newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

విమర్శలు సరే.. తెలంగాణలో తగ్గుతున్న కరోనా మరణాల రేటు.. గణాంకాలే సాక్ష్యం

20-08-202020-08-2020 08:56:17 IST
Updated On 20-08-2020 14:48:11 ISTUpdated On 20-08-20202020-08-20T03:26:17.227Z20-08-2020 2020-08-20T03:26:14.159Z - 2020-08-20T09:18:11.778Z - 20-08-2020

విమర్శలు సరే.. తెలంగాణలో తగ్గుతున్న కరోనా మరణాల రేటు.. గణాంకాలే సాక్ష్యం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపు కరోనా పరీక్షల్లో రాష్ట్రం బాగా వెనకబడిందని గవర్నర్తోపాటు రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ తెలంగాణలో కోవిడ్ మరణాల రేటు తగ్గడం నిజమేనని రాష్ట్ర ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. గణాంకాలను నిశితంగా పరిశీలించినట్లయితే.. గత నెల 18వ తేదీన కరోనా కేసుల్లో మరణాల శాతం 0.93 శాతం ఉండగా, అది ఆ నెలాఖరుకు 0.82 శాతానికి తగ్గింది. ఈ నెల 1న మరణాల రేటు 0.81 శాతం ఉండగా, ఏడో తేదీ నాటికి 0.79 శాతానికి తగ్గింది. 

ఇక బుధవారం ఉదయం విడుదల చేసిన కరోనా బులెటిన్‌ ప్రకారం మంగళవారం నాటికి కరోనా మరణాల శాతం 0.75 శాతానికి తగ్గినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. దీంతో రికవరీ రేటు కూడా పెరిగిందని ఆయన తెలిపారు. గత నెల 18న కరోనా కేసుల్లో రికవరీ రేటు 70 శాతముంటే, ఆ నెలాఖరుకు 72.3 శాతానికి పెరిగింది. ఆ తర్వాత ఈ నెల 18న 77.31 శాతానికి రికవరీ రేటు పెరిగినట్లు బులెటిన్‌లో వెల్లడించారు. 

జాతీయస్థాయిలో ప్రస్తుతం కరోనా మరణాల రేటు 1.92 శాతం ఉండగా, మన రాష్ట్రంలో అది సగానికి పైగా తగ్గడం గమనార్హం. నెల క్రితం కేవలం హైదరాబాద్‌లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు, చికిత్సలు జరిగేవి. మొదట్లో ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలు హైదరాబాద్‌కే పరిమితమయ్యాయి. అది కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో 16 చోట్ల, ప్రైవేట్‌ల్లో 23 చోట్ల జరిగేవి. ఆ తర్వాత ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులను పీహెచ్‌సీ స్థాయి వరకు అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా 1,076 కేంద్రాల్లో యాంటిజెన్‌ పరీక్షలు జరుగుతున్నాయి. పైగా అరగంటలోపే ఫలితం వస్తుండటంతో ప్రస్తుతం 24 వేలకు పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. 

ఇక జిల్లాల్లోనే కరోనా రోగులకు వైద్య సేవలు అందుబాటులోకి రావడం తో మరణాల శాతం తగ్గినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. టెస్ట్‌ల కోసం, చికిత్సల కోసం వేచి చూసే ధోరణి పోయింది. కిందిస్థాయిలోనూ ప్రజల్లో వైరస్‌పై అవగాహన పెరిగింది. వైద్యుల్లోనూ గందరగోళం పోయింది. దీంతో ఏమాత్రం జ్వరం వచ్చినా జనం అప్రమత్తం అవుతున్నారు. డాక్టర్లను సంప్రదిస్తున్నారు. అవసరమైతే తక్షణ వైద్యం కోసం పెద్దాసుపత్రులకు వెళ్తున్నారు. వెంటనే స్పందించని వారు మాత్రమే ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. లేకుంటే ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటూ కోలుకుంటున్నారు.  

రాష్ట్రంలో మంగళవారం 24,542 టెస్టులు చేయగా, 1,763 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 7,97,470 పరీక్షలు నిర్వహించగా, మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 95,700కి చేరింది. తాజాగా మరో 8 మంది కరోనాతో చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 719కి చేరింది. కొత్తగా 1,789 మంది రికవరీ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 73,991కి చేరింది. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్‌ కేసులు 20,990 ఉన్నాయి. అందులో 14,461 మంది ఇళ్లల్లో లేదా ఇతరత్రా ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారని శ్రీనివాసరావు వెల్లడించారు. 

ఇక తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 484 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 169, రంగారెడ్డి జిల్లాలో 166 నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో వందలోపు కేసులు నమోదయ్యాయి. తక్కువగా నారాయణపేట, కొమురంభీం జిల్లాల్లో 6 చొప్పున కేసులు నమోదయ్యాయి.   

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle