newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వేతనాలు, ఫించన్లపై భారీ కోత మొదలైంది.. తెలంగాణలో నాంది

31-03-202031-03-2020 11:28:55 IST
Updated On 31-03-2020 11:30:16 ISTUpdated On 31-03-20202020-03-31T05:58:55.776Z31-03-2020 2020-03-31T05:55:06.535Z - 2020-03-31T06:00:16.024Z - 31-03-2020

వేతనాలు, ఫించన్లపై భారీ కోత మొదలైంది.. తెలంగాణలో నాంది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్ డౌన్ నేపథ్యంలో ఆదాయం సున్నకు చేరుతుండటంతో ఉద్యోగుల వేతనాలపై కోతపడక తప్పదని హింట్ ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నంత పనీ చేశారు. ఇది లగ్జరీ పీరియడ్‌ కాదు. మనం విపత్తులో ఉన్నాం. అందరూ తగ్గించుకోవాలి. రెండు ముద్దల బదులు ఒక్క ముద్ద తినాలి. నాలుగు శాకాల (కూరల) బదులు రెండు తినాలి. రాష్ట్రానికి ఆదాయం తగ్గితే కేంద్రానికి తగ్గదా? వాళ్లది కూడా చేతికి మూతికి కొట్లాటే కదా? గండం గట్టెక్కే దాకా అందరం ఊపిరి బిగబట్టుకుని ఉండాలి.  కొంత నియంత్రణ పాటించాలి. అందరం కాంప్రమైజ్‌ అయినప్పుడే సమాజం బతుకుతుంది అని సోమవారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన సందర్భంగా కేసీఅర్ పిలుపునిచ్చారు. 

మార్చి 15 నుంచి హళ్లికి హళ్లి.. సున్నకు సున్నా ఉన్నది. పెట్రోల్‌, ఎక్సైజ్‌, జీఎస్టీ అన్నీ బందే కదా? అందుకే ఎమ్మెల్యేల జీతాలు కూడా బందు పెట్టాల్సి వస్తుందేమో? ఉద్యోగులకు కూడా కోత విధించాల్సి వస్తే విధించాలె కదా? కష్టం వస్తే అందరం పంచుకోవాలి కదా? అంటూనే రానున్న ప్రమాదాన్ని సూచనప్రాయంగా చెప్పేశారు. 

వాస్తవంగా కూడా కరోనా వైరస్‌ కట్టడికి లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో మార్చిలో తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం భారీగా తగ్గింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని నిర్ణయించింది. ఒకరకంగా చెప్పాలంటే కరోనా వైరస్‌ రాష్ట్ర ఆదాయాన్ని కాటేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్‌.. ప్రగతి భవన్‌లో సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. వేతనాలు, పెన్షన్ల చెల్లింపులపై సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మార్చి నెలకు సంబంధించి ఏప్రిల్‌లో చెల్లించనున్న వేతనాలు, పెన్షన్లపై భారీ కోత  పడనుంది. పలు ఉద్యోగ వర్గాల వేతనాల కోతలు ఇలా ఉండనున్నాయి.

సీఎం, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల జీతాల్లో 75 శాతం కోత విధించనున్నారు

ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అఖిల భారత సర్వీసు ఆఫీసర్ల వేతనాల్లో 60 శాతం కోత విదించనున్నారు

మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధించనున్నారు. 

ఆలాగే అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 50 శాతం కోత విధించనున్నారు

నాలుగో తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లో 10 శాతం కోత విధించనున్నారు. 

నాలుగో తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధించనున్నారు.

కాగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థ ఉద్యోగులకు, ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్ల మాదిరే వారి జీతాల్లోనూ కోత పడనుంది.

ఒకరకంగా ఇది జీతాల్లో కోత కాదు జీవితాలపై కోత అని చెప్పాల్సి ఉంటుంది.

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   11 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   7 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   9 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   12 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   14 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   15 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   17 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   18 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   19 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   20 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle