వీళ్ళు మనుషులేనా? రాత్రంతా వానలోనే కరోనా మృతదేహాలు
13-08-202013-08-2020 18:50:26 IST
2020-08-13T13:20:26.012Z13-08-2020 2020-08-13T13:19:59.063Z - - 12-04-2021

కరోనా వైరస్ మానవత్వం మంటగలిపేలా చేస్తోంది. రాత్రి నుంచి వర్షంలోనే కోవిడ్ మృతులున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. కరోనాతో తల్లి కుమారుడు మృతిచెందారు. వారిని సొంత మనుషులే పరాయి వాళ్లలా చూస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి సోకే అవకాశం తక్కువేనని నిపుణులు ఎంత చెప్పినా ప్రజల్లో అవగాహన రావడం లేదు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో కరోనా మృతుడిని బయటపడేసి వర్షంలో తడుస్తున్నా ఎవరూ కన్నెత్తి చూడలేదు.ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. మనుషుల ప్రవర్తన, మానవత్వం అంటే ఏంటో కరోనా వైరస్ కారణంగా బట్టబయలవుతోంది. బంధువులు, స్నేహితులే కాదు కుటుంబసభ్యులు కూడా అతీతులేం కాదని నిరూపిస్తోంది. అలాంటి అమానవీయ ఘటన హైదరాబాద్ కి ఆనుకునే వున్న సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో వెలుగుచూసింది. కొవిడ్ తో మృతి చెందిన 65 ఏళ్ళ తల్లి, 35 ఏళ్ళ కొడుకు మరణించారు. వారి అంత్యక్రియలు చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. వైరస్ తో బాధ పడుతున్న కొడుకు బుధవారం అర్ధరాత్రి సమయంలో సోఫాలో కూర్చొని అక్కడే ప్రాణాలు వదిలాడు. మృతిదేహాన్ని కుటుంబసభ్యులు బయట పడేశారు. రాత్రి నుంచి వర్షంలో తడుస్తూనే ఉంది. ఇవాళ ఉదయం తల్లి కూడా చనిపోయింది. అదే కుటుంబంలో మరి కొందరు వైరస్ సోకి చికిత్స పొందుతున్నారు. కాలనీవాసులు తలుపులు వేసుకొని బయటకు కూడా రాలేదు. అధికారులు అటువైపే చూడటం లేదు.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
8 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
11 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
15 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
5 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
15 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
13 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
15 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
16 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
10 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
18 hours ago
ఇంకా