newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

వలస కూలీలు ఇక తిరిగిరారు.. సంక్షోభంలో నిర్మాణరంగం

05-05-202005-05-2020 06:36:56 IST
Updated On 05-05-2020 08:55:09 ISTUpdated On 05-05-20202020-05-05T01:06:56.458Z05-05-2020 2020-05-05T01:06:54.523Z - 2020-05-05T03:25:09.341Z - 05-05-2020

వలస కూలీలు ఇక తిరిగిరారు.. సంక్షోభంలో నిర్మాణరంగం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్‌డౌన్‌ నుంచి నిర్మాణ రంగానికి ప్రభుత్వం సడలింపునివ్వడం నిర్మాణదార్లకు, కార్మికులకు ఊరటనిచ్చే పరిణామమే అయినా.. పని ప్రదేశంలో ఉన్న కూలీలు, కార్మికులతోనే భవన నిర్మాణ పనులను కొనసాగించాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. దీంతో నిర్మాణదారులకు పెద్ద చిక్కొచ్చిపడింది. లాక్‌డౌన్‌ కారణంగా చాలా మంది ఇప్పటికే పనులున్న చోటును వదిలి స్వస్థలాలకు చేరుకున్నారు. ఇంకొందరు సొంతూర్లకు బయలుదేరి మధ్యలో ఉన్నారు. కొందరు అక్కడే ఉన్నా ఇంటి మీద బెంగ పెట్టుకొని, ఎప్పుడెప్పుడు స్వస్థలాలకు వెళతామా అని ఎదురుచూస్తున్నారు. వారిలో కొందరు పనులు చేసేందుకు సిద్ధంగా లేరు. తిరిగి వెళ్లిన కూలీలు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. దీంతో కూలీల కొరతతో చాలా చోట్ల పనులు కొనసాగడంపై తీవ్ర అనిశ్చితి నెలకొంది.

ఈ నేపథ్యంలో మూటా ముల్లే సర్దుకొని స్వస్థలాలకు బయలుదేరిన భవన నిర్మాణరంగ  కార్మికులను నిర్మాణదార్లు అడ్డుకుంటున్నారు. ‘పనులు మొదలవుతాయి. మీరు ఇక్కడే పనులు చేసుకోవచ్చు. ఉండిపోండి’ అని చెబుతున్నారు. కానీ, ఇందుకు కార్మికులు ససేమిరా అంటున్నారు. స్వస్థలాలకు వెళ్లిపోతామని పట్టుబడుతున్నారు. దీంతో పని ప్రదేశంలోనే ఉన్న కార్మికులు, కూలీలతో ఎంత మేరకు పని చేయించగలమని, నిర్మాణానికి అవసరమైన సామగ్రి ఎలా తీసుకురావాలని నిర్మాణదారులు ప్రశ్నిస్తున్నారు. 

తెలంగాణంలో నిర్మాణ రంగానికి సంబంధించి గుర్తింపు కార్డు కలిగి ఉన్న కూలీలు 15.4 లక్షల మంది ఉన్నారు. వీరికి లక్షల్లో ఉన్న అసంఘటిత రంగంలోని కూలీలు, కార్మికులు అదనం. రాష్ట్రంలో నిర్మాణ రంగం పరుగులు పెడుతుండంతో ఇతర రాష్ట్రాల్లోని కార్మికులు, కూలీలు కూడా ఇక్కడకు వచ్చారు. మొత్తంగా వలస కార్మికులు, కూలీలతో కలిపి నిర్మాణ రంగంలో 25 లక్షల మందికి పైగా పనిచేస్తున్నట్లు అంచనా. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారు దాదాపు 4లక్షల మంది ఉంటారని సమాచారం. 

మొత్తం కూలీల్లో సుమారు 4లక్షల మంది గ్రేటర్‌ హైదరాబాద్‌, మెట్రో డెవల్‌పమెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీఏ) పరిధిలోనే పని చేస్తుంటారు. కరోనా ప్రభావంతో కాంట్రాక్టర్లు, బిల్డర్లు కల్పించిన వసతి, సౌకర్యాలతో కొందరు పని ప్రదేశంలోనే ఉండగా.. మరికొందరు వేర్వేరు  ప్రదేశాల్లో ఉన్నారు. మొత్తంగా సుమారు లక్ష మంది మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం.  

లాక్‌డౌన్‌తో స్వస్థలాలకు వెళ్లిన నిర్మాణ రంగ కార్మికులు, కూలీలు తిరిగి పనులు జరిగే ప్రాంతాలకు వెంటనే రావడం కష్టమేనని చెబుతున్నారు. దాదాపు 3.2 లక్షల మంది ఇతర రాష్ర్టాలకు చెందినవారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాలు, పని ప్రదేశాల్లో ఉన్నారు. వీరిలో 90శాతం మంది స్వస్థలాలకు వెళ్లినట్లు చెబుతున్నారు. వీరంతా మహారాష్ట్ర, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, యూపీ, బిహార్‌లకు చెందినవారు. లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో వెంటనే వారిక్కడికి వచ్చే అవకాశమే లేదు. 

లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన తరువాత కూడా వారంతా మళ్లీ రాష్ట్రానికి వస్తారా అన్నదీ ప్రశ్నార్థకమే. స్వస్థలాలకు వెళ్లిన మన రాష్ట్రంలోని కార్మికులు, కూలీలు మాత్రమే లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత పరిస్థితులు కొంత కుదుటపడితే మళ్లీ పని ప్రాంతాలకు వస్తారన్న ఆశాభావాన్ని నిర్మాణదారులు వ్యక్తం చేస్తున్నారు. 

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కన్నా  గ్రేటర్‌ చుట్టూ ఉన్న 7 కార్పొరేషన్లు, 7 మునిసిపాలిటీ పరిధిలోనే భవన నిర్మాణ పనులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇందులో సింహభాగం భారీ ప్రాజెక్టులన్నీ ఐటీ కారిడార్‌లోని మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, నానక్‌రాంగూడ, మణికొండ, నార్సింగి, కోకాపేట వంటి ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఇక్కడ భారీ ప్రాజెక్టులున్న చోట బిల్డర్లు కార్మికులకు భోజనం, ఇతర వసతి సౌకర్యాలు కల్పించారు. అలాంటి సైట్లలోనే కార్మికులు కొంతవరకు అందుబాటులో ఉండి పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.  

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle