newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

వృద్ధదంపతుల్ని స్వగ్రామం చేర్చిన పోలీసులు

29-03-202029-03-2020 10:10:25 IST
2020-03-29T04:40:25.871Z29-03-2020 2020-03-29T04:40:14.544Z - - 26-05-2020

వృద్ధదంపతుల్ని స్వగ్రామం చేర్చిన పోలీసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ పోలీసులు అందరికీ తమవంతు సాయం చేస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లోనే కాదు, కరోనా లాక్ డౌన్ వేళ కూడా శభాష్ అనిపించుకుంటున్నారు. ఆహారం లేక, తమ స్వస్థలానికి చేరలేక ఇబ్బందులు పడుతున్న వృద్ధ దంపతులను ఆదుకున్నారు.  కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటిలోని భీమన్న గుడి వద్ద గత వారం రోజులుగా ఇద్దరు వృద్ధ దంపతులు వారి కుమారుడు ఆహారం లేకుండా అటుకులు తింటూ బతుకుతున్నారు. కటిక చీకటిలో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు . ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా వారిని గమనించి వివరాలు అడిగారు.

తాము బెల్లంపల్లి వాసులమని వృద్దులకు ఆరోగ్యం బాగాలేక పోవడంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళామన్నారు.  గోలేటిలోని భీమన్న దేవుని దర్శనానికి చ్చామన్నారు.  కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో విధిలేని పరిస్థితుల్లో అదే రోజు లాక్ డౌన్ ప్రకటించడంతో ఇక్కడే చిక్కుకున్నామన్నారు. తమ దగ్గర ఊరికి వెళ్లడానికి డబ్బులు అయిపోయాయని, తినేందుకు ఏమీ లేకపోవడంతో అటుకులు తింటూ, గుడిలో మంచినీళ్ళు తాగుతున్నామన్నారు. పోలీసులు మానవత్వం చాటుకొని వారికి భోజనం పెట్టి ఒక ఆటోలో వారిని సురక్షితంగా వారి ఇంటికి చేర్చారు.

పోలీసులు చూపించిన ఔదార్యానికి ఆ దంపతులు ధన్యవాదాలు తెలిపారు. వారికి కన్నీళ్లు వచ్చాయి. కరోనా వైరస్ పెరిగిపోతున్న వేళ తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు రహదారుల వెంట దయనీయంగా నడిచివెళుతున్న వారికి తమవంతు సాయం చేస్తున్నారు. వారికి మంచినీళ్ళు అందించడం, బ్రెడ్స్, ఆహారం ఇస్తూ వారి స్వస్థలాలకు వెళ్ళేందుకు కృషిచేస్తున్నారు. ఇటు సంగారెడ్డి జిల్లాలో పటన్ చెరు పోలీసులు వలస కూలీలకు సాయం అందిస్తున్నారు, ఔటర్ రింగు రోడ్డు వద్ద కూలీలకు సీఐ నరేష్ ఆధ్వర్యంలో ఆహారం అందిస్తున్నారు. 

 బంజారా మిషన్ సాయం

నేషనల్ బంజారా మిషన్ పేదలకు అపన్నహస్తం అందించింది. లాక్‌డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో రోడ్లపై జీవిస్తూ ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు పట్టెడన్నం పెట్టి కడుపునింపింది. నేషనల్  బంజారా మిషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణనాయక్ పలువురు వలసకూలీలకు భోజనం సమకూర్చారు. సైదాబాద్‌లో కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఎలాంటి ఉపాధిలేక తినడానికి ఇబ్బందులు పడుతున్న అడ్డకూలీలు, వలసకూలీలకు కృష్ణనాయక్‌ అన్నం, పెరుగు, ఇతర నిత్యావసర వస్తులను గత నాలుగు రోజులుగా పంపిణీ చేస్తున్నారు. తనకు తోచిన విధంగా పేదలకు భోజనం పెట్టడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని కృష్ణనాయక్ అన్నారు.

 

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   5 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   7 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   10 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   11 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   12 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   13 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   13 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   13 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   14 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   14 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle