newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వరవరరావు విడుదలకు మావోల వత్తిడి.. 25న తెలంగాణ బంద్

22-07-202022-07-2020 08:50:31 IST
Updated On 22-07-2020 12:06:11 ISTUpdated On 22-07-20202020-07-22T03:20:31.280Z22-07-2020 2020-07-22T03:19:04.471Z - 2020-07-22T06:36:11.981Z - 22-07-2020

వరవరరావు విడుదలకు మావోల వత్తిడి.. 25న తెలంగాణ బంద్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భీమా కోరేగావ్ కేసులో అరెస్టయిన తెలంగాణకు చెందిన విప్లవకవి వరవర రావును విడుదల చేయించడానికి మావోయిస్టులు రంగంలోకి దిగారు. వరవర రావును విడుదల చేయించేలా తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకుని రానున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 25వ తేదీన తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు.

ఈ మేరకు మావోయిస్టు తెలంగాణ కమిటీ నేత జగన్ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. తెలంగాణ ఉత్తర ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఊపందుకుంటున్నట్లు వార్తలు వస్తోన్న నేపథ్యంలో.. ఈ బంద్‌కు పిలుపునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.ఎల్గార్ పరిషత్-భీమా కోరేగావ్ కేసుతో పాటు మావోయిస్టులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేయడానికి కుట్ర పన్నారనే కారణంతో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు 2018 నవంబర్‌లో వరవర రావును అరెస్టు చేశారు. ముంబైలోని తలోజా జైలుకు తరలించారు. 

తలోజా జైలులో విచారణ ఖైదీగా ఉన్న వరవర రావు కొద్దిరోజుల కిందట అనారోగ్యానికి గురయ్యారు. అనంతరం కరోనా వైరస్ బారిన కూడా పడ్డారు. ప్రస్తుతం ఆయనకు ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.81 సంవత్సరాల వయస్సున్న వరవర రావును వెంటనే విడుదల చేయాలంటూ బోంబే హైకోర్టులోనూ పిటీషన్ దాఖలైంది. దీనిపై విచారణ కొనసాగుతోంది. అదే సమయంలో మావోయిస్టులు రంగంలోకి దిగారు.

వరవర రావు సహా ఈ కేసుతో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలను ఎదుర్కొంటూ జైలు జీవితాన్ని గడుపుతోన్న 12 మంది ప్రజా సంఘాల నేతలను విడుదల చేయాలనే డిమాండ్‌తో మావోయిస్టులు 25వ తేదీన తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. వరవర రావును అరెస్టు చేయడం వెనుక ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర దాగి ఉందని ఆరోపిస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో విస్తరించి ఉన్న అడవుల్లో కూంబింగ్‌ను వెంటనే నిలిపివేయాలని మావోయిస్టు తెలంగాణ కమిటీ నేత జగన్ డిమాండ్ చేశారు. దీనికోసం నియమించిన గ్రేహౌండ్స్ బలగాలను ఉపసంహరించుకోవాలని అన్నారు.

వరవర రావు, ప్రొఫెసర్ సాయిబాబా, ఆనంద్‌ టెలుతుంబ్డే, సుధా భరద్వాజ్‌, వెర్నర్‌ గోంజాల్వేస్‌, గౌతమ్‌ నవలేకర్ వంటి 12మంది కవులు, రచయితలు, ప్రజాసంఘాల కార్యకర్తలపై కేంద్ర ప్రభుత్వం అర్బన్‌ నక్సల్స్‌ అనే ముద్ర వేసిందని విమర్శించారు. భీమా కోరెగావ్ సంఘటనలో తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు.

 

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   5 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   6 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   6 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   10 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   11 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   9 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   12 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   12 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   7 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   14 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle