వరవరావు ఆసుపత్రి నుంచి విడుదల.. మళ్లీ తిరిగి జైలుకేనా..
28-08-202028-08-2020 06:57:41 IST
2020-08-28T01:27:41.017Z28-08-2020 2020-08-28T01:27:17.278Z - - 12-04-2021

ఎల్గార్ పరిషద్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అరెస్టు చేసిన ప్రముఖ తెలుగు కవి, విరసం సీనియర్ నేత వరవరరావు (81) కరోనా వైరస్ కోరల నుంచి తప్పించుకున్నారు. కరోనా పాజిటివ్‌గా నమోదై జైలునుంచి అసుపత్రికి వెళ్లిన వీవీ ఎట్టకేలకు స్వస్థత చెందడంతో గురువారం ఆయన్ని ముంబైలోని నానావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. జూలై 19న ఆసుపత్రిలో చేరిన వీవీ దాదాపు 35 రోజులుగా కరోనా వైరస్‌కు చికిత్స పొందుతూ వచ్చారు. ఆరోగ్యం కుదుటపడటంతో ఆయన్ని తిరిగి నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించారు. ముంబై సౌత్ రీజియన్ ప్రిజన్స్ ఐజీ దీపక్ పాండే తాజా పరిణామాలను ధ్రువీకరించారు. జైలులో అపస్మారక స్థితిలోకి వెళ్లిన వరవరరావును మే నెల 28న ముంబైలోని జేజే ఆసుపత్రిలో చేర్చారు. కానీ జూన్ 1న ఆయనను డిశ్చార్జ్ చేశారు. అయితే ఆయన బెయిల్ పిటిషన్‌ని అడ్డుకోవడానికి తొందరతొందరగా వీవీని ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ చేసిన సమయానికి వీవీ ఆరోగ్యం బాగాలేదు. మనిషి శరీరంలో సోడియం సాధారమ స్థాయి 134-145 మధ్య ఉండాలి. కానీ వీవీలో అది 133గా మాత్రమే ఉంది. అలాగే పొటాషియం సాధారణ రేంజి 3.5 నుంచి 5.0 స్థాయిలో ఉండాలి కానీ వీవీలో 3.55 రేంజిలో మాత్రమే ఉంటూ వచ్చింది. ఆసుపత్రిలో ఇదంతా నమోదై ఉన్నప్పటికీ జూన్ 2న ఆయన్ని అర్జెంటుగా ఆసుపత్రి నుంచి తరలించి జైలుకు పంపడం పోలీసులు కుట్రే అని వీవీ కుటుంబ సభ్యులు ఆరోపించారు. జూలై 2న వీవీ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉండగా ఆసుపత్రిలో ఆయన కండిషన్ సాధారణంగానే ఉందని వాదించిన పోలీసులు ఎన్ఐఓ ప్రత్యేక కోర్టులో వీవీ బెయిల్‌కి వ్యతిరేకంగా వాదించారు. న్యాయమూర్తి పోలీసుల వాదననే ఆమోదించి జూన్ 26న వీవీ బెయిల్ పిటిషన్‌ని తోసిపుచ్చారని వీవీ కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ తర్వాత వరవరరావులో మతిభ్రమించిన లక్షణాలు కనిపించడం ఆయన ఆరోగ్యంపై అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో జూలై 13న వీవీని తిరిగి జేజే హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఆయనకు పాజిటివ్ అని తేలింది. దీంతో వీవీని సెయింట్ జార్జ్ ఆసుపత్రిలో చేర్చారు. ఈలోగా జాతీయ మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకుని మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపి వరవరరావు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఆయనకు తగినన్ని వైద్య సౌకర్యాలు కల్పించాలని కోరింది. వీవీ ఆరోగ్యంపై తనకు నివేదిక పంపాలని కూడా హక్కులు కమిషన్ ఆదేశించింది. జీవించే హక్కు, వైద్య సంరక్షణ అనేవి అత్యంత ప్రాథమిక మానవహక్కులని, ఖైదీలకు కూడా ఈ హక్కులను కల్పించాల్సి ఉందని, వీవీ ఆరోగ్యంపై వైద్య మండలిని ఏర్పర్చి ఆయనకు తగు చికిత్స అందించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్‌గా హెచ్చరించిన తర్వాతే వరవరరావును వైద్యచికిత్స కోసం నానావతి ఆసుపత్రికి తరలించారు.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
8 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
11 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
14 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
5 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
15 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
12 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
15 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
15 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
9 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
18 hours ago
ఇంకా