newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వెయ్యిమంది చనిపోతే అందరూ కరోనా మృతులేనా.. మంత్రి ఈటల ప్రశ్న

30-07-202030-07-2020 06:20:17 IST
2020-07-30T00:50:17.447Z30-07-2020 2020-07-30T00:50:13.100Z - - 20-04-2021

వెయ్యిమంది చనిపోతే అందరూ కరోనా మృతులేనా.. మంత్రి ఈటల ప్రశ్న
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా మరణాల్లో ఎలాంటి గోప్యత లేదని, అలా దాచి ఉంచాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణలో అన్ని రకాల వ్యాధులకు కలిపి రోజుకు వెయ్యి మంది చనిపోతుంటారు.. అవన్నీ కరోనా చావులే అంటే ఎలా అంటూ మంత్రి ప్రశ్నించారు. కరోనా విస్తృతిని అడ్డుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో దాదాపు 81 శాతం మంది కరోనా బాధితుల్లో ఏ మాత్రం వైరస్‌ లక్షణాలు కనిపించడం లేదని. అందులో కేవలం 19 శాతం మందికి మాత్రమే జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఇందులోనూ 14 శాతం మందికి నయమవుతోందని చెప్పారు. 

కేవలం 4 నుంచి 5% అంతకు ముందే జబ్బులున్న సీనియర్‌ సిటిజన్లకు మాత్రమే కరోనాతో సమస్య ఉందని, వారిని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఈటల వివరించారు. కరోనా యావత్‌ మానవాళికి పెను సవాల్‌గా మారిందనీ కానీ, మన దేశంలో కరోనా వైరస్‌ అమెరికా అంత సీరియస్‌ కాదని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో 81 శాతం మంది కోవిడ్‌ లక్షణాలు లేకుండానే కోలుకుంటున్నారని, వైరస్‌ కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ఎలా చనిపోయినా కరోనాతో చనిపోయినట్లు భయపెడుతున్నారని మంత్రి ఈటల విమర్శించారు

కాగా, ఎంజీఎంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి ఈటల చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కేసులన్నింటికీ ఎంజీఎంలోనే చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులే కాదనుకుంటున్న వారికి వైద్యులు ట్రీట్‌మెంట్ చేయడం చాలా గొప్ప విషయం అన్నారు. వైద్యులు గ్రూపులు పక్కన పెట్టి పేదలకు వైద్యం అందించాలని హితవుచెప్పారు. 

మరోవైపున మీడియా కరోనా కేసులు, మరణాలపై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే వెంటనే వివరణ ఇవ్వండని వైద్య అధికారులకు మంత్రి ఈటల సూచించారు. ఏలోటు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. కోవిడ్ పేషెంట్లకు ఇక్కడే ట్రీట్మెంట్ ఇవ్వాలని,  వరంగల్ నుండి ఒక్క కోవిడ్ కేసును కూడా హైదరాబాద్‌కు పంపొద్దని మంత్రి ఆదేశించారు.

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   13 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   13 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   17 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   19 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   14 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   21 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   21 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   14 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   15 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle