newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వైసీపీ నేత పీవీపీ దూకుడు.. పోలీసులపైకి పెంపుడు కుక్కలు

30-06-202030-06-2020 07:59:32 IST
Updated On 30-06-2020 08:58:27 ISTUpdated On 30-06-20202020-06-30T02:29:32.184Z30-06-2020 2020-06-30T02:29:05.349Z - 2020-06-30T03:28:27.753Z - 30-06-2020

వైసీపీ నేత పీవీపీ దూకుడు.. పోలీసులపైకి పెంపుడు కుక్కలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భూవివాదంలో అరెస్టయిన వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ తీరుపై హైదరాబాద్ పోలీసులు మండిపడుతున్నారు. తన ఇంటి నిర్మాణాన్ని పీవీపీ అడ్డుకున్నాడంటూ ఓ పారిశ్రామిక వేత్త కైలాష్ ఫిర్యాదుచేయడంతో పీవీపీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ కేసు విచారణకు హాజరవ్వాలని ఆయనకు పోలీసులు గతంలో నోటీసులు పంపించారు. కానీ ఆయన హాజరుకాకపోవటంతో నేరుగా పోలీసులు పీవీపీ ఇంటికి వెళ్లారు. 

పీవీపీ సినీ నిర్మాత కావడంతో ...అయితే అక్కడ సినిమా సీన్ పోలీసులకు కనిపించింది. పోలీసులపైకి తన పెంపుడు కుక్కలను వదిలాడు పీవీపీ. దాంతో భయాందోళనకు గురైన పోలీసులు బయటికి వచ్చేసారు. ఈ ఘటనపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విచారణకు వెళితే తమపైకి పెంపుడు కుక్కలను వదిలాడని ఎసై హరీష్ రెడ్డి ఫిర్యాదు చేసారు.

దాంతో పీవీపీ పై సెక్షన్ 353కింద కేసు నమోదు చేసారు. తమ విధులకు ఆటంకం కలిగించాడని పీవీపీపై పోలీసులు మరో కేసు నమోదుచేశారు. 2019 ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి వైసీీప తరపున పీవీపీ పోటీ చేసిన విషయం తెలిసిందే. టీడీపీ నేత కేశినేని నానిపై ఆయన ఓటమి పాలయ్యారు. పీవీపీ ఇంటిముందున్న కైలాష్ ఇంటికి మార్పులు చేయడం వల్ల తన ఇంటి అందం పాడవుతుందని పీవీపీ వాదిస్తున్నారు. దీంతో ఆయన ఆ ఇంటి నిర్మాణాన్ని అడ్డుకోవడం, అక్కడ ధ్వంసం చేయడంతో వివాదం రేగింది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle