newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వైసీపీ నేత పీవీపీ అరెస్టు.. బంజారాహిల్స్‌లో భూ వివాదం

25-06-202025-06-2020 10:02:35 IST
Updated On 25-06-2020 11:16:54 ISTUpdated On 25-06-20202020-06-25T04:32:35.277Z25-06-2020 2020-06-25T04:32:21.821Z - 2020-06-25T05:46:54.639Z - 25-06-2020

వైసీపీ నేత పీవీపీ అరెస్టు.. బంజారాహిల్స్‌లో భూ వివాదం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్ లో మరో భూ వివాదం సంచలనంగా మారింది. ఈ వివాదానికి సంబంధించి వైసీపీ నేత, పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్ ఉరఫ్ పీవీపీని బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్‌ రోడ్ నంబర్ 14లోని భూమి విషయమై వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ వివాదంలో చిక్కుకున్నారు.

పీవీపీ అనుచరులు తనపై దాడి చేశారని కైలాష్ విక్రమ్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు ఇరు వర్గాలను పిలిచి విచారణ జరిపారు. ఏం జరిగిందన్నది అడిగి తెలుసుకున్నారు. కైలాష్ విక్రమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీవీపీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు పోలీసులు. 

ఈ ఫిర్యాదుపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఏడాది క్రితం పీవీపీ విల్లాస్‌లో ఇళ్లు కొనుగోలు చేశారు కైలాష్ విక్రమ్. కొనుగోలు సమయంలో ఎలాంటి రూల్స్ చెప్పలేదన్నది ఆయన వాదన. ఇప్పుడు టెర్రస్‌పై రూఫ్‌ టాప్ గార్డెన్‌ నిర్మిస్తుంటే పీవీపీ వచ్చి వద్దని బెదిరిస్తున్నారని ఆరోపించారు. గతంలోనూ ఇలాంటి బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. మా ఇంట్లో ఏం చేయాలనేది మా ఇష్టం అని స్పష్టం చేయడంతో..బుధవారం పీవీపీ 40 మందితో వచ్చి దౌర్జన్యం చేశారని కైలాష్ ఆరోపించారు.. గార్డెన్‌ పనుల్ని అడ్డుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో తనను అడ్డుకోవడం ఏంటని కైలాష్ వాదిస్తున్నారు. 

కైలాష్ విక్రమ్ ఇంటి వెనుకాలే పీవీపీ ఇల్లు ఉండడమే వివాదానాకి కారణమయింది. టెర్రస్‌పై గార్డెన్ నిర్మిస్తే… తన ఇల్లు సరిగా కనిపించదన్నది పీవీపీ వాదిస్తున్నారు. అయితే ఇల్లు కొనుగోలు చేసేప్పుడు ఎలాంటి నిబంధనలు చెప్పకుం ఇప్పుడు ఇలాంటి నిబంధనలు పెట్టడం ఏంటని కైలాష్ విక్రమ్ ప్రశ్నిస్తున్నారు. ఫ్లాట్ విక్రయించిన తర్వాత డెవలపర్స్‌కు ఎలాంటి సంబంధం ఉండదు కాబట్టి.. తమ ఇంట్లో చేసుకుంటున్న మార్పులను పీవీపీ ఎలా అడ్డుకుంటారని కైలాష్ నిలదీస్తున్నారు. ఇప్పటికే రెండు వర్గాలతో మాట్లాడిన పోలీసులు విచారణ పూర్తయిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.అనంతరం ఆయనను అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. 

 

 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   10 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   14 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   11 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   15 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   13 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   18 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   17 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   20 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   16 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle