newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

వారికీ అధికారం ఉందంటూనే కేంద్రంపై కేసీఆర్ ఆక్షేపణలు..!

06-05-202006-05-2020 12:51:06 IST
Updated On 06-05-2020 13:03:53 ISTUpdated On 06-05-20202020-05-06T07:21:06.500Z06-05-2020 2020-05-06T07:21:03.992Z - 2020-05-06T07:33:53.154Z - 06-05-2020

వారికీ అధికారం ఉందంటూనే కేంద్రంపై కేసీఆర్ ఆక్షేపణలు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్రం సోమవారం నుండి దేశంలో లాక్ డౌన్ 3.0 అమలు చేసింది. అయితే తెలంగాణలో మాత్రం ఎల్లుండి శుక్రవారం నుండి లాక్ డౌన్ 3.0  అమల్లోకి రానుంది. అది కూడా పూర్తిగా కేంద్రం సూచించిన స్థాయిలో కాదు. తెలంగాణ సర్కార్ మార్క్ సడలింపులు.. బిగింపులు ఉండనే ఉన్నాయి. కేంద్రం ఈనెల 17 వరకే లాక్ డౌన్ పొడగింపు అంటే సీఎం కేసీఆర్ ఏకంగా ఈనెల 29 వరకు విధించేశారు.

ఇక్కడే సీఎం కేసీఆర్ స్ట్రాటజీ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. తొలినుండి ప్రధాని నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను సమర్ధిస్తున్నట్లుగానే కనిపిస్తూ తనదైన స్టైల్ లో ముందుకు వెళ్తున్నారు కేసీఆర్. నిన్న మీడియా సమావేశం.. అందులో నిర్ణయాలు.. కేంద్రంపై విసుర్లు.. లాక్ డౌన్ పొడగింపు అన్నీ మరోసారి కేసీఆర్ మార్క్ ట్రీట్ మెంట్ కనిపిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం విధించిన సడలింపులు మనకి వర్తిస్తాయి అంటూనే కొన్ని అమలు చేస్తే ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళం అవుతామన్నారు. ఉదాహరణకు ఆర్టీసీ బస్సు సర్వీసులకు కేంద్రం యాభై శాతం నడుపుకోవచ్చని ప్రకటించింది. అయితే కేసీఆర్ మాత్రం ఈనెల 15 వరకు ఆ ఊసే లేదన్నారు. ఆ తర్వాత మరోసారి చర్చించి అప్పుడు చూద్దామన్నారు.

అలా కొన్నికొన్నిటిలో తనదైన శైలిలో సడలింపులు లేకుండా చూసుకున్నారు. ఇక మరోవైపు కేంద్రంపై ఆర్థికపరమైన కారణాలతో కొన్ని విసుర్లు కూడా కనిపించాయి. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాలను ఆర్ధికంగా ఆదుకోవాల్సిన కేంద్రం మౌనంగా ఉండడం ఏంటని ప్రశ్నించారు. తాను ఇప్పటికే చాలాసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు.

తానిచ్చిన సూచనలలో ఏ ఒక్కటీ కేంద్రం పట్టించుకోలేదన్న కేసీఆర్ సాయం చేయకపోగా సొంతంగా రాష్ట్రాలు సమస్యను పరిష్కరించే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వలస కూలీలకు రైలు ఖర్చులను కూడా భరించలేని స్థితిలో కేంద్రం ఉందా? అంటూ సూటిగానే ప్రశ్నించారు. మొత్తంగా ఎప్పటిలానే కేసీఆర్ మీడియా మీట్ అవునంటే కాదనిలే.. కాదంటే అవుననిలే అన్న పాట మాదిరిగానే సాగింది.

కరోనా సమయంలో జనతా కర్ఫ్యూ రోజు నుండే సీఎం కేసీఆర్ కేంద్రం నిర్ణయాలను సమర్ధిస్తున్నట్లుగానే కనిపిస్తున్నా.. చిన్న వార్ మాత్రం కనిపిస్తూనే ఉంటుంది. తొలిసారి లాక్ డౌన్ నుండి ఇప్పుడు పొడగింపు వరకు అన్నిటిలో కేంద్రాన్ని కాదని.. ముందుగానే పొడగింపులు ఉంటున్నాయి. కానీ కేంద్రం అధికారాలను గౌరవించాలని చెప్పడం విశేషం.

ఇక సీఎం కరోనాపై ఎప్పుడు మీడియా సమావేశం నిర్వహించినా చివరి పదినిమిషాలు.. రాష్ట్రంలో కేంద్రంలో తమ ప్రత్యర్థులను టార్గెట్ చేసే మాట్లాడతారు. రాజకీయాలకు ఇది సమయం కాదంటూనే దిక్కుమాలిన ప్రతిపక్షాలు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తారు. థిస్ ఈజ్ నాట్ ఫేర్ అంటూనే మాటలతోనే దాడి చేస్తారు. అదే కేసీఆర్ కేసీఆర్.. పాలిటిక్స్ నెవెర్ ఎండ్స్!

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle