newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వ్యాక్సిన్ పాలసీ ఏదీ.. కేంద్రానికి కేటీయార్ లేఖ

08-08-202008-08-2020 10:32:00 IST
2020-08-08T05:02:00.490Z08-08-2020 2020-08-08T05:01:50.336Z - - 22-04-2021

వ్యాక్సిన్ పాలసీ ఏదీ.. కేంద్రానికి కేటీయార్ లేఖ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు 20 లక్షల మార్కు దాటేశాయి. మరణాలు కూడా 40 వేలకు చేరాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్‌ త్వరలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశమున్నందున అందరికీ అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం ‘వ్యాక్సిన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ పాలసీ’ని సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సూచించారు. 

వ్యాక్సిన్‌ తయారీ సంస్థకు పీఎం కేర్స్‌ నుంచి రూ.100 కోట్లు కేటాయించిన నేపథ్యంలో మార్గదర్శకాలు రూపొందించడంతోపాటు, వ్యాక్సిన్‌ తయారీలో ముందు వరుసలో ఉన్న కంపెనీలకు మరింత ఫండింగ్‌ కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలన్నారు.త్వరగా వ్యాక్సిన్ వస్తే ప్రజలకు ఉపశమనంగా వుంటుందన్నారు. దీనికి సంబంధించి సెంట్రల్ హెల్త్ మినిష్టర్ హర్షవర్ధన్‌కు కేటీఆర్‌ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రపంచ వ్యాక్సిన్‌ రాజధాని గా ఉన్న హైదరాబాద్‌ ఏటా 5 బిలియన్‌ డోసులు తయారీ ద్వారా ప్రపంచంలో మూడో వంతు వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేస్తోందని తెలిపారు. భారత్‌లో వ్యాక్సిన్‌ల తయారీ కోసం ఆరు కేంద్ర ప్రభుత్వ శాఖలతోపాటు, రాష్ట్ర స్థాయిలో అనుమతులు తీసుకోవాల్సి వస్తోంది. అనుమతులు, క్లియరెన్సుల కోసం నిబంధనలు సరళతరం చేస్తూ కొత్త విధానం రూపొందించాలని కేటీఆర్‌ సూచించారు. దేశానికి వ్యాక్సిన్లు సరఫరా చేసే స్థాయికి హైదరాబాద్ చేరుకుందన్నారు కేటీయార్. 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   6 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   9 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   12 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   13 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   13 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   11 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   a day ago


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle