newssting
BITING NEWS :
*కాకినాడలో ముగిసిన జనసేన రైతు సౌభాగ్యదీక్ష*పౌరసత్వ బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం *అసోం, మేఘాలయ, త్రిపురల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు *ఐదో రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..ఉపాధి హామీ నిధుల విడుదల కోరుతూ..నేడు అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేల ధర్నా*నేడు విశాఖలో సీఎం జగన్‌ పర్యటన..ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరు*దిగివస్తున్న ఉల్లి ధరలు...కిలో ఉల్లి 70-80 లోపే అమ్మకాలు *అమరావతి: ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌ని సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. గత ప్రభుత్వంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేసిన కృష్ణ కిషోర్*హైదరాబాద్‌: బంజారాహిల్స్ ఎస్‌బీటీ నగర్‌లో రౌడీ షీటర్ హత్య... రౌడీ షీటర్‌ సయీద్ నూర్‌ను హత్య చేసిన నలుగురు వ్యక్తులు, బంజారాహిల్స్ పీఎస్‌లో లొంగుబాటు*తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమల్లోఉంటాయి.. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు మృతదేహాలను భద్రపర్చాలి-సుప్రీంకోర్టు*కూల్చివేతలతో ప్రభుత్వాన్ని ప్రారంభించిన వైసీపీ.. అందరినీ కూల్చివేస్తోంది.. ఎంతోమంది కూలిపోయారు.. మీరెంత...? మీ 151 మంది ఎమ్మెల్యేలెంత?-పవన్*అసెంబ్లీలో మార్షల్ తీరుపై మండిపడ్డ చంద్రబాబు

విజయారెడ్డి హత్యకేసు నిందితుడు సురేష్ మృతి

07-11-201907-11-2019 13:21:49 IST
2019-11-07T07:51:49.045Z07-11-2019 2019-11-07T07:51:38.288Z - - 13-12-2019

విజయారెడ్డి హత్యకేసు నిందితుడు సురేష్ మృతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్రంలోని అబ్దుల్లాపూర్ మెట్ తాహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. విజయారెడ్డి పెట్రోల్ పోసిన సురేష్ గురువారం చనిపోయాడు. 60శాతానికి పైగా కాలిన గాయాలు కావడంతో నాలుగు రోజులుగా కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడిన సురేష్‌... నీటి శాతం తగ్గిపోవడంతో చికిత్స పొందుతూ మృతిచెందినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

సంఘటన జరిగిన రోజు ఏం జరిగిందో చికిత్స పొందుతూనే సురేష్ పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈమేరకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు సురేష్ స్టేట్‌మెంట్ రికార్డ్ కూడా చేశారు. ఓ భూమికి సంబంధించి పట్టా కోసం కొంతకాలంగా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని, కోర్టు కేసులు, జేసీ ఆదేశాలు ఉండడంతో తానేం చేయలేనని తాహశీల్దార్ విజయారెడ్డి తనకు చెప్పారని సురేష్ వివరించాడు. 

తాను ఎంత ప్రాధేయపడినా పట్టా ఇవ్వడం కుదరదని చెప్పారని.. సోమవారం మధ్యాహ్నం కూడా తాను ఎంత అడిగినా తాహశీల్దార్ అదే సమాధానం చెప్పడంతో ఆవేశంతో  తనపై పెట్రోల్ పోసుకొని.. తర్వాత ఆమెపై పోశానని వాంగ్మూలం ఇచ్చాడు. తనకు నిప్పంటించుకొని ఆమెను కూడా తగులబెట్టానని చెప్పాడు. తాను కూడా చనిపోవాలని ఈ పని చేశానని చెప్పాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ గురునాథం చనిపోయిన సంగతి తెలిసిందే. 

తన భూములకు పట్టా ఇవ్వడంలేదనే అక్కసుతో తాహశీల్దార్‌ని  సజీవ దహనం చేశాడు సురేష్. ఈ ఘటనకు అత్యంత విలువైన వివాదాస్పద భూములే కారణమనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌లు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.

ఇదిలా ఉంటే తనపై వస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బాచారంలోని వివాదాస్పద భూముల విషయమై సమగ్ర విచారణ జరిపించాలని సీఎం కేసీఆర్‌కు లేఖ రాయబోతున్నట్టు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు.

అబ్దుల్లాపూర్‌మెట్‌లో బుధవారం పర్యటించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి.. తహసీల్దార్‌ విజయారెడ్డి హత్యపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక్కడి భూములను మల్ రెడ్డి రంగారెడ్డి బంధువులే కాజేశారని కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మొత్తం మీద విజయారెడ్డి కేసు ప్రకంపనలు కలిగిస్తోంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle