newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

శరవేగంగా తెలంగాణ సచివాలయం కూల్చివేత

07-07-202007-07-2020 09:14:47 IST
Updated On 07-07-2020 12:15:09 ISTUpdated On 07-07-20202020-07-07T03:44:47.018Z07-07-2020 2020-07-07T03:44:32.504Z - 2020-07-07T06:45:09.641Z - 07-07-2020

శరవేగంగా తెలంగాణ సచివాలయం కూల్చివేత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైకోర్టు గ్రీన్ సిగ్నల్ లభించడంతో తెలంగాణలో కొత్త సచివాలయం నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. దీంతో పాత సచివాలయం కూల్చివేత పనులు శరవేగంగా సాగుతున్నాయి. సచివాలయం వెళ్లే  దారులన్నీ మూసివేశారు. అర్ధరాత్రి నుంచి కూల్చివేత పనులు ప్రారంభం అయ్యాయి. ఆర్&బి ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి కూల్చివేత పనులు. కూల్చివేతలో భాగంగా మొదట జీ,సి బ్లాక్ లను కూల్చివేయనున్నారు.  పాత సచివాలయం స్థానంలో కొత్త సచివాలయం నిర్మించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. అయితే, సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తూ అనేకమంది కోర్టులో పిటిషన్లు దాఖలు చేయడంతో ఆలస్యం అయ్యింది.  

భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. పాత సచివాలయ భవనాన్ని కూల్చేసి... అదే స్థానంలో కొత్త సచివాలయం నిర్మాణాన్ని చేపట్టాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగానే పాత సచివాలయ భవనాన్ని కూల్చేస్తున్నారు. భవనం కూల్చివేత ప్రక్రియను పూర్తి చేసి... శ్రావణ మాసంలో కొత్త సచివాలయం నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు మొదలయ్యేలా చూడాలని కేసీఆర్ సర్కార్ యోచిస్తోంది.

https://www.photojoiner.net/image/V6CDS43M

నూతన సచివాలయ నిర్మాణానికి గత ఏడాది శంకుస్థాపన చేసిన సీఎం కేసీయార్ 

సచివాలయంలోని అన్ని విభాగాలను ఈ ఏడాది ప్రారంభంలోనే బీఆర్కె భవన్లోకి మార్చేశారు. కొన్ని విభాగాలను మసాబ్ ట్యాంకులోకి ఐఅండ్ పీఆర్ భవనానికి మార్చారు. 2021 నాటికి నూతన సచివాలయం నిర్మాణం పూర్తిచేయాలని భావిస్తున్నారు. కొత్తగా నిర్మించాలని భావిస్తున్న పాత సచివాలయం ప్రాంతంలో గత ఏడాది జూన్ 28వ తేదీన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేశారు. సచివాలయం డీ–బ్లాక్‌ వెనుక భాగం లోని పోర్టికో ఎదురుగా ఉన్న గార్డెన్‌లో కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మాణానికి గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో భూమి పూజ నిర్వహించారు. శృంగేరీ పీఠం వేదపండితులు పూజలు నిర్వహించారు.

ప్రస్తుత సచివాలయ భవనాల్లో వాస్తుదోషాలున్నాయని, సరైన సదుపాయాలు లేవన్న కారణంతో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. సచివాలయంలోని ప్రస్తుత భవనాలన్నింటినీ కూల్చేసి ఒకే బ్లాక్‌గా కొత్త సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ప్రస్తుత సచివాలయం 10 బ్లాకులుగా 25.5 ఎకరాల్లో విస్తరించి ఉంది. 4 లక్షల నుంచి 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించే అవకాశాలున్నాయి. సచివాలయానికి నలువైపులా రోడ్లు, సచివాలయం సముదాయం ఎదురుగా గార్డె న్లు, ఫౌంటెయిన్లను ఏర్పాటు చేస్తారు. సచివాలయం అత్యాధునికంగా రూపొందనుంది. 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   13 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   13 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   17 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   19 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   14 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   21 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   21 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   14 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   16 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle