newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

విభేదాలే తప్ప వ్యూహాలు లేని కాంగ్రెస్ నేతలు..

12-09-202012-09-2020 17:56:29 IST
2020-09-12T12:26:29.271Z12-09-2020 2020-09-12T12:26:18.333Z - - 11-04-2021

విభేదాలే తప్ప వ్యూహాలు లేని కాంగ్రెస్ నేతలు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైంది. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ ను దీటుగా ఎదుర్కొనేందుకు సమష్టిగా కృషి చేయాలన్న ఉద్దేశం ఆ పార్టీ నేతల్లో ఇసుమంతైనా కనిపించడం లేదు. కాంగ్రెస్ అధిష్టానం పార్టీ ప్రక్షాళన పేర తీసుకున్న చర్యలలో భాగంగా పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జిగా కుంతియాకు ఉద్వాసన పలికి ఆయన స్థానంలో మాణికం ఠాగ్నూర్ ను నియమించింది.

అయితే ఈ మార్పు రాష్ట్రంలో పార్టీపై ఏ మేరకు సానుకూల ప్రభావాన్ని చూపుతుందన్నది అనుమానమే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం ఉందన్నది పార్టీ నేతల నిశ్చితాభిప్రాయంగా కనిపిస్తున్నది. అయితే ఆ ప్రజామద్దతు ఓట్ల రూపంలో ఎందుకు రావడం లేదన్న విషయంలో వారికి స్పష్టత ఉన్నట్లు కనిపించదు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.

గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీలోని 150 వార్డులకు గాను కేవలం రెండంటే రెండిటిలో విజయం సాధించింది. పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనించే వారికి ఈ సారి ఎన్నికలలో కనీసం అవైనా దక్కుతాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతాయనడంలో సందేహించాల్సిన పని లేదు. అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే విజయాన్ని సాకారం చేసుకోవడానికి వ్యూహరచనలో మాత్రం నేతల్లో ఐక్యత ఇసుమంతైనా కానరావడం లేదు.

గాంధీ భవన్ లో ఇటీవల జరిగిన కాంగ్రెస్ సమన్వయ సమావేశంలో నేతల బాహాబాహీ పార్టీలోని అనైక్యతను, వర్గ విభేదాలను మరోమారు బహిర్గతం చేసింది. అలాగే దుబ్బాకకు ఉప ఎన్నిక జరగనుంది. ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పోటీలో ఉంటుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ప్రకటించడమే కాదు...అధికార టీఆర్ఎస్ కు తమ పార్టీ విజయంతో దిమ్మతిరిగేలా చేస్తామని కూడా చెప్పారు. 

అయితే ఆ విజయం సాధించడానికి అనుసరించే వ్యూహం విషయంలో మాత్రం పార్టీలో ఏకాభిప్రాయం కుదరడంలేదనడానికి నేతల మధ్య కీచులాటలు తరచూ బహిర్గతమౌతూ ఉండటమే కారణం. రాష్ట్ర కాంగ్రెస్ లో కార్యకర్తలూ, నేతల మధ్య సమన్వయం మచ్చుకుకూడా కానరాని పరిస్థితి కనిపిస్తున్నది. గ్రేటర్ ఎన్నికలు, దుబ్బాక ఉప ఎన్నిక విషయంలో విజయంపై ప్రకటనలు గుప్పించడమే తప్ప..క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యలపై సమష్టిగా స్పందించేందుకు నేతలు ముందుకు రాని పరిస్థితి ఉంది.

రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జిగా కుంతియా మెతకగా వ్యవహరించారనీ, ఆయన ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నారనీ చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన స్థానంలో వచ్చిన మాణికం ఠాగ్నూర్ అయినా పార్టీలో విభేదాలను పరిష్కరించి నేతలందరినీ ఒకే వేదికపైకి తీసుకురాగలుగుతారా అంటే అనుమానమే. తెలంగాణ కాంగ్రెస్ లో అందరూ నాయకులే...ఎవరికి వారుగా వారు బలమైన వారే...అయితే పార్టీ కోసం కలిసి పని చేయడానికి మాత్రం ముందుకు రాను అన్న భావన పార్టీ శ్రేణుల్లోనే ఉంది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపి వారిలో విజయ కాంక్షను రగిలించాల్సిన నేతలు మాత్రం విభేదాలతో పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్ననారు. ఈ తరుణంలో పార్టీని ఏకతాటిపైకి తీసుకువచ్చి విజయం దిశగా నడిపించడం కొత్త ఇన్ చార్జ్ కి అంత తేలిక కాదు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle