newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వైరస్ వ్యాపిస్తే మృత్యు ఘంటికలు తప్పవ్.. గాంధీ వైద్యుల హెచ్చరిక

27-03-202027-03-2020 12:08:37 IST
Updated On 27-03-2020 12:27:38 ISTUpdated On 27-03-20202020-03-27T06:38:37.983Z27-03-2020 2020-03-27T06:38:35.355Z - 2020-03-27T06:57:38.165Z - 27-03-2020

వైరస్ వ్యాపిస్తే మృత్యు ఘంటికలు తప్పవ్.. గాంధీ వైద్యుల హెచ్చరిక
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతకమైన కోవిడ్‌ వైరస్‌ను తెలంగాణలో నియంత్రించేందుకు రానున్న మూడు వారాలే అత్యంత కీలకమని, కరోనా వైరస్ మూడో దశకు వెళ్తే మృత్యు ఘంటికలు మోగుతాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో రెండురోజులుగా లోకల్‌ కాంటాక్టు ద్వారా ఐదు పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశమన్నారు. తెలంగాణలో మొత్తం 39 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీ, చెస్ట్‌ ఆస్పత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో 26 మంది బాధితులు వైద్య చికిత్సల అనంతరం కోలుకుంటున్నారని, బీపీ, సుగర్‌ నార్మల్‌గా ఉన్నాయని, వారి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని ట్రీటింగ్‌ వైద్యులు స్పష్టం చేస్తున్నారు. 

రానున్న మూడు వారాల్లో  వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రజలంతా హోం క్వారంటైన్‌లో ఉండాలని, స్వీయరక్షణపై మరింత శ్రద్ధ వహించాలని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చినవారిలో 34 మంది విదేశీయులతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చినవారు, ఐదుగురు  స్థానికులు ఉన్నారని, ఈ పరిస్థితిని స్టేజ్‌ 2గా పరిగణిస్తారని, ఇక్కడి పరిస్థితులు, ఉష్ణోగ్రతలకు తట్టుకునేలా కోవిడ్‌ వైరస్‌ రూపాంతరం చెంది, స్థానిక ప్రజల్లో వ్యాపిస్తే స్టేజ్‌ 3కి చేరినట్లేనన్నారు. 

ఇదే జరిగితే పెద్దసంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. స్టేజ్‌– 3లో వృద్ధులు, ఇతర రుగ్మతలు, వ్యాధులతో బాధపడేవారికి కోవిడ్‌ వైరస్‌ సులభంగా సోకే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. వృద్ధులు,బాలింతలు, గర్భిణులు, చిన్నారులు, వివిధ రుగ్మతలతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కీలకమైన ఈ మూడు వారాలు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ వ్యాప్తిని విజయవంతంగా నివారించవచ్చని వైద్య నిపుణులు తెలిపారు. 

కాగా, నోడల్‌ కేంద్రమైన గాంధీ ఆస్పత్రిలో సాధారణ చికిత్సల కోసం ఇన్‌పేషెంట్లుగా చేరిన రోగులు ఇకపై గాంధీ ఆసుపత్రిలో ఉండమని, తక్షణమే డిశ్చార్జి చేయాలంటూ సంబంధిత వైద్యులను కోరుతున్నారు. మూడు రోజుల క్రితమే గాంధీ ఓపీ విభాగం మూసివేసిన సంగతి తెలిసిందే. సర్జరీలు కూడా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రతి నిత్యం 2000 నుంచి 2,500 వేల మంది ఉండే ఇన్‌పేషెంట్‌ విభాగంలో రోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.  మరికొన్ని రోజుల్లో సాధారణ రోగులను డిశ్చార్జి చేసి  కేవలం కోవిడ్‌ బాధితులు, అనుమానితుల కోసమే గాంధీ ఆస్పత్రిని సిద్ధం చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 

గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న 26 మంది కోవిడ్‌ బాధితులు వైద్యసేవల అనంతరం కోలుకుంటున్నారని కోవిడ్‌ కన్వీనర్, జనరల్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ రాజారావు స్పష్టం చేశారు. ఐసోలేషన్‌ వార్డులో అన్ని వసతులు, సౌకర్యాలు కల్పించామని, ఆహ్లాదకరమైన వాతావరణంలో బాధితులంతా కోలుకుంటున్నారని, ఐసోలేషన్‌లో చేరిన నాటి నుంచి 14 రోజుల గడువు ముగిసిన వారికి రెండు దఫాలుగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి నెగిటివ్‌ వస్తే డిశ్చార్జి చేస్తామన్నారు.

కాగా హైదరాబాద్‌లో నెలరోజులపాటు కరోనా వైరస్‌పై జాగరూకతా కేంపెయిన్ ప్రారంభిస్తున్నట్లు హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ అనే ఎన్జీవో ప్రకటించింది. ఆసుపత్రుల్లో, బస్టాపుల్లో, రైల్వేస్టేషన్లలో సాధారణ ప్రజానీకానికి సాంక్రమిక వ్యాధుల గురించి చైతన్యం కలిగిస్తామని దీనికోసం తెలంగాణ ఆరోగ్య శాఖ అధికారుల సహాయం కూడా తీసుకుంటామని సంస్థ పేర్కొంది.

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవలసిన జాగ్రత్తలను, మాస్క్‌లను తప్పకుండా వాడాల్సిన అవసరం గురించి ఇప్పటికే జాగరూకతా కార్యక్రమం ప్రారంభించామని, ప్రజలను చైతన్యవంతం చేయడం ద్వారానే వ్యాధిలక్షణాలను వారు ముందుగానే గ్రహించి చికిత్స చేయించుకునేలా చేయవచ్చని హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ వలంటీర్ నరేష్ మీడియాతో చెప్పారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle