విదేశాలనుంచి వచ్చిన వారికి క్వారంటైన్ కష్టాలు
10-05-202010-05-2020 18:18:15 IST
Updated On 10-05-2020 19:07:57 ISTUpdated On 10-05-20202020-05-10T12:48:15.944Z10-05-2020 2020-05-10T12:48:10.291Z - 2020-05-10T13:37:57.974Z - 10-05-2020

దేశాలు దాటి వచ్చారు. కానీ స్వదేశంలో వారు కష్టాలు పడుతున్నారు. వలస వెళ్ళిన దేశంలో పనులు లేక బ్రతుకుజీవుడా అని విమానంలో హైదరాబాద్ వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చాక క్వారంటైన్ అన్నారు. వచ్చేముందు చెప్పిన మాటలకు.. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగాక జరుగుతున్న దానికి పొంతనలేకుండా పోతోందని కొందరు వాపోతున్నారు. నిన్న కువైట్ నుండి వచ్చి పెయిడ్ క్వారయింటైన్ లో ఉంటున్న వారి అవస్థలు అన్నీ ఇన్నీ కావు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రభాకర్ తన అవస్థలను మీడియా ముందు వెళ్లబోసుకున్నారు. ‘‘నిన్న రాత్రి శంషాబాద్ వచ్చాం.పెయిడ్ క్వారయింటైన్ కోసం కేవలం ఐదువేలు కడితే సరిపొతుందని అన్నారు. తర్వాత అది 15 వేలు, 30 వేలు విలువైన రూములు ఉన్నాయని అన్నారు. డబ్బులు కట్టకపోతే మళ్ళీ రిటర్న్ పంపుతామని అంటున్నారు. అక్కడ 3 నెలలుగా పనులు లేక ఇబ్బంది పడ్డాం. మా దగ్గర డబ్బులు లేవు. ప్రభుత్వమే మమ్మల్ని అదుకోవాలి. విమానంలో వచ్చేప్పుడు కూడా భౌతిక దూరం పాటించలేదు. మాకు అన్నం సరిగా పెట్టడం లేదు. చిన్నపిల్లలకు పెట్టినట్టు అన్నం పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి సహాయసహకారాలు అందివ్వాలని విన్నవిస్తున్నాం’’ అని వాపోయారు ప్రభాకర్. అంతకుముందు కువైట్ నుంచి వచ్చిన ప్రయాణికుల కోసం ప్రభుత్వం 4 హోటళ్లు రెడీ చేసినట్టు ప్రకటించింది. విదేశాల నుంచి వచ్చే వారికి సొంత ఖర్చులతో హోటళ్లలో క్వారంటైన్ అవకాశం కల్పించింది ప్రభుత్వం.. కువైట్ నుంచి వచ్చిన వారి కోసం హైదరాబాద్‌లో నాలుగు హోటళ్లు సిద్ధం చేశారు. హైటెక్‌సిటీ సమీపంలోని షెరటాన్ హోటల్, గచ్చిబౌలిలోని రెడ్ ఫాక్స్ హోటల్‌ను ఎక్కువ చార్జీ కేటగిరీలో కేటాయించారు.ఇక్కడ ఒక్కొక్కరికి భోజనంతో కలుపుకొని రూ.30 వేలు (క్వారంటైన్ మొత్తానికి) చార్జీ చేస్తారు. రూ.15 వేల కేటగిరీ కింద కామత్ లింగాపూర్, కాచిగూడలోని ఫ్లాగ్షిప్ హోటళ్లను కేటాయించారు. ఆ తర్వాత వచ్చే వారికి కూడా ఇప్పటికే ఆయా హోటళ్లలో గదులు సిద్ధం చేశారు అధికారులు.విదేశాల నుంచి వచ్చిన వారిని హోటళ్లకు తరలించే బాధ్యతను పర్యాటక శాఖకు అప్పగించారు. అందుకు ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపింది. హోటళ్ల ఎంపిక, తదితర అంశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఐఏఎస్ అధికారుల కమిటీ పర్యవేక్షిస్తోంది. అయితే తమకు ఇబ్బందులున్నాయని కువైట్ నుంచి వచ్చిన వారు అంటున్నారు.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
8 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
11 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
15 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
5 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
15 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
13 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
15 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
16 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
9 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
18 hours ago
ఇంకా