newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వాడవాడలా హరితహారం.. తెలంగాణకు పచ్చలహారం

26-06-202026-06-2020 09:07:42 IST
Updated On 26-06-2020 11:01:17 ISTUpdated On 26-06-20202020-06-26T03:37:42.638Z26-06-2020 2020-06-26T03:37:32.599Z - 2020-06-26T05:31:17.897Z - 26-06-2020

వాడవాడలా హరితహారం.. తెలంగాణకు పచ్చలహారం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పర్యావరణాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ప్రతి ఇంట్లో చెట్లను పెంచాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం సత్ఫలితాలను ఇస్తోంది. మరో విడత హరితహారం ప్రారంభమయింది. వాడవాడలా మొక్కలు నాటుతున్నారు మంత్రులు,ప్రజాప్రతినిధులు, ప్రజలు. దీంతో తెలంగాణ రాబోయే రోజుల్లో పచ్చగా మారనుంది. తాజాగా సీఎం కేసీయార్ హరితహారానికి శ్రీకారం చుట్టారు.

తెలంగాణ ప్రజల వ్యక్తిత్వపటిమ చాలా గొప్పదని, మనం తలుచుకుంటే జరగని పని లేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. మనపూర్వికులు మనకోసం ఎంతో కష్టపడినందుకే మనం ఇవాళ ఇట్లున్నామని, మన భవిష్యత్‌ తరాల కోసం మనం కూడా ఎంతో కొంత చేయాలి కదా. అందుకే మళ్లీ పాత అడవులు వచ్చి తీరాలి. ప్రతి ఇంటికి ఆరు చెట్లు నాటాలని సీఎం పిలుపునిచ్చారు. 

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌, నీళ్ల ట్యాంకర్‌ను ఈ ప్రభుత్వం ఇచ్చిందని, నాటిన మొక్కలను బతికించుకునే బాధ్యత ఎవరికి వారు స్వచ్ఛంధంగా తీసుకోవాలని కోరారు. మొక్కలు కాపాడే బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు, యువకులు తీసుకోవాలన్నారు. మొక్కలకు నీళ్ళు పోయడానికి ప్రభుత్వం రాదని, ఎవరికివారే తమ ఇంటిముందు మొక్కలు పెంచుకోవాలన్నారు. తెలంగాణలో ప్రతిగ్రామంలో నర్సరీ ఉందని, దేశంలో ఏరాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి లేదన్నారు.  

ప్రతిపౌరుడు నర్సరీ ద్వారా మొక్కలు తెచ్చుకుని నాటుకోవాలన్నారు. ఈ సందర్భంగా అల్ల నేరేడు మొక్క నాటి నీళ్ళు పోశారు కేసీయార్.  '92 వేల ఎకరాల అడవిని పోగొట్టుకున్నాం. సినిమా షూటింగులకోసం నర్సాపూర్‌ అటవీప్రాంతాన్నే ఎంచుకునేవాళ్లు. గతంలో నర్సాపూర్‌ అడవుల్లో అనేక సినిమాల షూటింగులు జరిగాయి. సమష్టి కృషితోనే ఈ అటవీ ప్రాంతానికి పునరుజ్జీవం కలుగుతుంది. అడవులు కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంది. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కథానాయకులు కావాలి. ఇందులో ప్రజల సహకారం కూడా కావాలి' అని సీఎం అన్నారు. 

ప్రతి ఇంటికి ఆరు మొక్కలు నాటాలి. నాటిన మొక్కలకు కుటుంబ సభ్యుల పేర్లు పెట్టాలి. మొక్క ఎండిపోతే బిడ్డ ఎండిపోయినట్లు అని సెంటిమెంట్‌ క్రియేట్‌ చేయాలని చెప్పారు.మిషన్‌ భగీరథతో తెలంగాణలో నీటి సమస్య తీరిందన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య సైతం తీరిందన్నారు. ఇకముందు తెలంగాణకు విద్యుత్‌ సమస్య రాదన్నారు.

రాష్ట్రంలో నాణ్యమన నిరంతర విద్యుత్‌ అందిస్తున్నట్లు తెలిపారు. గత పాలనలో తెలంగాణలోని అడవులన్నీ తరిగిపోయాయన్నారు. కలప దొంగలను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించమన్నారు. కలప స్మగ్లర్ల ఆటకట్టించేందుకు ఇంటలిజెన్స్‌లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అడవులను స్మగ్లర్లకు అప్పగించిన పార్టీలే మళ్లీ విమర్శలు చేస్తున్నాయని ఈ సందర్భంగా సీఎం కేసీయార్ మండిపడ్డారు.

తెలంగాణ ఏర్పడ్డాక అడవుల పెంపకంపై దృష్టిపెట్టినట్లు సీఎం చెప్పారు. అడవులు పెరిగితే వర్షాలు పడతాయి. వర్షాలు పడితే నిండుగా పంటలు పండుతాయన్నారు కేసీయార్. సంకల్పం ఉంటే అన్ని సమకూరుతాయన్న సీఎం గ్రామాలకు పూర్వ వైభవం రావాలని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో హరితహారం ఉద్యమంలా సాగుతోందన్నారు. 

 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   5 minutes ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   an hour ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   an hour ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   4 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   3 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   6 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   19 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   a day ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   21 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle