newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

శభాష్ కేటీయార్...లాక్ డౌన్ బాధితులకు ఆపన్నహస్తం

25-03-202025-03-2020 14:38:16 IST
2020-03-25T09:08:16.878Z25-03-2020 2020-03-25T09:07:25.696Z - - 15-04-2021

శభాష్ కేటీయార్...లాక్ డౌన్ బాధితులకు ఆపన్నహస్తం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న వేళ ప్రభుత్వాలు కఠిని నిర్ఱయాలు తీసుకుంటున్నాయి. 21 రోజుల పాటు దేశమంతా లాక్ డౌన్ వున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ఇరుక్కుపోయి తమ గమ్యస్థానాలకు వెళ్లలేనివారికి ఆపన్న హస్తం అందిస్తున్నారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీయార్. లాక్ డౌన్ తో హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో వుండిపోయి, స్వగ్రామాలకు వెళ్లలేని వారు ట్విట్టర్లో మంత్రి కేటీయార్ సాయం కోరుతున్నారు. వారికి తనవంతు సాయం చేస్తూ భరోసా ఇస్తున్నారు. 

ప్రజల అత్యవసర సమస్యలకు పురపాలకశాఖ మంత్రి కేటీయార్ పరిష్కారం చూపారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలతోపాటు, ఆంధ్రప్రదేశ్‌వాసులకు భరోసా కల్పించారు. ట్విట్టర్‌ ద్వారా తన దృష్టికి తీసుకొచ్చిన అనేక సమస్యల పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్‌ హైదర్‌నగర్‌లోని రెయిన్‌బో దవాఖానలో ఈనెల 28న తనకు స్కానింగ్‌ ఉన్నదని.. అక్కడకు వచ్చేందుకు సాయం చేయాలంటూ ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శాంతిజ్యోతి అనే ఏడునెలల గర్భిణి ట్విట్టర్‌లో కోరారు. దీనికి మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ తమ సిబ్బంది సాయం చేస్తారని సాయం అందించారు. వివరాలను తనకు అందించాలని కోరారు.

అలాగే ఆంధ్రప్రదేశ్‌కే చెందిన చక్రధర్‌ మంత్రికి ట్వీట్‌ చేశారు. ఏప్రిల్‌ మొదటివారంలో తన సోదరికి వైద్యులు ప్రసవం  తేదీ ఇచ్చారని.. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఆమెకు తన తల్లి సాయం కావాల్సి ఉందని తెలిపారు. కేటీఆర్‌ స్పందిస్తూ తమ బృందం సాయం చేస్తుందని అన్నారు. అత్యవసరాల్లో ఉన్నవారు 100కు డయల్‌ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారని, ప్రతిఒక్కరూ ఆ నంబరుకు డయల్‌ చేసి సాయం పొందాలని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

కరోనా వైరస్‌ రోజురోజుకూ విస్తరిస్తుండటంతో యావత్‌ సమాజమంతా ఆపత్కాలంలో ఉన్నదని, ఈ మహమ్మారి నుంచి తప్పించుకొనేందుకు ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కేటీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తిచేశారు. ప్రజలంతా తమ తమ ఇళ్ళకే పరిమితం కావాలని, ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను పాటించాలని ఆయన కోరారు. అత్యవసర సేవల్లో నిమగ్నమైన సిబ్బందికి అక్కడక్కడా ఇబ్బందులు ఎదురవుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని, వీరి విషయంలో పోలీసులు సానుకూలంగా వ్యవహరించేలా చూడాలని హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీకి మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. అంతేకాదు రోడ్లమీద అనవసరంగా తిరుగుతూ ఇబ్బందులు తెచ్చుకోవద్దన్నారు. 

https://www.photojoiner.net/image/dlyYXOsb

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle