newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

వాళ్లు నిందితులా, బాధితులా? డ్రగ్స్ కేసు ఛార్జిషీట్లపై విమర్శలు

15-05-201915-05-2019 07:53:17 IST
Updated On 28-06-2019 11:45:20 ISTUpdated On 28-06-20192019-05-15T02:23:17.269Z15-05-2019 2019-05-15T02:23:11.756Z - 2019-06-28T06:15:20.959Z - 28-06-2019

వాళ్లు నిందితులా, బాధితులా? డ్రగ్స్ కేసు ఛార్జిషీట్లపై విమర్శలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు రాష్ట్రాల్లో  సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో  సిట్ దాఖలు చేసిన చార్జీషీట్లపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 12 కేసుల్లో నాలుగు కేసులకు సంబంధించి ఎక్సైజ్ పోలీసులు నాలుగు చార్జీషీట్లు దాఖలు చేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా అనేకమంది నటీనటులు, దర్శకులను సిట్ విచారించింది. అప్పట్లో అకున్ సబర్వాల్ ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నోటీసుల మీద నోటీసులు జారీచేస్తూ వారిని సిట్ ఆఫీసులో  గంటల తరబడి ప్రశ్నించారు. 

డ్రగ్స్‌తో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధాలు ఉన్నాయనే కీలకమయిన కోణంలో ఎక్సైజ్ పోలీసులు విచారణ నిర్వహించారు. 2017లో అలెక్స్‌ అనే వ్యక్తిని హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో తీగలాగితే  డొంకంతా కదిలినట్టు డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. ముంబై నుండి హైదరాబాద్‌కు డ్రగ్స్‌కు తరలిస్తున్న కేసులో ఆయనను అరెస్ట్ చేశారు.

అలెక్స్‌ను విచారించిన సమయంలో సినీ ప్రముఖులకు కూడ డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా అలెక్స్ సమాచారం ఇచ్చారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు.ఈ కేసుతో సంబంధం ఉందనే అనుమానంతో టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన నటులు, కెమెరామెన్లు, దర్శకులను ఎక్సైజ్ అధికారులు విచారించారు.ఈ కేసు విచారణ కోసం ఎక్సైజ్ శాఖ ప్రత్యేకంగా సిట్‌ను ఏర్పాటు చేసింది. 

అంతేకాదు కొందరు సినీ ప్రముఖుల నుండి వెంట్రుకలు, గోళ్లను కూడ సేకరించారు. అయితే ఈ శాంపిల్స్‌ను ఎఫ్ఎస్‌ఎల్‌కు పంపితే అక్కడి నుండి ఆలస్యంగా రిపోర్టులు వచ్చాయి. డ్రగ్స్ కేసులో‌ ఇప్పటికే నాలుగు చార్జీషీట్లు నమోదయ్యాయి. ఇంకా 8 కేసులకు సంబంధించి చార్జీషీట్లు దాఖలు చేయనున్నారు.

అంతా బాగానే ఉంది కానీ ఈచార్జీషీట్లలో ఇప్పటికీ సినీ ప్రముఖుల పేర్లు మాత్రం లేవు. ఉద్దేశ్యపూర్వకంగానే చార్జీషీట్లలో సినీ ప్రముఖుల పేర్లను తొలగించారా అని కొన్ని స్వచ్చంద సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. అయితే వీరంతా బాధితులే కానీ, నిందితులు కాదని అధికారులు అంటున్నారు. 

Image result for drugs case telugu cinema links

డ్రగ్స్ కేసుకు సంబంధించి దాఖలు చేసిన చార్జీషీటు‌పై సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌ సంస్థకు చెందిన పద్మనాభరెడ్డి పలు అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ కేసును సిట్ నుంచి తీసుకుని ఏసీబీ ద్వారా విచారించాలని, వాస్తవాలను ప్రజలకు వివరించాలని  ఆయన డిమాండ్ చేస్తున్నారు. సిట్ దాఖలు చేసిన చార్జీషీటులో సినీ ప్రముఖుల పేర్లు ఎందుకు చేర్చలేదని ఆయన ప్రశ్నించారు.

ఇదే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రముఖుల నుంచి, రాజకీయనేతల నుంచి వత్తిడి రావడం వల్లే ఇలా చేశారని విమర్శిస్తున్నారు. ఈ సందేహాలకు జవాబివ్వాల్సింది మాత్రం ఎక్సయిజ్ అధికారులే. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉంది ఈ వ్యవహారం. 

Image result for drugs case telugu cinema links


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle