newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

‘వీక్షణం’ ఎడిటర్‌పై UAPA కేసు.. టియుడబ్ల్యూజే ఖండన

18-11-201918-11-2019 05:41:47 IST
Updated On 18-11-2019 12:31:05 ISTUpdated On 18-11-20192019-11-18T00:11:47.003Z17-11-2019 2019-11-17T14:19:49.093Z - 2019-11-18T07:01:05.806Z - 18-11-2019

‘వీక్షణం’ ఎడిటర్‌పై UAPA కేసు.. టియుడబ్ల్యూజే ఖండన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా పౌరుల భావప్రకటనా స్వేచ్ఛపై దాడి జరుగుతోంది. పత్రికా స్వాతంత్య్రానికి సంకెళ్ళు పడుతున్నాయి. ‘వీక్షణం’ రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక సంపాదకుడు, సీనియర్ జర్నలిస్టు ఎన్ వేణుగోపాల్ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి), అన్ లాఫుల్ ఆక్టివిటీస్ ప్రివెన్షన్ ఆక్ట్ (యుఎపిఎ), తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ ఆక్ట్ సెక్షన్ల కింద అక్రమకేసు బనాయించడం సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.

పోలీసుల వ్యవహారశైలి రాజ్యాంగం హామీ ఇచ్చిన భావప్రకటనా స్వేచ్ఛకు భంగకరం అని జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. తన పత్రిక ద్వారా  ప్రజావ్యతిరేక ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నందుకు ఒక పత్రికా సంపాదకుడిపై పాలకుల కక్ష సాధింపునకు నిదర్శనంగా చెబుతున్నారు. 

ఏపీలో ఇటీవల విడుదలైన జీవో 2430పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.  పత్రికలు, ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియాలపై కేసులు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వ తీసుకువచ్చిన జీవో 2430ను జర్నలిస్టు సంఘాలు నిరసిస్తున్నాయి. నవంబర్ 12న హైదరాబాదులో అరెస్టు చేసిన ఎన్ రవి శర్మ, బి అనూరాధల కేసులో హఠాత్తుగా ఎన్ వేణుగోపాల్ పేరు నిందితుడిగా చేర్చారు. ఈ చర్య కక్ష సాధింపు మాత్రమే కాక, పచ్చి అబద్ధాలతో కూడిన హాస్యాస్పదమైన ప్రయత్నంగా ఉందని జర్నలిస్టులు మండిపడుతున్నారు.

ఎల్ బి నగర్ రెండవ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దగ్గర నవంబర్ 13న సమర్పించిన రిమాండ్ కేస్ డైరీలో ఆయనను ఏడవ ముద్దాయిగా (ఎ7) చూపి, పక్కన “విరసం విప్లవ రచయితల సంఘం సభ్యుడు” అని, “పరారీలో ఉన్నాడు” అని పేర్కొన్నారు. 2009లో వేణుగోపాల్ రాసిన ఒక వ్యాసం మీద వివాదంతో ఆయన విప్లవ రచయితల సంఘం నుంచి దూరం అయ్యాడని అందరికీ తెలుసు.

ఆ తర్వాత ఆయన ఏ సంస్థలోనూ సభ్యుడుగా వ్యవహరించడం లేదు. పూర్తికాలం వీక్షణం ఎడిటర్ గా ఉన్నారు. గత పదేళ్ళుగా ఆయన ఏ సంస్థలోనూ క్రియాశీలకంగా లేరు. స్వతంత్ర పాత్రికేయుడిగా ఆయన ప్రతిష్ఠను దిగజార్చడానికి పోలీసులు దురుద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం అని జర్నలిస్టు సంఘాలు అంటున్నాయి. 

రచయితగా, వక్తగా ప్రసిద్ధుడైన వేణుగోపాల్ మూడు దశాబ్దాలుగా ఆయన ఎన్నో అంశాలపై అక్షరయుద్ధం చేస్తున్నారు. ఆయన ప్రచురించిన ఇరవై ఐదు పుస్తకాలు, అనువదించిన ఇరవై ఐదు పుస్తకాలు, రాసిన వందలాది వ్యాసాలు, చేసిన వందలాది ఉపన్యాసాలు తెలుగు సమాజానికి చిరపరిచితం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన పాత్ర కీలకం. ప్రస్తుతం పదవుల్లో ఉన్న ఎంతోమంది నేతలతో కలిసి ఉద్యమం చేశారు. 

ఎంతోమంది త్యాగాలతో . తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆయన వ్యాసాలు రాస్తున్నారు. రాష్ట్రప్రభుత్వ గుర్తింపు ఉన్న పాత్రికేయుడుగా, ప్రతిరోజూ ఏదో ఒక వేదిక మీద ఉపన్యసిస్తుంటారు. అంతేకాదు దినపత్రికల్లో కాలమ్ రాస్తుంటారు. అంతేకాదు వీక్షణం మాసపత్రిక నడుపుతున్నారు వేణుగోపాల్.

అటువంటి వ్యక్తి పరారీలో ఉన్నట్టు అబద్ధం చెప్పి న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించడం పోలీసుల కుట్ర వైఖరిని బైటపెడుతోంది. ఆయన వాణిని, ప్రజావ్యతిరేక విధానాలపై ఆయన ఎక్కుపెడుతున్న అక్షర తూణీరాలను అణిచివేసేందుకు ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని జర్నలిస్టు సంఘాలు విమర్శిస్తున్నాయి. వీక్షణం సంపాదకుడిపై పెట్టిన ఈ అక్రమ కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

Image may contain: text

టియూడబ్ల్యూజే ఖండన 

సీనియర్ జర్నలిస్టు, వీక్షణం పత్రిక సంపాదకుడు ఎన్. వేణుగోపాల్‌పై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే - 143) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం ఇవాళ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, తన వంతు భూమికను పోషించిన వేణుగోపాల్‌పై కేసు పెట్టడం పత్రిక స్వేచ్ఛకు, భావప్రకటనా స్వేచ్ఛకు భంగకరమని టియుడబ్ల్యుజే పేర్కొంది. సంఘం నేతలు ఆస్కానీ మారుతీ సాగర్, సయ్యద్ ఇస్మాయేల్, ఎ,రమణకుమార్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వేణుగోపాల్‌ అరెస్టు విషయంలో పోలీసుల చర్యను ఖండిస్తూ.. తక్షణమే ఆయనపై కేసులు ఎత్తివేసి భేషరతుగా విడుదల చేయాలని  డిమాండ్ చేశారు.

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   5 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   6 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   7 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   7 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   8 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   8 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   10 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   11 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   11 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   12 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle