newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

విషాదం నింపిన వేదాద్రి ప్రమాదం..బాధిత కుటుంబాలకు ఏపీ, తెలంగాణ సాయం

19-06-202019-06-2020 07:54:08 IST
Updated On 19-06-2020 10:28:33 ISTUpdated On 19-06-20202020-06-19T02:24:08.824Z19-06-2020 2020-06-19T02:23:57.426Z - 2020-06-19T04:58:33.057Z - 19-06-2020

విషాదం నింపిన వేదాద్రి ప్రమాదం..బాధిత కుటుంబాలకు ఏపీ, తెలంగాణ సాయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రిలో లక్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో 12 మంది మృత్యువు పాలవడం తీవ్ర విషాదాన్ని నింపింది. మృతి చెందిన 12 మంది కుటుంబాలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రూ. 7 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాయి. ఒక్కో కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ. 2 లక్షలు, ఏపీ ప్రభుత్వం రూ. 5లక్షలు ఇవ్వాలని నిర్ణయించాయి.

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం గోపవరం గ్రామానికి చెందిన 30 మంది మంగళవారం ట్రాక్టర్‌లో వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి దైవదర్శనానికి వెళ్లారు. రాత్రి ఆలయంలోనే వారంతా బస చేశారు. బుధవారం ఉదయం మొక్కులు చెల్లించుకొని ఇంటికి బయలుదేరారు. వారి ట్రాక్టర్ బయలుదేరిన కొద్ది సేపటికే ప్రమాదానికి గురైంది, మృత్యుశకటంలా దూసుకొచ్చిన లారీ.. ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఈ రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలానికి చెందిన బంధువులు 9 మంది, ఏపీలోని కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జయంతికి చెందిన ముగ్గురు మృతి చెందారు. 14 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు ఫోన్ చేశారు. ఈ ప్రమాద ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారందరికీ మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశించారు. ఏపీ సీఎం జగన్ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు భరోసా ఇచ్చారు. గాయపడ్డవారికి మంచి వైద్యం అందిస్తామన్నారు. 

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం గోపవరంలో 8 మందికి, జమలాపురంలో ఒకరికి అంత్యక్రియలు జరిగాయి. మృతులంతా దగ్గరి బంధువులే కావడంతో గ్రామమంతా విషాదంలో నింపింది. మృతుల కుటుంబాలను మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి.. ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు.

మృతుల కుటుంబాలను, ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పరామర్శించారు. ఏపీ ప్రభుత్వం కూడా ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తెలిపారు. వేదాద్రి రోడ్డు ప్రమాద సంఘటనలో 13 మంది మృతి పట్ల ఏపీ గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సంతాపం తెలిపారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle