వీఆర్వో వ్యవస్థ రద్దు- రెవెన్యూ ప్రక్షాళన దిశగా వడివడి అడుగులు
07-09-202007-09-2020 13:58:27 IST
2020-09-07T08:28:27.702Z07-09-2020 2020-09-07T08:28:24.619Z - - 14-04-2021

కొత్త రెవెన్యూ చట్టం దిశగా తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా వీఆర్వో వ్యవస్థను రద్దు చేసింది. ఈ మధ్యాహ్నంలోగా వీఆర్వోల రికార్డులు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. రెవెన్యూ చట్టానికి సంబంధించిన ముసాయిదా బిల్లును ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ చర్యలను వేగవంతం చేసింది. కేసీఆర్ రెవెన్యూ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలన్న పట్టుదలతో అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు రెవెన్యూ శాఖ అవినీతి మయంగా మారిపోయిందని, సంపూర్ణ ప్రక్షాళనతోనే రాష్ట్రపురోగతి సాధ్యమని, ప్రజలను మేలు జరగాలంటే రెవెన్యూ ప్రక్షాళన జరగాల్సిందేనని కుండబద్దలు కొట్టిన సంగతి విదితమే. కేసీఆర్ చెబుతున్నది వాస్తవమే అనేందుకు సాక్షీభూతంగా ఇటీవలి కాలంలో ఏసీబీ దాడుల్లో పట్టుబడుతున్న అవినీతి తిమింగలాల్లో అత్యధికులు రెవెన్యూ ఉద్యోగులే ఉంటున్నారు. వారీలోనూ వీర్వోల సంఖ్య అధికం. ఈ వ్యవస్థ అవ్యవస్థగా మారిపోయిందన్న నిశ్చయానికి వచ్చిన సీఎం కేసీఆర్ దీనికి ముగింపు పలకాలన్న నిర్ణయానికి వచ్చేశారు. ఇప్పటికే తన నిర్ణయాన్ని పలు సభలలో సమావేశాలలో విస్పష్టంగా చెప్పిన కేసీఆర్ ఈ రోజు వీఆర్వోల వ్యవస్థను రద్దు చేయడం ద్వారా తాను మాటల మనిషిని కాదు, చేతల మనిషినని రుజువు చేసుకున్నారు. కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి గత అసెంబ్లీ సమావేశాలలో ప్రకటించారు. ఆ కొత్త చట్టం ముసాయిదాను ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి సభ ఆమోదం పొందాలన్న కృత నిశ్చయంతో ఉన్న ప్రభుత్వం విఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ అసెంబ్లీ సమావేశాల మొదటి రోజునే ఉత్తర్వులు జారీ చేసింది. విఆర్వో లను వేరే శాఖలలో సర్దుబాటు చేయనుంది. కేసీఆర్ నిర్ణయంతో రైతాంగంలో హర్షం వ్యక్తం అవుతోంది. అవినీతి కారణంగా సాగు చేసుకుంటున్న రైతుల పేర్లు, మరీ ముఖ్యంగా కౌలు రైతుల పేర్లు రికార్డులలో లేని ఉదంతాలెన్నో వెలుగు చూశారు. భూమి తనదే అయినా రికార్డులలో మార్చేశారన్న ఆరోపణలతో పలువురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలూ కూడా జరిగాయి. వీటన్నిటికీ చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
4 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
5 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
4 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
8 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
9 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
8 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
10 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
11 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
6 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
12 hours ago
ఇంకా