newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

వ్యాప్తి తగ్గుతున్నా కేసులు తగ్గట్లే.. భాగ్యనగరంలో వింతపరిస్థితి!

04-05-202004-05-2020 13:56:51 IST
Updated On 04-05-2020 13:59:23 ISTUpdated On 04-05-20202020-05-04T08:26:51.838Z04-05-2020 2020-05-04T08:26:49.964Z - 2020-05-04T08:29:23.218Z - 04-05-2020

వ్యాప్తి తగ్గుతున్నా కేసులు తగ్గట్లే.. భాగ్యనగరంలో వింతపరిస్థితి!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలోనే కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఒకటి. హైదరాబాద్ లాంటి మహానగరం ఉన్న రాష్ట్రమైనా ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలు కొంతవరకు వ్యాప్తిని అరికట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుంది. అందుకు తగ్గట్లే ప్రభుత్వం కూడా రెడ్ జోన్లను తగ్గిస్తూ వస్తుంది. కానీ పాజిటివ్ కేసులు మాత్రం తగ్గినట్లే తగ్గి మళ్ళీ పెరుగుతున్నాయి.

తెలంగాణలో ఆదివారం కొత్తగా 21 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 20 కేసులు జీహెచ్ఎంసి పరిధిలోనే నమోదవగా ఒక్కటి మాత్రం జగిత్యాలలో నమోదైంది. అయితే, ప్రభుత్వం మాత్రం వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉందని చెప్తుంది. ప్రభుత్వం చెప్తున్న మాటలు కూడా ఒకరంగా వాస్తవమే. ప్రస్తుతం కోవిడ్ ఆసుపత్రులలో వైరస్ కు చికిత్స పొందేవారి సంఖ్య కన్నా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంది.

మరోవైపు కంటైన్మెంట్ జోన్లలో కేసులు నమోదు ఆగిపోవడంతో ఆ ప్రాంతాలను కంటైన్మెంట్ నుండి తొలగిస్తున్నారు. అలా ఒక్క హైదరాబాద్ నగరంలో మొత్తం 169 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయగా ప్రస్తుతం నగరంలో 96 కంటైన్మెంట్ జోన్లు మాత్రమే ఉన్నాయి. అంతగా వ్యాప్తి తగ్గింది. కానీ కేసులు మాత్రం కొత్తగా నమోదు ఆగడం లేదు. దీంతో ప్రభుత్వానికి, అధికారులకు కొంత సమాలోచనలో పడినట్లుగా తెలుస్తుంది.

కొత్త కేసులు ఎక్కువగా జీహెచ్ఎంసి పరిధిలోనే నమోదవుతుండగా అది కూడా పాత కంటైన్మెంట్ జోన్ పక్కనే కొత్త కేసులు నమోదవుతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా మలక్ పేట్, ఖైరతాబాద్, కూకట్పల్లి ప్రాంతాలలో ఈ తరహా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఇక చార్మినార్ జోన్, వనస్థలిపురంలో కూడా అదే తరహాలో కొత్త కేసుల సంఖ్య పెరుగడంపై సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

కొత్త కేసులు నమోదవుతున్న ప్రాంతాలలో హోల్ సెల్ మార్కెట్ల ద్వారా వ్యాప్తి జరుగుతున్నట్లుగా కొంతవరకు నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తుంది. కంటైన్మెంట్ జోన్ల నుండి మార్కెట్లకు అక్కడ నుండి పక్కనే ఉన్న ప్రాంతానికి ఇలా వ్యాప్తి జరుగుతున్నట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వైరస్ కట్టడిలో విజయం సాధించగా హైదరాబాద్లో కేసుల సంఖ్య కంట్రోల్ చేయలేకపోతున్నారు.

మే 8 తర్వాత పరిస్థితులపై సీఎం కెసిఆర్ మంగళవారం మంత్రి వర్గంతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కూడా కంటైన్మెంట్ జోన్లు, పక్కనే కొత్త కేసులు, మార్కెట్లపై కూడా చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుండగా మే 8 తరవాత కూడా కంటైన్మెంట్ జోన్లలో కఠినంగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా మార్కెట్లు, హోల్ సెల్ దుకాణాల విషయంలో మరింత నిఘా పెంచనున్నారట.

కాగా, మరోవైపు నేటి నుండే లాక్ డౌన్ 3.0లో కేంద్రం ఇచ్చిన సడలింపులలో మే 8 నుండి రాష్ట్రంలో అమలు చేయాల్సిన సడలింపులపై కూడా రేపటి మంత్రి వర్గంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో నిర్మాణ రంగంతో పాటు చిన్నా, మధ్య తరగతి పరిశ్రమలు పునప్రారంభించాలని.. దీంతో కొంతవరకు ప్రజల ఆర్ధిక స్థితి మెరుగవుతుందని భావిస్తున్నారు. అయితే..  తెలంగాణలో కేసీఆర్ కేంద్రం ఇచ్చిన సడలింపులను పూర్తిస్థాయిలో అమలు చేసే ఉద్దేశ్యంలో లేనట్లుగా తెలుస్తుంది.

 

 

 

 

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   5 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   7 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   10 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   11 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   12 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   13 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   13 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   13 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   14 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   14 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle