newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వైరస్ కట్టడి కష్టమే.. తెలంగాణలో రోజుకు 250 కేసుల నమోదు.

14-06-202014-06-2020 08:34:40 IST
Updated On 14-06-2020 10:10:54 ISTUpdated On 14-06-20202020-06-14T03:04:40.520Z14-06-2020 2020-06-14T03:04:36.549Z - 2020-06-14T04:40:54.027Z - 14-06-2020

వైరస్ కట్టడి కష్టమే.. తెలంగాణలో రోజుకు 250 కేసుల నమోదు.
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా శనివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 253 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 8 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,737కు చేరింది. మొత్తంగా 182మంది ప్రాణాలు కోల్పోగా,  2.352 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 2,203 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

కొత్తగా వచ్చిన కేసుల్లో 179 జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. మిగిలిన కేసుల్లో సంగారెడ్డిలో 24, మేడ్చల్‌లో 14, రంగారెడ్డి 11, మహబూబ్‌నగర్‌ 4,  వరంగల్‌ రూరల్‌, వరంగల్‌ అర్బన్‌, కరీంనగర్‌, నల్లగొండ, ములుగు, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాల్లో రెండేసి చొప్పున నమోదయ్యాయి. సిద్దిపేట, ఖమ్మం, మెదక్‌, నిజామాబాద్‌, నాగర్‌కర్నూల్‌, కామారెడ్డి, జగిత్యాలలో  ఒక్కో కేసు నమోదైనట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

తెలంగాణలో ఇవాళ భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు ఇవాళ భారీగా పెరిగాయి. తెలంగాణలో కొత్తగా 253 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా సోకి చికిత్స పొందుతున్న వారిలో శనివారం ఒక్కరోజే 8 మంది మృతి చెందారు. తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,737కి చేరింది. తెలంగాణలో ఇప్పటివరకు 2,352 మందిని డిశ్చార్జ్‌ చేశారు. తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య 182కు చేరింది. 

శనివారం నమోదైన కరోనా కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 173 మందికి పాజిటివ్‌‌గా నిర్ధారణ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. సంగారెడ్డి 24, మేడ్చల్‌ 14, రంగారెడ్డి 11, మహబూబ్‌నగర్‌ 4, వరంగల్‌ 4, నల్గొండ, కరీంనగర్‌, ములుగులో రెండేసి కేసులు.. సిరిసిల్ల, మంచిర్యాలలో 2 చొప్పున నమోదయినట్లు తెలిపింది. సిద్దిపేట, ఖమ్మం, మెదక్‌, నిజామాబాద్‌, నాగర్‌కర్నూల్‌, కామారెడ్డి, జగిత్యాలలో ఒక్కో కేసు నమోదయినట్లు ప్రభుత్వం మీడియా బులిటెన్‌లో తెలిపింది.

తెలంగాణలో ఎమ్మెల్యేలూ కరోనా బాధితులే

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో పాటు ఆయన భార్య కూడా కరోనావైరస్‌ బారిన పడ్డారు. ముత్తిరెడ్డి భార్య పద్మలతతో పాటు డ్రైవర్‌, గన్‌మెన్‌, వంట మనిషికి కూడా కరోనా సోకింది. దీంతో వీరంతా హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. కాగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాదగిరిరెడ్డి ప్రస్తుతం నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారం రోజుల క్రితం జలుబు, దగ్గు రావడంతో ముత్తిరెడ్డి  వైద్యులను సంప్రదించారు. ఈనెల 11వ తేదీన ప్రైవేట్‌ ఆస్పత్రిలో కరోనా పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలింది. దీంతో అదే ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. 

కాగా, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడం రాష్ట్రంలో ఇదే తొలికేసు. మరోవైపు తాను ఆరోగ్యంగానే ఉన‍్నానని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముత్తిరెడ్డి భార్య నియోజకవర్గ ప్రజలకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు.

జీహెచ్‌ఎంసీ మేయర్‌కు కరోనా నెగెటివ్‌..

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో పాటు అయన కుటుంబ సభ్యులకు కరోనా నెగెటివ్‌గా నిర్దారణ అయినట్లు వైద్యులు తెలిపారు. తన కారు డ్రైవర్‌కు కరోనా సోకడంతో శుక్రవారం మేయర్‌ మరోసారి కరోనా పరీక్షలు చేయించుకున్న విషయం తెలిసిందే. పరీక్షల్లో నెగెటివ్‌గా రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా ఆయనకు కరోనా పరీక్షలు చేయగా  నెగెటివ్‌గా తేలింది. 

గురువారం మేయర్‌ పేషీలోని మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ రావడంతో వైద్యులు బొంతు రామ్మోహన్‌కు మరోసారి పరీక్షలు చేశారు. మేయర్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులంతా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. కాగా, మేయర్‌ పేషీ సహ బల్దియా ప్రధాన కార్యాలయంలో వారంలో మొత్తం 3 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో అధికారుల నుంచి దిగువస్థాయి సిబ్బంది వరకు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహించే వారిలో దాదాపు సగం మంది మాత్రమే హాజరవుతున్నారు. 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   14 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   13 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   18 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   19 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   15 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   a day ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   a day ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   14 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   16 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle