newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వాడవాడలా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

02-06-202002-06-2020 11:06:58 IST
Updated On 02-06-2020 11:26:49 ISTUpdated On 02-06-20202020-06-02T05:36:58.170Z02-06-2020 2020-06-02T05:35:29.992Z - 2020-06-02T05:56:49.347Z - 02-06-2020

వాడవాడలా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జూన్ 2 తెలంగాణ రాష్ట్రం కల సాకారమయిన రోజు. ఇప్పటికి జనం ఆకాంక్షలు నెరవేరి ఆరేళ్లు అవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అమరవీరులకు సీఎం కేసీఆర్‌ నివాళులు అర్పించారు. ప్రగతి భవన్‌ నుంచి గన్‌పార్క్‌ చేరుకున్న ఆయన అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. రెండు నిమిషాలపాటు ఆయన మౌనం పాటించారు. 

హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎంపీ సంతోష్‌ కుమార్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అమరవీరులకు నివాళులు అర్పించారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు.  తెలంగాణ భవన్‌లోలో నిరాడంబరంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. పార్టీ పార్లమెంటరీ నేత కే కేశవరావు జాతీయ జెండా ఎగురవేశారు.

Image

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సోదర సోదరీమణులకు నమస్కారం అంటూ తెలుగులో ట్వీట్ చేసిన రాష్ట్రపతి.. ‘‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. యావత్ భారతదేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగు వారి సొంతం. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం’’ అని ట్వీట్ చేశారు.

ట్విట్టర్ వేదికగా ఆయన తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. మోదీ , రాష్ట్రపతి సైతం తెలంగాణ ప్రజలకు శుభాకంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు విషెస్ తెలుపుతూ తెలుగులోనే ట్వీట్ చేశారు మోదీ. ‘తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దిన శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో క్షేత్రాలో తమ ప్రతిభను చాటుతున్నారు. దేశ ప్రగతిలో ఈ రాష్ట్రం ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది. తెలంగాణ ప్రజల అభ్యున్నతి మరియు శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను.’ అంటూ ప్రధాని అన్నారు.

సిద్దిపేట జిల్లా కేంద్రంలోనీ తన నివాసంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు మంత్రి హరీష్ రావు.  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు అమరవీరులకు మరియు జయశంకర్  చిత్రపటానికి నివాళులర్పించారు. నల్లగొండలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, జడ్పి చైర్మన్ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ పాటిల్.  అసెంబ్లీలో నిరాడంబరంగా వేడుకలు నిర్వహించారు. శాసనమండలిలో చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 

వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో, కలెక్టర్ కార్యాలయం లో జండాను ఎగరవేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ అమరవీరుల స్థూపనికి నివాళులు అర్పించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ,దేవర్ కద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి , కలెక్టర్ వెంకట్ రావు , ఎస్పీ రెమా రాజేశ్వరి.

సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో  జెండా ఆవిష్కరించారు మంత్రి జగదీష్ రెడ్డి.  కేసీఆర్ పోరాట పటిమ, అమరుల బలిదానాలు వెరసి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ లోని అమరుల స్థూపం వద్ద తెలంగాణ అమర వీరులకు నివాళులు అర్పించారు. మహబూబాబద్ అమర వీరుల స్థూపం వద్ద ఇవాళ గిరిజ‌న సంక్షేమ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌ నివాళులు అర్పించారు. అమరవీరుల త్యాగాలను గుర్తుచేశారు.

మాజీ కేంద్రమంత్రి మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రజలకు విషెస్ చెప్పారు. ‘ఎందరో అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా,దశాబ్దాల కల సాకారం చేసిన జన హృదయ నేత శ్రీ KCR గారికి, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ వేడుకలు నిర్వహించారు. 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   13 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   13 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   13 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   17 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   18 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   17 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   19 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   19 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   15 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle