newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

విద్యార్థి సంఘం.. విద్యార్థుల పోరాటం అంటే ఇలానే ఉండాలి క‌దా..!

13-08-202013-08-2020 08:10:51 IST
Updated On 13-08-2020 10:06:52 ISTUpdated On 13-08-20202020-08-13T02:40:51.528Z13-08-2020 2020-08-13T02:40:47.861Z - 2020-08-13T04:36:52.180Z - 13-08-2020

విద్యార్థి సంఘం.. విద్యార్థుల పోరాటం అంటే ఇలానే ఉండాలి క‌దా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విద్యార్థులంటే చ‌దువులే కాదు స‌మాజం ప‌ట్ల బాధ్య‌త‌, సృహ ఉండాలి. విద్యార్థి సంఘాలు వీరిని సంఘ‌టితం చేసి స‌మ‌స్య‌ల‌పై పోరాటాలు చేయాలి. కేవ‌లం విద్యార్థుల స‌మ‌స్యలే కాదు ప్ర‌జ‌ల‌కు, స‌మాజానికి మ‌ద్ద‌తుగా విద్యార్థి లోకం గ‌ళ‌మెత్తాలి. 20 ఏళ్ల క్రితం ఇలాగే జ‌రిగేది. విద్యార్థుల్లో చైత‌న్యం ఉండేది. విద్యార్థి సంఘాలు ఎటువంటి పోరాటానికైనా ముందుండేవి. అందుకే ఇప్పుడు ప్ర‌జాజీవితంలో ఉన్న నాయ‌కులంతా ఒక‌ప్ప‌టి విద్యార్థి నాయ‌కులే. కానీ, గ‌త కొన్నేళ్లుగా విద్యార్థి రాజ‌కీయాల్లో, విద్యార్థి సంఘాల తీరులో చాలా మార్పులు వ‌చ్చాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతుంటారు.

పాత త‌రంలో విద్యార్థి సంఘాలు ఎంత చురుగ్గా ఉండేవో గుర్తు చేసుకుంటుంటారు. ఇప్పుడు ఇటువంటి ప‌రిస్థితి లేదు. విద్యార్థి సంఘాలు గ‌తంలోలా యాక్టీవ్‌గా ప‌ని చేయ‌డం లేదు. అడ‌పాద‌డ‌పా ఆందోళ‌న‌లు, ధ‌ర్నాలు చేసినా అవి కేవ‌లం విద్యార్థుల స‌మ‌స్య‌ల వ‌ర‌కే ప‌రిమితం అవుతున్నాయి. ఇత‌ర స‌మ‌స్య‌ల‌పై విద్యార్థి సంఘాలు దృష్టి పెట్ట‌డం త‌గ్గించేశాయి. గ‌తంలో మాదిరిగా ప్ర‌జ‌ల ప‌క్షాల విద్యార్థి సంఘాల పోరాటం త‌గ్గిపోయింది. కానీ, ఈ అభిప్రాయం త‌ప్ప‌ని నిరూపిస్తోంది తెలంగాణలో ఎన్ఎస్‌యూఐ విద్యార్థి సంఘం.

కాంగ్రెస్ పార్టీకి ఇది అనుంబంధ సంఘం. నిజానికి ఇత‌ర పార్టీల విద్యార్థి సంఘాల‌తో పోల్చితే ఇది అంత బ‌లంగా కూడా ఏమీ క‌నిపించ‌దు. కానీ, ఇటీవ‌లి కాలంలో పోరాటాల్లో ముందుంటుంది. ఎంత‌లా అంటే కాంగ్రెస్ పార్టీ కూడా చేయ‌లేనంత దూకుడుగా ఎన్ఎస్‌యూఐ ప‌ని చేస్తోంది. కేవ‌లం విద్యార్థి స‌మ‌స్య‌లే కాదు, రాష్ట్రంలో ప్ర‌జ‌లు ఎదుర్కుంటున్న ఇత‌ర స‌మ‌స్య‌ల‌పై ఈ సంఘం పోరాటంలో ముందుంటుంది. ఇటీవ‌ల తెలంగాణ‌లో క‌రోనావైర‌స్ మ‌ర‌ణాల సంఖ్య‌ను దాస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు పెద్ద ఎత్తున వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

చాలామంది ఈ ఆరోప‌ణ‌లు చేశారు కానీ ఎవ‌రూ ఆధారాల‌ను బ‌య‌ట‌పెట్ట‌లేక‌పోయారు. కానీ, ఎన్ఎస్‌యూఐ మాత్రం ఈ ప‌ని చేసింది. క‌రోనా మృతుల అంత్య‌క్రియ‌లు జ‌రుగుతున్న స్మ‌శాన‌వాటిక‌లో వీడియోను ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్య‌క్షుడు బ‌ల్మూరి వెంక‌ట్ బ‌య‌ట‌పెట్టారు. ప్ర‌భుత్వం చెబుతున్న లెక్క‌ల కంటే ఎక్కువ మంది క‌రోనాతో మ‌ర‌ణిస్తున్నార‌ని ఆయ‌న ఆధారాల‌ను చూపించారు. అప్పుడు కాంగ్రెస్ నేత‌లు కూడా ఇవే ఆరోప‌ణ‌లు చేశారు. మీడియా సైతం ఎన్ఎస్‌యూఐ ఆరోప‌ణ‌ల‌తోనే అప్ర‌మ‌త్త‌మైంది.

త‌ర్వాత రెండు ప్ర‌ధాన మీడియా సంస్థ‌లు ఎన్ఎస్‌యూఐ ఆరోప‌ణ‌ల ఆధారంగానే క‌రోనా మ‌ర‌ణాల లెక్క‌ల‌పై అనుమానాల గురించి ప‌తాక శీర్షిక‌ల్లో ప్ర‌చురించాయి. ఇక‌, క‌రోనా కార‌ణంగా ప‌రీక్ష‌లు జ‌రిపి విద్యార్థుల జీవితాలను ప్ర‌మాదంలోకి నెట్టేయొద్ద‌ని విద్యార్థుల ప‌క్షాన ఎన్ఎస్‌యూఐ పోరాటం చేస్తోంది. ఇందుకోసం ఆ సంఘం హైకోర్టును సైతం ఆశ్రయించింది. హైకోర్టులో ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారం పెండింగ్‌లో ఉంది. కానీ, యూజీసీ ఆదేశాల ప్ర‌కారం ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డానికి ప్ర‌భుత్వం మొగ్గు చూపుతోంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా ఎన్ఎస్‌యూఐ అనూహ్యంగా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను ముట్ట‌డించి ప్ర‌భుత్వానికి, పోలీసు, ఇంటెలిజెన్స్ వ్య‌వ‌స్థ‌కు షాక్ ఇచ్చింది. ఎన్ఎస్‌యూఐకి చెందిన విద్యార్థులు పీపీఈ కిట్లు, మాస్క‌లు ధ‌రించి ఒక డీసీఎంలో ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ద్ద‌కు చేరుకొని ఒక్క‌సారిగా ఆందోళ‌న‌కు దిగారు.

ఎన్ఎస్‌యూఐ అధ్య‌క్షుడు బ‌ల్మూరి వెంక‌ట్ ఏకంగా ప్ర‌గ‌తి భ‌వ‌న్ ఎత్తైన గేటును కూడా దూకి లోప‌లికి చొచ్చుకెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. ఈ హ‌ఠాత్‌ప‌రిణామంతో పోలీసులు కూడా షాక్ తిన్నారు. ఏకంగా పీపీఈ కిట్ల‌తో ఎన్ఎస్‌యూఐ విద్యార్థులు ఆందోళ‌న చేయ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం.

ఈ విష‌యంలో ప్ర‌తిప‌క్ష పార్టీకి అనుబంధంగా ఉండే విద్యార్థి సంఘం ఎలా పోరాడాలో అలా ఎన్ఎస్‌యూఐ పోరాడ‌గ‌లిగింది. ఎన్ఎస్‌యూఐ దూకుడు చూసి కాంగ్రెస్ నేత‌లు అభినందిస్తున్నారు. తెలంగాణ పోరాటంలో విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ప్ర‌ముఖ పాత్ర పోషించారు.

లాఠీఛార్జీల‌కు, అరెస్టుల‌కు వారు ఏనాడూ బ‌య‌ప‌డ‌లేదు. ఇప్పుడు ఎన్ఎస్‌యూఐ కూడా ఇదే బాట‌లో వెళుతోంది. మిగ‌తా విద్యార్థి సంఘాలు కూడా ప‌లు విద్యార్థి స‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్నాయి. కానీ, ఎన్ఎస్‌యూఐ మాత్రం ఈ విష‌యంలో ముందుంది. నిజానికి, ఎన్ఎస్‌యూఐ చూపిస్తున్న పోరాట‌ప‌టిమ కాంగ్రెస్ నేత‌లు కూడా చూపించ‌డం లేదేమో అనిపిస్తోంది.

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle