newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 71 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 1991 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

21-02-202021-02-2020 08:38:59 IST
Updated On 21-02-2020 08:38:55 ISTUpdated On 21-02-20202020-02-21T03:08:59.054Z21-02-2020 2020-02-21T03:08:15.023Z - 2020-02-21T03:08:55.705Z - 21-02-2020

వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. శైవాలయాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. వేములవాడ రాజన్న ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. శివరాత్రి పండుగను పురస్కరించుకొని తెలంగాణ పర్యాటక శాఖ హైదరాబాద్ నుంచి వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధానానికి హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

తెలంగాణ రాష్ట్ర ఏవియేషన్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో అందిస్తోన్న ఈ సేవలను రాష్ట్ర మంత్రి కేటీయార్ సూచనల మేరకు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బేగంపేట విమానాశ్రయంలో స్థానిక శాసన సభ్యులు  రమేష్ బాబు తో కలిసి ప్రారంభించారు. స్థానిక శాసన సభ్యులు చెన్నమనేని రమేష్ బాబు దంపతులు హైదరాబాద్ నుండి వేములవాడ హెలికాప్టర్ లో చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక శాసన సభ్యులు రమేష్ బాబు మాట్లాడుతూ 23వ తేదీ వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.

హైదరాబాద్ నుంచి వేములవాడ, తిరుగు ప్రయాణానికి కలిపి టికెట్ ధర రూ.30 వేలుగా నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. వేములవాడ నుంచి వ్యూ పాయింట్ టికెట్‌ ధర రూ. 3 వేలు, వేములవాడ, మిడ్ మానేరు జలాశయం, పరిసర ప్రాంతాల పర్యటన టిక్కెట్‌ ధర రూ.5,500గా ఉందని స్థానిక శాసన సభ్యులు రమేష్ బాబు తెలిపారు.

హెలికాప్టర్ ప్రయాణం భక్తులకు సరికొత్త అనుభూతులను మిగల్చగలదని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ ఆలయ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు రానున్న బడ్జెట్లో మరో 200 కోట్లు వేములవాడ ఆలయ అభివృద్ధికి కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి స్వయంగా తెలిపారని స్థానిక శాసన సభ్యులు పేర్కొన్నారు. విద్యుత్తు వెలుగుల్లో ఆలయ ప్రాంగణం చూడముచ్చటగా భక్తులను ఆకర్షిస్తోంది.

వేలాదిమంది ఆలయానికి రానుండడంతో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.  ప్రధాన ఆలయంతో పాటు భీమన్న, బద్ది పోచమ్మ.. తదితర ఆలయాలకు రంగులు వేశారు. శుక్రవారం వరకు జరగనున్న జాతరలో భాగంగా భక్తుల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణలోని అతిపెద్ద శైవ క్షేత్రమైన వేములవాడకు రాష్ట్రంలోని పది జిల్లాల నుంచే వచ్చే భక్తులే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర నుంచి భక్తులు రానున్నారు. 

వేములవాడ రాజన్న ఆలయానికి మహాశివరాత్రి శోభ


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle