newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వ్యాపారుల స్వచ్ఛంద లాక్ డౌన్.. బేగంబజార్, జనరల్ బజార్ బంద్

28-06-202028-06-2020 08:45:15 IST
2020-06-28T03:15:15.550Z28-06-2020 2020-06-28T03:15:07.683Z - - 20-04-2021

వ్యాపారుల స్వచ్ఛంద లాక్ డౌన్.. బేగంబజార్, జనరల్ బజార్ బంద్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏరోజుకారోజు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో మార్కెట్లు, షాపులు సెల్ఫ్​ లాక్​డౌన్​లోకి వెళ్తున్నాయి. ఎక్కడి నుంచి, ఎవరి నుంచి, ఎలా వైరస్​ అంటుకుంటుందోనని వ్యాపారులు భయపడుతున్నారు. ఇదే టైంలో ప్రభుత్వం టెస్టులు చేయడం కూడా ఆపేయడం మరింత ఆందోళనకు దారితీసింది. దీంతో హైదరాబాద్​, సికింద్రాబాద్​లోని ప్రధాన మార్కెట్లన్నీ మూతపడుతున్నాయి. ఇప్పటికే కొన్ని మార్కెట్లు మూతపడగా.. దాదాపు మిగతా మార్కెట్లన్నీ ఆదివారం నుంచి జులై 5 వ‌‌ర‌‌కు బంద్​ కానున్నాయి.

జులై 5 వరకు స్వచ్ఛందంగా లాక్‌‌డౌన్‌‌ పాటిస్తున్నట్లు గోల్డ్‌‌ అండ్‌‌ సిల్వర్‌‌ మర్చంట్‌‌ అసోసియేషన్‌‌, హైదరాబాద్​ కిరాణ మార్చంట్​అసోసియేషన్లు ప్రకటించాయి. ఇటు మెడికల్ హోల్ సేల్ వ్యాపారులు కూడా బంద్ పాటిస్తున్నారు. హోల్ సేల్ మెడిసిన్స్​ అమ్మకాలకు పేరొందిన హైదరాబాద్​లోని ఇంద్రబాగ్ వ్యాపారులు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు తమ వ్యాపారాలను మూసి వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

ఈ నెల 28 వరకు ఎలాంటి అమ్మకాలు ఉండవని, ఎవరూ కొనుగోళ్లకు రావొద్దని ఇంద్రబాగ్​ మెడికల్ ట్రేడర్స్ అసోసియేషన్ పేర్కొంది. బేగంజజార్‌‌ మార్కెట్‌‌ పరిధిలోకి వచ్చే కిషన్‌‌గంజ్, మహారాజ్‌‌గంజ్‌‌, బర్తన్‌‌ బజార్‌‌ తదితర మార్కెట్లు కూడా బంద్​ కానున్నాయి. సికింద్రాబాద్​లోని రాణిగంజ్ మార్కెట్‌‌లో కూడా వ్యాపారులు సెల్ఫ్​ లాక్‌‌డౌన్ పాటించనున్నారు.

ఇవాళ్టి నుంచి 8 రోజుల పాటు రాణిగంజ్ హ‌‌‌‌బ్‌‌‌‌లోని 5 వేల షాపులు బంద్ కానున్నాయి. నాంపల్లిలోని ఫర్నిచర్స్ షాప్స్ అన్నీ స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. శుక్రవారం నుంచి జులై 5 వరకు సెల్ఫ్​ లాక్​ డౌన్​ పాటిస్తున్నట్లు తెలంగాణ ఫర్నిచర్స్ మ్యానిఫెక్చర్స్ అండ్​ డీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఉస్మాన్​గంజ్​ మార్కెట్​ఇక రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఓపెన్ చేస్తారు. 

ఇటు హైదరాబాద్ లో సెల్​ఫోన్లకు కేరాఫ్​గా ఉన్న హైదరాబాద్​లోని జగదీశ్​ మార్కెట్​ కూడా బందయ్యే అవకాశాలున్నాయి. శనివారం జగదీశ్​ మార్కెట్​ అసోసియేషన్​ బోర్డు నిర్ణయం తీసుకోనుంది. సోమవారం నుంచి వారంపాటు జగదీశ్​ మార్కెట్​లో సెల్ఫ్​ లాక్​ డౌన్​ పాటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు దిల్ సుఖ్ నగర్ కూడా బంద్ కావడంతో కరోనా ప్రభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. వివిధ జిల్లాల్లోనూ వ్యాపారులు లాక్ డౌన్ కొనసాగిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కొంత టైం వరకు మాత్రమే షాపులను తెరుస్తున్నారు. అన్ని జిల్లాల్లో ప్రధాన మార్కెట్లు, బజార్లను బంద్ చేశారు. తక్కువ సమయం మాత్రమే తెరుస్తున్నారు.

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   14 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   13 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   18 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   19 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   15 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   a day ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   a day ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   14 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   16 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle