newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

28-02-202028-02-2020 10:51:12 IST
2020-02-28T05:21:12.607Z28-02-2020 2020-02-28T05:21:09.855Z - - 15-04-2021

వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అప్పుడెప్పుడో పదేళ్ల క్రితమే సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్ వ్యవసాయ భూములను కొన్నారు. అప్పుడే అక్కడ ఓ ఇంటిని కూడా నిర్మించుకున్నారు. అయితే, సీఎం అయ్యాక ఆ ఇల్లు ఏ మాత్రం సరిపోలేదు. ఎందుకంటే అయన రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టేది అక్కడే.. యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఇలా ఎన్నో కార్యక్రమాలను అక్కడే నిర్వహిస్తుంటారు.

ఈ క్రమంలోనే వ్యవసాయ క్షేత్రంలో గత ఏడాది పెద్ద బంగ్లాను కట్టించుకున్నారు. దానికి గత ఏడాది అతికొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య గృహప్రవేశం కూడా చేశారు. అయితే.. ఆ బంగ్లాకు.. అప్పుడప్పుడు అయన అక్కడ నిర్వహించే సమావేశాలకు రాష్ట్రం నుండి భారీగానే మంత్రులు, అతిధులు హాజరువుతుంటారు. వారికి భద్రతకు సిద్ధిపేట జిల్లా కేంద్రం నుండి భద్రత రావాల్సి వస్తుంది.

ఈక్రమంలోనే ఎర్రవల్లి పరిధిలోకి వచ్చే విధంగా ఓ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఇందుకోసం ఏకంగా దేశంలోనే అక్కడ లేని విధంగా అత్యాధునిక హంగులతో.. మొత్తం ఎనిమిది ఎకరాల స్థలంలో ఈ స్టేషన్ నిర్మాణం మొదలుపెట్టినట్లుగా తెలుస్తుంది. ఈ విషయంపై హైదరాబాద్ కేంద్రంగా నడిచే ఓ పత్రిక భారీ కథనాన్ని ప్రచురించడంతో విషయం బయటపడింది.

ఈ స్టేషన్ కట్టడానికి ప్లాన్స్.. కాంట్రాక్టులను కూడా సీఎం కేసీఆర్ ఫైనల్ చేశారని.. గత ఇరవై రోజుల క్రితమే శంకుస్థాపన కార్యక్రమం కూడా పూర్తయిందని ఆ పత్రిక పేర్కొంది. ఈ స్టేషన్ పరిధిలోనే మొత్తం నాలుగు విశ్రాంతి భవనాలు.. యాభై గదులు కూడా నిర్మించనున్నారని.. ఒకేసారి యాభై మంది అక్కడ విశ్రాంతి తీసుకొనేందుకు వీలుగా ఈ నిర్మాణాలు జరగనున్నాయని సదరు పత్రిక తెలిపింది.

మొత్తం ఈ నిర్మాణ సముదాయం కోసం పదమూడు కోట్ల రూపాయలను ఖర్చు చేయనుండగా ఆ మొత్తాన్ని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపింది. అయితే, ఈ తతంగమంతా గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వం ఎందుకు దాచాల్సి వస్తుందని పత్రిక ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మరి దీనికి ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తిగా మారింది.

గత ఏడాది అదే వ్యవసాయ క్షేత్రంలో బంగ్లా నిర్మించిన సమయంలో ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టేశాయి. రాష్ట్రంలో ప్రజలకు ఇస్తామన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కటీ కట్టలేదు కానీ దొరగారికి ఇంటి మీద ఇల్లు.. ఎక్కడిక్కడ బంగ్లాలు కట్టేసుకుంటున్నారని విరుచుకుపడ్డారు. ఆ బంగ్లా కోసం కోట్లు వెచ్చించి ఏకంగా పోలీస్ స్టేషన్ పెడుతున్నారంటే ప్రతిపక్షాల రియాక్షన్ ఎలా ఉంటుందో వేరేలా చెప్పుకోవాల్సిన పనిలేదు!

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle