newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వరుస ప్రమాదాలు.. మొన్న శ్రీశైలం... నిన్న గుమ్మడిదల

23-08-202023-08-2020 08:24:45 IST
2020-08-23T02:54:45.568Z23-08-2020 2020-08-23T02:52:26.282Z - - 22-04-2021

వరుస ప్రమాదాలు.. మొన్న శ్రీశైలం... నిన్న గుమ్మడిదల
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు సరైన విధానం అమలుకావడం లేదు. తాజాగా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామికవాడలోని  ఓ  గోదాంలో  శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చోసుకుంది. 

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తోంది. 10 మంది ఫైర్  సిబ్బంది సుమారు 2 గంటలు శ్రమ పడి మంటలను అదుపు చేయాల్సి వచ్చింది. అదే విధంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి విద్యుత్ అధికారులు ప్రయత్నం చేశారు.

ఇక పరిశ్రమ యజమానిపై  చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధంచిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కంపెనీలో వున్న డ్రమ్ముల్లో రసాయనం మంటలకు ఆహుతి అయింది. ఇప్పటికే శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 9మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సీఐడీ విచారణ జరుపుతోంది. ప్రతిపక్షాలు మాత్రం సీబీఐ విచారణ జరపాలంటున్నాయి.

శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరాలని, సీఐడీ విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయనే నమ్మకం లేదన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. కాంగ్రెస్ నేతలు కూడా శ్రీశైలం వెళ్ళడానికి ప్రయత్నించారు. దిండి వద్ద రేవంత్ రెడ్డి, మల్లురవి, ఇతర కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   7 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   10 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   13 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   13 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   14 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   11 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   a day ago


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle