newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

విద్యుత్‌ చార్జీల పెంపు తప్పనిసరి... కేసీఆర్ స్పష్టీకరణ

14-03-202014-03-2020 08:51:06 IST
2020-03-14T03:21:06.998Z14-03-2020 2020-03-14T03:20:59.986Z - - 11-04-2021

విద్యుత్‌ చార్జీల పెంపు తప్పనిసరి... కేసీఆర్ స్పష్టీకరణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పన్నులు పెంచకుంటే స్థానిక సంస్థల మనుగడ దుర్లభమవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. స్థానిక సంస్థలు మనుగడ సాగించాలంటే పన్నులు పెంచక తప్పదన్నారు.  గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను పెంచి తీరుతామని ప్రకటించారు. పన్నులు పెంచబోమని చందమామ కథలు చెప్పబోమని, పన్ను కట్టే సామర్థ్యం ఉన్న వారిపైనే భారం మోపుతామన్నారు. 

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శుక్రవారం పల్లె ప్రగతి కార్యక్రమంపై స్వల్పకాలిక చర్చను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌ పల్లెలు, పట్టణాల అభివృద్ధిపై ప్రభుత్వ దృక్పథాన్ని వివరించారు. పంచాయతీరాజ్‌ చట్టం అమలు, సర్పంచ్‌లు, కౌన్సిలర్ల విధులు, కలెక్టర్లకు ఉన్న అధికారాల గురించి మాట్లాడారు. ఆస్తి పన్నుతోపాటు విద్యుత్‌ చార్జీలు కూడా పెంచనున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

‘గత పాలకులు రాజకీయం చేసి పంచా యతీరాజ్, సహకార రంగాలను ఉరితీశారు. గ్రామీణులను ఏకీకృతం కాకుండా గ్రూపు లుగా విడగొట్టారు. పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. బోరుబావులను పూడ్చే పరిస్థితి లేదు. బోరుబావిలో పిల్లలు పడితే.. టీవీలు గగ్గోలు పెడితే ఇక్కడి నుంచి చూడటం తప్ప ఏం చేయలేని దౌర్భాగ్య పరిస్థితి ఉండేది. ఇదో పంచాయతీరాజ్‌ వ్యవస్థనా? పెంటకుప్పలా తయారైంది. కరోనా, గిరోనా ఎందుకు వస్తోంది.

ఓపెన్‌ డ్రైనేజీ వ్యవస్థను అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థగా మారిస్తే రోగాలు దరికి చేరవు. సర్పంచ్‌ను పొద్దున తీసేస్తే మధ్యాహ్నానికల్లా ఎమ్మెల్యేను పట్టుకొని కలెక్టర్‌ ఎదురుగా కూర్చొని వెకిలినవ్వు నవ్వే పరిస్థితి ఉంది. వంద శాతం ఆస్తిపన్ను వసూలు కావాల్సిందే. పన్ను వసూలు చేయకపోతే సర్పంచ్, కార్యదర్శులను ఉద్యోగం నుంచి తీసేస్తాం. నిందించినంత మాత్రాన, విమర్శించినంత మాత్రాన వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. పంచాయతీరాజ్‌ చట్టాన్ని నిక్కచ్చిగా అమలు చేస్తాం. శషభిషల్లేవ్‌.

విద్యుత్‌ చార్జీలు పెంచుతాం. సంస్థను కాపాడుకునేందుకు ఇది తప్పనిసరి. దళితులు, గిరిజనులకు 101 యూనిట్ల పరిధిలో మాత్రం చార్జీలు పెంచం. కొంత ఆస్తి పన్ను కూడా పెంచబోతున్నాం. మాకు ఆ ధైర్యం ఉంది. పన్నులు పెంచబోమని చందమామ కథలు చెప్పం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పన్నులపైనే నడుస్తుంది. అయితే పన్నులను అడ్డదిడ్డంగా పెంచం. దళితులకు, గిరిజనులకు రూపాయి కూడా పెంచం. పన్నుకట్టే సామర్థ్యం ఉన్న వారిపైనే భారం మోపుతాం అని కేసీఆర్ విస్పష్టంగా చెప్పారు.

అయితే విద్యుత్‌ చార్జీలు పెంచిన రోజు నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పతనం ప్రారంభం అవుతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో అన్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత త్వరలోనే విద్యుత్‌ చార్జీలను పెంచుతామని చెప్పడం ద్వారా కేసీఆర్‌ తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని ఆరోపించారు. ఓట్లు, ఎన్నికలు తప్పితే కేసీఆర్‌కు రాష్ట్ర ప్రజలపై ఏమాత్రం ప్రేమ లేదన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో కోరారు. 

తెలంగాణ ప్రజల జీవితమే విద్యుత్‌పై ఆధారపడి ఉందని, విద్యుత్‌ కోసం ప్రాణత్యాగాలకు కూడా వెనుకాడని చరిత్ర రాష్ట్రానికి ఉందని గుర్తు చేశారు. తన స్వార్థం, వ్యక్తిగత లాభం కోసం ఎక్కువ ధరలకు విద్యుత్‌ను కొనుగోలు చేసి జెన్‌కోను నష్టాల పాలు చేశారని విమర్శించారు. ఇప్పుడు తాను చేసిన తప్పును ప్రజలపై రుద్దాలని చూడడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   14 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   10 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   13 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   17 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   20 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   21 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle