newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

శంషాబాద్ లో మరో దారుణం.. మహిళ హత్య, దహనం

30-11-201930-11-2019 08:11:52 IST
Updated On 30-11-2019 12:38:08 ISTUpdated On 30-11-20192019-11-30T02:41:52.010Z30-11-2019 2019-11-30T02:35:07.832Z - 2019-11-30T07:08:08.583Z - 30-11-2019

శంషాబాద్ లో మరో దారుణం.. మహిళ హత్య, దహనం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్ నగర శివారులోని శంషాబాద్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి అత్యాచారం, హత్య, దహనం కేసు విషయం మరిచిపోకముందే మరో ఘోరం జరగడం ఆందోళన కలిగిస్తోంది. మహిళను హత్యచేసి తగలబెట్టారు దుండగులు. సిద్ధులగుట్ట సమీపంలో మహిళ మృతదేహం లభించింది. ఆమెపై లైంగికదాడి జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

ప్రియాంక ఉదంతం జరిగిన ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. కట్ట మైసమ్మ ఆలయం పక్కన రాత్రి 8 గంటల సమయంలో మంటలు వస్తుండటంతో అటుగా వెళ్తున్న కొందరు గమనించి దగ్గరకు వెళ్లారు. ఓ మహిళ మృతదేహం కాలుతుండటంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. వెంటనే ‘100’కు సమాచారం అందించారు.

అప్పటికే ఆ మహిళ ముఖం, చేతులతోపాటు దుస్తులు కాలిపోయినట్టు తెలుస్తోంది. ఆమె కాళ్లకు మెట్టెలు ఉన్నాయి. మృతదేహం బోర్లాపడి ఉంది. దుండగులు మహిళను హత్య చేసి ఆ తర్వాత మృతదేహాన్ని దహనం చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు చెబుతున్నారు, మహిళ వయసు 30 ఏళ్ళు ఉండవచ్చని, ఆమెపై అత్యాచారం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య జరిగిన 48 గంటల వ్యవధిలోనే మరో ఘటన జరగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. ఆలయంలో అయ్యప్ప స్వాములకు చెందిన దుస్తులు ఆరబెట్టి ఉండటంతో సాయంత్రం వరకు అక్కడ అయ్యప్ప దీక్షదారులు ఉన్నట్లు తెలుస్తోంది. మహిళను వేరే చోట హత్య చేసి అయ్యప్ప దీక్షదారులు వెళ్లిపోయిన తర్వాత ఆలయం పక్కన కాల్చేసి ఉంటారంటున్నారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలించారు. ఘటనాస్థలిని సందర్శించిన డీసీపీ ఎన్‌.ప్రకాశ్‌రెడ్డి... ఈ ప్రాంతానికి వచ్చే మార్గంలోని సీసీ ఫుజేజీలను పరిశీలిస్తున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle