newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

విద్యార్ధులకు ‘పది’ పరీక్షల కష్టాలు

10-05-202010-05-2020 18:40:50 IST
Updated On 10-05-2020 19:10:18 ISTUpdated On 10-05-20202020-05-10T13:10:50.022Z10-05-2020 2020-05-10T13:10:43.111Z - 2020-05-10T13:40:18.059Z - 10-05-2020

విద్యార్ధులకు ‘పది’ పరీక్షల కష్టాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ కారణంగా పదవ తరగతి పరీక్షల నిర్వహణ ప్రభుత్వాలకు కత్తిమీద సాములా మారింది. ఏపీలో అసలు పరీక్షలు ప్రారంభం కాలేదు. పరీక్షలు ప్రారంభిద్దామని అనుకుంటే స్థానిక ఎన్నికలంటూ వాయిదా వేశారు. పోనీ స్థానిక సంస్థల ఎన్నికలయినా జరిగాయా అంటే అవీ వాయిదాపడ్డాయి. కరోనా వైరస్ వల్ల ఆరువారాలు వాయిదా వేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం, తర్వాత పరీక్షలు జరుపుదామన్నా లాక్ డౌన్ ప్రారంభమయింది. దీంతో పరీక్షలు ఎప్పుడనేది ఎవరూ తేల్చుకోలేక పోతున్నారు.

ఇక తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు మార్చి 19న ప్రారంభం అయ్యాయి. రెండు సబ్జెక్టులు తెలుగు, హిందీ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ లోపు హైకోర్టులో కేసు వేయడంతో పరీక్షలు వాయిదా పడ్డాయి. తర్వాత లాక్ డౌన్ అడ్డంకులు ఏర్పడ్డాయి. విద్యార్ధులు మార్చి నుంచి పరీక్షలు ఎప్పుడు జరుగుతాయా అని ఎదురుచూపులు చూస్తూనే వున్నారు. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు పదో తరగతి విద్యార్ధుల భవిష్యత్తు ప్రశ్నార్ధకరంగా మారిన తరుణంలో లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన పరీక్షలను జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మార్చి నెలలో విద్యార్ధులకు జారీ చేసిన హాల్ టికెట్లతోనే మిగిలిన పదో తరగతి పరీక్షలు జరుగుతాయని.. విద్యార్ధులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ స్టేట్ ఎస్ఎస్సీ బోర్డు స్పష్టం చేసింది. 

మొత్తం 5. 34 లక్షల మంది విద్యార్ధులకు గతంలో 2530 కేంద్రాలను ఏర్పాటు చేశామని.. ఇప్పుడు ఆ పరీక్షా కేంద్రాలను రెట్టింపు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు అధికారులు. ఎగ్జామ్స్ నిర్వహణకు సంబంధించి సీఎం కేసీయార్ ప్రకటన చేశారు. పరీక్షలకు సంబంధించి హైకోర్టు నుంచి ఉత్తర్వులు రాగానే ఈ నెలాఖరులోగా పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ప్రకటన చేశారు. మిగిలిన పరీక్షల కోసం విద్యార్ధులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్స్ మొదలుపెట్టాలన్నారు.

అంతేకాక కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని పరీక్షా కేంద్రాల్లో హ్యాండ్ శానిటైజర్లు, మాస్కులు, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. ప్రతీ బెంచ్‌కు ఒకరు మాత్రమే కూర్చునే విధంగా.. విద్యార్ధుల మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని అంటున్నారు. 

అయితే, పరీక్షల నిర్వహణ ప్రస్తుత పరిస్థితుల్లో అంత ఆషామాషీకాదు. తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ రెడ్ జోన్లో వుంటే చుట్టుపక్కల ఆరెంజ్, గ్రీన్ జోన్లు వున్నాయి. పరీక్షల నిర్వహణకు పరీక్షా కేంద్రాల కేటాయింపు కూడా కష్టం కాదు. కానీ పరీక్షల కోసం 5.30 లక్షల మంది విద్యార్ధినీ విద్యార్ధులు రోడ్లమీదకు వస్తారు. వీరితో పాటు వారి తల్లిదండ్రుల్లో ఒకరు వచ్చినా వారు రెండుమూడు లక్షలు వుండవచ్చు. వారితోపాటు పిల్లల్ని పరీక్షా కేంద్రాలకు తరలించేందుకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు తిరుగుతాయి దీంతో లక్షలాదిమంది రోడ్లమీదకు రావడం జరుగుతుంది.

వీరితో పాటు విద్యాశాఖ అధికారులు, ఇన్విజిలేటర్లు, పరీక్షా కేంద్రాల్లో వివిధ ఏర్పాట్లు చేసే సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, భద్రతను పర్యవేక్షించే పోలీసులు .. ఇలా ఈ పరీక్షలతో వేలాదిమంది అనుసంధానం అయి వుంటారు. వీరందరికీ కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పరీక్షా కేంద్రాల లోపలికి వెళ్లేటప్పుడు కూడా భౌతిక దూరం పాటించాలి. కానీ అది ఆచరణ సాధ్యం కాదు. ఇతర ప్రాంతాల్లో వున్నవారు బయటకు వస్తే ఎవరికి కరోనా వుంటుందో తెలీని పరిస్థితులు. ఈ నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలు విద్యార్ధుల పాలిట అగ్ని పరీక్షలవుతున్నాయి. మరి ఈ గండాలన్నీ దాటి ఈ ఏడాది పదవతరగతి పరీక్షలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో అర్థంకాని సందిగ్ధ పరిస్థితి. ఇటు విద్యార్ధినీ విద్యార్ధులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలు వారి మెదళ్ళను తొలిచేస్తున్నాయి. 

 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   40 minutes ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   33 minutes ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   2 hours ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   3 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   6 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle