newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 71 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 1991 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

శంషాబాద్ నుంచి జర్మనీకి 38మంది తరలింపు

02-04-202002-04-2020 12:23:50 IST
Updated On 02-04-2020 12:26:51 ISTUpdated On 02-04-20202020-04-02T06:53:50.536Z02-04-2020 2020-04-02T06:53:33.522Z - 2020-04-02T06:56:51.814Z - 02-04-2020

శంషాబాద్ నుంచి జర్మనీకి 38మంది తరలింపు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచదేశాలను వనికిస్తున్న కోవిడ్ 19 నివారణ కోసం భారతదేశం పూర్తిగా లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి జర్మనీ దేశానికి 38 మందిని ప్రత్యేక విమానంలో తరలించారు. జిఎంఆర్ అద్వర్యంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కోవిడ్ 19 విమానాలను హ్యండిల్ చేస్తూ కోవిడ్ 19 కు వ్యతిరేకంగా . దేశం చేస్తుంన్న పొరాటనికి మద్దతు పలుకుతుందని అన్నారు. గత నెల 28న జర్మన్ నుంచి వచ్చిన ప్రత్యేక విమానం చెన్నై  ఎయిర్ పోర్ట్ కు ఎయిర్ ఇండియా బోయింగ్  B 787-8 విమానం A 13005 ఉదయం 7:32 ని ఎయిర్ పోర్ట్ లో దిగింది. జర్మనీకి చెందిన 38 మంది ప్రయాణికులు 19 మంది మహిళలు17 మంది పురుషులు ఇద్దరు చిన్నపిల్లలు  ఉన్నారు.

హైదరాబాద్ నుంచి జర్మన్ దేశస్తులను ఎయిర్ పోర్ట్ కు తీసుకువచ్చారు. అత్యవసర పరిస్తితిని ఎదుర్కోనడానికి చిక్కుకుపోయిన ప్రయాణికులను తరలించడానికి జిఎచ్ఐఎఎల్ కు చెందిన టర్మినల్ ఆపరేషన్ సిబ్బంది ఎయిర్ సైడ్ అపరేషన్స్  ఎవోసిసి ఎటిసి ల్యాడ్ సైడ్ సెక్యూరిటీ సిఐఎస్ఎఫ్ ఇమ్మిగ్రేషన్ కష్టమ్స్ ఎపిహెచ్ఒ తదితర సిబ్బందిని సిద్దంగా ఉంచారు.వీరు టర్మినల్ లోకి ప్రవేశించే లోపే విరికి కోవిడ్19 థర్మల్  స్క్రీనింగ్ నిర్వహించారు. స్పెషల్ స్క్రీనింగ్ పలు భద్రతా చర్యలు నిర్వహించారు. బుధవారం ఉదయం 9:22 శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి బయలుదేరి ముంబైకి చేరుకున్నట్లు ఆధికారులు తెలిపారు.

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాలను నడిపేందుకు సహకరిస్తూ దేశవ్యాప్తంగా నిత్యవసర వస్తువుల సప్లై ఎలాంటి అటంకాలు లేకుండా కృషి చేస్తున్నారు. కస్టమ్స్ గ్రౌండ్ హాండర్లు ఫార్వర్డర్లు రాష్ట పొలీసులు కార్గో అసోసియేషన్ లలో అత్యవసర వస్తువులైన ఔషధాలు, వ్యాక్సిన్, మెడికల్ ఎక్విప్ మెంట్లు, ఫార్మా  పదార్దాలు, రక్షణ పరికరాలు, బ్యాంక్ కు సంబంధించిన వస్తువులు రవాణ కొనసాగించేందుకు సహకరిస్తుందన్నారు.

తాండూరులో కలకలం

సంచలనం సృష్టించిన నిజాముద్దీన్ మర్కజ్  సంఘటన తాండూరులో కలకలం రేపింది. మర్కజ్ సదస్సు కోసం ఢిల్లీ  వెళ్లిన వారిలో వికారాబాద్ జిల్లా తాండూర్ కు చెందిన 7 గురు వ్యక్తులు ఉన్నారని తెలియడంతో తాండూరు వాసుల వెన్నులో వణుకు మొదలైంది.  ఈనెల 17వ తేదీన ఢిల్లీ నుంచి తెలంగాణ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణించిన వారిలో 7 గురు తాండూరు వాసులు ఉన్నట్లు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందింది. 

దీంతో హుటాహుటిన వైద్య ఆరోగ్య,  రెవెన్యూ, పోలీస్ సిబ్బంది తాండూరు ప్రాంతంలో వివిధ చోట్ల ఉన్న వారి ఇంటికి వెళ్లి వారికి ప్రాథమిక వైద్య పరీక్షలు జరిపి సదరు వ్యక్తులు ఇక్కడ ఉంటే సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమని గుర్తించిన అధికారులు వికారాబాద్ అనంతగిరి ఐసోలేషన్ సెంటర్‌కు ముందు జాగ్రత్త చర్యగా తరలించారు. ఈ వార్త తాండూరులో సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగి స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle