newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వీఆర్వో దొంగబుద్ధి.. పోలీసుల రాకతో పరార్

09-09-202009-09-2020 12:30:15 IST
2020-09-09T07:00:15.621Z09-09-2020 2020-09-09T07:00:12.154Z - - 11-04-2021

వీఆర్వో దొంగబుద్ధి.. పోలీసుల రాకతో పరార్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రెండ్రోజుల క్రితం తెలంగాణలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పనిచేస్తున్న వివిధ వీఆర్వోలు ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూనే, మరోవైపు ప్రజలను లంచాల కోసం వేధించడమే ఇందుకు ముఖ్యకారణంగా తెలుస్తోంది. పలుమార్లు కొందరు వీఆర్వోలు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

రాష్ట్రంలో అవినీతి పెరిగిపోతోందని గ్రహించిన తెలంగాణ సర్కార్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టే దిశగా తన కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ మేరకు సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే రాష్ట్రంలో కొత్త రెవిన్యూ  చట్టాన్ని ప్రవేశపెట్టడంపై చర్చ కూడా జరిగింది. వీఆర్వో వ్యవస్థ రద్దుతో మంగళవారం నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగులందరికీ సెలవులిచ్చింది ప్రభుత్వం. తిరిగి ప్రభుత్వాదేశాలు వచ్చేంత వరకూ ఎవరూ విధులకు హాజరు కారాదని, అలాగే ఎక్కడా ముద్రణ స్టాంపులను తయారు చేయరాదని ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో సీఎస్ సోమేష్ కుమార్ రాష్ట్రంలోని వీఆర్వో కార్యాలయాన్నింటిలోనూ వీఆర్వోల వద్ద నున్న రెవిన్యూ   రికార్డులను స్వాధీనం చేసుకోవాలని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలలోపు రికార్డులను స్వాధీనం చేసుకుని, సాయంత్రం 5 గంటలలోగా ఆ రికార్డులకు సంబంధించిన నివేదికలను ప్రభుత్వానికి పంపాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. సీఎస్ ఆదేశాలతో కలెక్టర్లంతా వీఆర్వోల నుంచి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. సరిగ్గా ఈ సమయంలో ముగ్గురు వ్యక్తులు తమ దొంగబుద్ధిని చూపించారు.

నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని పెద్దకాపర్తి వీఆర్వో, ప్రైవేట్ గుమస్తాలతో పాటు కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన శ్రవణ్ చిట్యాల రెవిన్యూ కార్యాలయంలో రికార్డులను అపహరించేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని గ్రహించిన స్థానికులు రెవిన్యూ కార్యాలయంలోకి చొరబడిన వారిని అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపే రికార్డుల దొంగతనానికి వచ్చిన ముగ్గురు స్థానికులపై ఎదురు దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న పోలీసులు వీఆర్వో, ప్రైవేట్ గుమస్తా, శ్రవణ్ లపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కాగా.. కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడాన్ని ఖండించారు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తే ఆ ఉద్యోగులంతా ఏమైపోతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్వో వ్యవస్థ రద్దు ఉద్యోగాలు కోల్పోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   13 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   9 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   11 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   16 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   19 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   20 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle