎం కేసీయార్ ఆరా.. 

శ్రీశైలం ఎడమగట్టు కాల్వ విద్యుత్ కేంద్రంలో అగ్రిప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీయార్ ఆరా తీశారు. ఆయన జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావుతో మాట్లాడారు. గురువారం రాత్రి 10.30 గంటలకు ప్రమాదం జరిగిందని తెలిపారు. 1200 కేవీ లైన్‌ను ఐసోలేట్ చేశామని.. ఈ క్రమంలోనే ట్రిప్ అయ్యి ప్యానెల్ బోర్డులో మంటలు చెలరేగినట్లు జెన్నో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. గతంలో ఇలాంటి లోపల అంతా పొగతో నిండిపోయిందని.. ఎంత నష్టం జరిగిందో ఇప్పుడే చెప్పలేమన్నారు. పవర్ హౌస్ లోపల చిక్కుకున్న ఉద్యోగులను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle