newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

వ్యక్తిపూజ.. తమిళనాడుకి పోటీగా తెలంగాణ?

11-03-202011-03-2020 14:08:05 IST
2020-03-11T08:38:05.313Z11-03-2020 2020-03-11T08:38:01.703Z - - 26-05-2020

వ్యక్తిపూజ.. తమిళనాడుకి పోటీగా తెలంగాణ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వ్యక్తిపూజ చేయడంలో తమిళనాడుని కొట్టేవాళ్లే ఉండరు. కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా త్వరలో ఆ పరిస్థితి వచ్చేలా కనిపిస్తుంది. పొరుగున ఉన్న ఏపీలో కులాలు, మతాలు ఆధారంగా కూడా కొంత వెర్రి అభిమానం పడగలెత్తి కాటేస్తుంటే.. తెలంగాణలో మాత్రం పూర్తిగా వ్యక్తిపూజ కమ్మేసే సూచనలు కనిపిస్తున్నాయి.

తమిళనాడులో సినిమా హీరోలు, హీరోయిన్స్ నుండి రాజకీయ నాయకుల వరకు అక్కడ అందరికీ గుడికట్టేసేంత పిచ్చి అభిమానం ఉంటుంది. అది ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు.. దక్షిణాదిలో తొలినాళ్ళలో సినిమా పరిశ్రమ అక్కడే పుట్టడం.. సినిమా వాళ్లే రాజకీయాలలో ఎంటర్ కావడంతో అక్కడ ఆ పరిస్థితి కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు.

వెండితెర మీద దేవుళ్ళుగా కనిపించిన ఆ నాయకీ, నాయకలు ఎన్నికల కోసం ప్రజల మధ్యకి రావడంతో అభిమానం కాస్త పూజత్వంగా మారిపోయింది. ఎంజీఆర్ నుండి మొన్నటి జయలలిత వరకు.. అలా వయా సినిమా మీదుగా రాజకీయాలలో చరిత్ర సృష్టించగా అక్కడి ప్రజలు వాళ్ళు ఏం చేసినా మహాప్రసాదంగా భావించడం పొరుగు రాష్ట్రాల ప్రజలకు వింతగా అనిపించేది.

ఇక, తెలంగాణ విషయానికి వస్తే తొలి నుండి పోరాటాల గడ్డ అనే పేరుంది. ప్రశ్నించడం ఇక్కడ ప్రజలకు అణువణువునా నిండిపోయి ఉంటుందని పేరు. అలనాటి రజాకార్ల నుండి జమీందార్లు, పటేల్-పట్వారీ వ్యవస్థ అందరిపై పోరాటాలు చేసిన పురిటిగడ్డగా తెలంగాణను ఆదర్శంగా చూపిస్తారు. కానీ మెల్లగా ఇక్కడి పరిస్థితిలో మార్పు వచ్చేస్తుందనిపిస్తుంది.

ప్రస్తుతం ఎక్కడ చూసినా కేసీఆర్, కేటీఆర్ నామస్మరణే.. ఆయనేం చేసినా రాష్ట్ర కళ్యాణం కోసమే అనేలా భజన బృందాలు రెడీ అయిపోతున్నాయి. ఆ పార్టీలో కేసీఆర్ ను గాడ్ ఫాదర్ లా కొలిచేవాళ్ళు కొందరైతే కేటీఆర్ ను యువరాజులా కొలిచేవాళ్ళు మరికొందరు. ఇంకొంతమంది మరో అడుగు ముందుకేసి కేసీఆర్ ను జాతిపితతో కూడా పోల్చేశారు.

ఇప్పటికే మంత్రులు.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు.. నేతలు ఆ తండ్రి-కొడుకులను పొగడం చూస్తే ఇప్పుడు హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఏకంగా పాలాభిషేకమే చేసేశారు. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏడాదికి పదివేల కోట్లు చొప్పున అభివృద్ధి పనులకు కేటాయించారు. దీంతో మేయర్ బొంతు పాలాభిషేకం చేశారు.

అయితే ఏడాదికి పదివేల కోట్లు కేటాయించిన మాట నిజమే కానీ.. అందులోనే మూసీ నది ప్రక్షాళన, పరివాహక ప్రాంత అభివృద్ధికి కూడా కేటాయింపులు అని మెలిక పెట్టారు. ఇందులో హైద్రాబాద్ నగరానికి సీఎం కేసీఆర్ చిత్ర పటానికి వచ్చేంత నిధులు ఉన్నాయా అన్నది ప్రశ్న. రాష్ట్రానికి ఆదాయం తెచ్చే నగరానికి నిధుల కేటాయింపు రొటీన్ గానే జరిగిపోవాలి.

కానీ.. ఇక్కడ ఏంటో మూసీ నది ప్రక్షాళనకి నిధులు ఇచ్చినా మేయర్ ఏకంగా పాలాభిషేకం చేయడం విశేషం. అది కూడా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న మేయర్ ఈ పనిచేయడం.. పేద పిల్లల ఆకలి తీర్చాల్సిన పాలను ఇలా అభిషేకాలకు ఉపయోగించడం విమర్శల పాలు చేస్తుంది. ఇక మిగిలింది తమిళనాడు తరహాలో గుళ్ళు.. గోపురాలే తక్కువేమో మరి!

 

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   5 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   7 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   10 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   11 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   12 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   12 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   13 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   13 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   14 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   14 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle